Pooja Hegde in Nithin Vakkantham Vamsi Movie

Wednesday,July 07,2021 - 04:21 by Z_CLU

 

Nithin Pooja Hegde Movie Details

ప్రస్తుతం 'అంధదూన్' సినిమా షూటింగ్ ఫినిష్ చేసిన నితిన్ నెక్స్ట్ వక్కంతం వంశీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే నితిన్ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన వంశీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నితిన్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం పూజా ఆచార్య సినిమాతో పాటు తమిళ్ లో విజయ్ తో, హిందీలో రణ్వీర్ సింగ్ తో ఓ సినిమా చేస్తుంది.

pooja hegde new stills zeecinemalu

త్వరలోనే మహేష్ సినిమాకు డేట్స్ ఇవ్వనుంది పూజా. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న #SSMB28 సినిమాలో హీరోయిన్ గా నటించనుంది. ఆ సినిమాతో పాటే తెలుగులో నితిన్ సినిమా కూడా సైన్ చేసిందని టాక్. ఈ రెండు సినిమాలు ఓకె టైంలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

Nithin RangDe movie stills  

ఈ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేశాక మిగతా సినిమాలకు ఓకె చెప్పి డేట్స్ ఇవ్వనుంది. అప్పటివరకు తమిళ్ లో విజయ్ 'బీస్ట్' సినిమా , తెలుగులో 'ఆచార్య' ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. 'అల వైకుంఠపురములో' తో ఎనలేని క్రేజ్ అందుకొని వరుస ఆఫర్లు సొంతం చేసుకుంటున్న పూజా ఈ సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుంటే ఓ రెండు మూడేళ్ళ పాటు టాప్ హీరోయిన్ గా దూసుకెళ్ళడం ఖాయం.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics