Confusion on Nithin’s Maestro Release Date

Wednesday,August 25,2021 - 07:10 by Z_CLU

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'అంధదూన్' ని తెలుగులో 'మాస్ట్రో' టైటిల్ తో రీమేక్ చేశాడు నితిన్. డైరెక్టర్ మేర్లపాక గాంధి హ్యాండిల్ చేసిన ఈ రీమేక్ సినిమా సెప్టెంబర్ 9న డైరెక్ట్ OTT లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు మేకర్స్. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ లో రిలీజ్ డేట్ కూడా వేశారు. కానీ ఇంతలోనే మళ్ళీ వెనకడుగు వేసి ట్రైలర్ లో రిలీజ్ డేట్ తీసేసి కమింగ్ సూన్ అంటూ మరోసారి అప్లోడ్ చేశారు.

దీంతో ఉన్నపళంగా ప్రకటించిన డేట్ ఎందుకు తీసేశారు ? అసలు ఏమైంది అనే చర్చ నడుస్తుంది. అయితే దీనికి రీజన్ ఉంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్ స్టోరి' సెప్టెంబర్ 10న రిలీజ్ అవుతుంది. అయితే అదే రోజు నాని నటించిన 'టక్ జగదీష్' కూడా OTT రిలీజ్ అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో 'లవ్ స్టోరి' నిర్మాత సునీల్ నైజాం డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టి నాని సినిమా మా డేట్ కి రిలీజ్ అవుతుందని విన్నాం వారు పోస్ట్ పోన్ చేసుకోవాలి అంటూ స్పీచ్ ఇచ్చారు.

అదే ప్రెస్ మీట్ లో నానిపై కొందరు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ తమ కోపం చూపిస్తూ మాట్లాడారు.సెకండ్ వేవ్ తర్వాత థియేటర్స్ లో వస్తున్న హైప్ ఉన్న ఏకైక సినిమా లవ్ స్టోరి. ఈ సమయంలో జనాలని థియేటర్స్ నుండి OTT కి మరో బజ్ ఉన్న సినిమాతో లాగడం కరెక్ట్ కాదని ఫైనల్ అందరు వాదించారు.

ఇక సెప్టెంబర్ 9న అంటే లవ్ స్టోరి థియేటర్స్ కి వచ్చే ఒక రోజు ముందు మాస్ట్రో రిలీజ్ అన్నమాట. బహుశా నానిపై వ్యాఖ్యాలు చేసినట్టు తనపై కూడా ఇలాంటి కామెంట్స్ వస్తాయని అనుకున్నాడో ఏమో కానీ ఉన్నపళంగా రిలీజ్ డేట్ ని తీసేశారు. మరి మాస్ట్రో ఆ డేట్ కి రాకుండా పోస్ట్ చేస్తారా ? లేదా మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నారా ? ఏదేమైనా మాస్ట్రో రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో మాత్రం గట్టి చర్చే నడుస్తుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics