Gopichand’s Seetimaar to release on September 3

Wednesday,August 25,2021 - 07:03 by Z_CLU

మ్యాచో హీరో గోపీచంద్ , తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన 'సీటిమార్' రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమాఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతుంది. సెప్టెంబర్ ౩న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. స్పోర్ట్స్ బేస్డ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. రిలీజ్ కి రెడీ అవుతుండగా సడెన్ గా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది.

seetimaar gopichand

దీంతో మేకర్స్ OTT నా ? థియేటర్స్ ఆ? అనే డైలమాలో పడ్డారు. ఇక సినిమాను OTT కి అమ్మేశారని టాక్ కూడా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. ఫైనల్ గా మేకర్స్ ఇప్పుడు థియేటర్ రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చి సెప్టెంబర్ 3 రిలీజ్ అంటూ ప్రకటించారు. గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో భూమిక ముఖ్య పాత్రలో కనిపించనుంది.

seetimaar tamanna gopichand

ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాతో గోపీచంద్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. కబడ్డీ నేపథ్యంతో యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బేనర్ పై శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు యూనిట్. త్వరలోనే ప్రమోషన్స్ మొదలు పెట్టి మీడియా ముందుకు రానున్నారు. మరి గోపీచంద్ ఈ సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ అందుకుంటాడా ? వేచి చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics