Interview – Sree Vishnu (Gali Sampath)

Wednesday,March 10,2021 - 01:53 by Z_CLU

శివరాత్రి కానుకగా వస్తోంది గాలి సంపత్. శ్రీవిష్ణు-రాజేంద్రప్రసాద్ తండ్రికొడుకులుగా నటించిన ఈ సినిమాకు అనీల్ రావిపూడి స్క్రీన్ ప్లే అందించాడు. దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశాడు. అయితే సినిమా మాత్రం అనీల్ రావిపూడి మార్కులో కాకుండా.. తన ట్రేడ్ మార్క్ కథతోనే వస్తోందంటున్నాడు హీరో శ్రీవిష్ణు.

- గాలి సంపత్ అలా పుట్టాడు ఓసారి అనీల్ రావిపూడి ఫోన్ చేసి కలుద్దాం అన్నారు. కలిసి పాయింట్ చెప్పారు. నచ్చితే చేద్దామన్నారు. నేను రెడీ అన్నాను. కాకపోతే ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అని అడిగాను. రాజేంద్రప్రసాద్ అని చెప్పగానే నాకు మొత్తం ఐడియా వచ్చేసింది. వెంటనే ఓకే చెప్పేశాను.

- రాజేంద్రప్రసాద్ తో అనుబంధం ఈ తండ్రికొడుకుల కథ. పూర్తిగా తండ్రి కథ కాదు, అలాఅని కొడుకు కథ కాదు. ఈ ఇద్దర్లో ఎవ్వరు లేకపోయినా ఇది కథ కాదు. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో మూగ వ్యక్తిగా కనిపిస్తారు. షూట్ అయిన వెంటనే ఓ 2 గంటలు ఆయనతో కూర్చునేవాడ్ని, మాట్లాడుకునేవాళ్లం. పర్సనల్ గా బాగా దగ్గరయ్యాం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.

- సింగిల్ టేక్స్ ఎక్కువ నా పాత్ర కోసం ఎలాంటి ఇన్ పుట్స్ తీసుకోలేదు. చాలా ఈజీగా చేసేశాను. 2-3 చోట్ల కెమెరా వల్ల ఇబ్బందులు తప్పితే.. సినిమాలో అన్ని షాట్స్ సింగిల్ టేక్ లో చేశాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ లో వచ్చే పెద్ద పెద్ద సీన్లు కూడా సింగిల్ టేక్ లో చేశాను.

Sree Vishnu

- బాధ్యతగా కనిపిస్తూనే ఫన్ ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ రెండూ సమానంగా ఉంటాయి. నా పాత్రలో బాధ్యత ఎక్కువగా ఉంటుంది. రాజేంద్రప్రసాద్ పాత్రలో జులాయి, ఫన్ ఉంటుంది. తండ్రిని కొడుకు ఎలా మార్చాడనేది పాయింట్. నాకు బాధ్యతలు ఉన్నప్పటికీ సీన్లు మాత్రం ఫన్ గా ఉంటాయి. ఎమోషన్ పార్ట్ నాకు-రాజేంద్రప్రసాద్ మధ్య ఎక్కువగా ఉంది.

- దేనికైనా టైమ్ తీసుకుంటాను చాలా కథలు వింటాను. కానీ వెంటనే చెప్పను. కథ విన్న తర్వాత టైమ్ తీసుకుంటాను. ఆలోచించి ఒప్పుకుంటాను. ఒక వేళ రిజెక్ట్ చేయాల్సి వచ్చినా స్మూత్ గా చెబుతాను. ఏ హీరోకు సూట్ అవుతుందో కూడా చెబుతాను. నెగెటివ్ పాత్రల విషయానికొస్తే.. నెగెటివ్ షేడ్స్ లో నన్ను ప్రేక్షకులు చూడరని అనుకుంటున్నాను. మంచి కథ వస్తే మాత్రం చేస్తాను.

- ఇది ముందు, అది తర్వాత నిజానికి గాలి సంపత్ కంటే ముందు రాజరాజచోర రావాలి. పీపుల్ మీడియా బ్యానర్ పై ఆ సినిమాను చాన్నాళ్ల కిందటే పూర్తిచేశాను. కానీ దాని కంటే ముందు గాలి సంపత్ వస్తోంది. దాని తర్వాత రాజ రాజ చోర వస్తుంది. ఈ ఏడాది నా నుంచి 3 సినిమాలు పక్కా వస్తాయి.

Sree Vishnu

- 20 ఏళ్ల తర్వాత గాలి సంపత్ గా మళ్లీ వస్తా గాలి సంపత్ నాకు ఎంత ఇష్టమంటే.. అన్నీ అనుకున్నట్టు జరిగితే 20 ఏళ్ల తర్వాత ఈ సినిమాను మళ్లీ నేనే రీమేక్ చేస్తాను. కాకపోతే అప్పుడు రాజేంద్రప్రసాద్ గారు చేసిన గాలి సంపత్ పాత్రను చేస్తాను. రాజేంద్రప్రసాద్ చేసిన యాక్టింగ్ లో కనీసం 5 శాతమైనా చేయాలి. అదే నా కోరిక.

- అప్ కమింగ్ ప్రాజెక్టులు అప్ కమింగ్ ప్రాజెక్టుల విషయానికొస్తే రాజరాజ చోర కంప్లీట్ అయిపోయింది. త్వరలోనే రిలీజ్ చేసేస్తాం. దీని తర్వాత అర్జున్ పాల్గుణ సినిమా చేయాలి. ఇప్పటివరకు 60 శాతం షూట్ పూర్తయింది. దీని తర్వాత కొత్త దర్శకుడితో పోలీసాఫీసర్ బయోపిక్ చేస్తున్నాను. ఇదొక ఫిక్షనల్ బయోపిక్. సినిమా అంతా యాక్షనే, కానీ ఒక్క ఫైట్ కూడా ఉండదు. బాణం దర్శకుడు చైతన్యతో భళా తందనానతో మరో సినిమా చేస్తున్నాను.