F3 Movie has more fun than F2 – Anil Ravipudi

Wednesday,March 10,2021 - 11:39 by Z_CLU

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతోంది F3 Movie. అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉంటుందంటున్నాడు దర్శకుడు. F2కు మూడింతలు ఫన్ ఇందులో ఉంటుందని చెబుతున్నాడు.

"ఎఫ్2 నచ్చిన ప్రతి ఒక్కరికి ఎఫ్3 నచ్చుతుంది. ట్రిపుల్ ఫన్ ఉంటుంది. హ్యాపీగా నవ్వుకుంటారంతా. ఎఫ్2లో ఉన్న సిగ్నేచర్స్ అన్నీ ఉన్నాయి. వాటికి అదనంగా ఇంకొన్ని కొత్తవి కూడా యాడ్ చేశాం. ఎఫ్2లో భార్యల గురించి ఫ్రస్ట్రేషన్. ఎఫ్3లో డబ్బు గురించి ఫ్రస్ట్రేషన్."

దీంతోపాటు F3 Movie పై మరో క్లారిటీ కూడా ఇచ్చాడు అనీల్ రావిపూడి. F2కు ఇది సీక్వెల్ కాదంటున్నాడు. క్యారెక్టరైజేషన్స్ మాత్రమే సేమ్ ఉంటాయని, కథ మాత్రం కంప్లీట్ కొత్తగా ఉంటుందని చెబుతున్నాడు.