Chiranjeevi is eagerly waiting for Vakeel Saab

Thursday,April 08,2021 - 05:45 by Z_CLU

ఖైదీ నంబర్ 150లో చిరంజీవి ఓ డైలాగ్ చెబుతారు. ఇంటర్వెల్ టైమ్ లో వచ్చే ''వెయిటింగ్'' అనే డైలాగ్ పెద్ద హిట్. ఇప్పుడు ఇదే డైలాగ్ ను వకీల్ సాబ్ కోసం వాడుతున్నారు మెగాస్టార్. తమ్ముడు పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా కోసం వెయిటింగ్ అంటూ పోస్ట్ పెట్టారు.

"చాలా కాలం తరువాత @PawanKalyan ని వెండితెర మీద చూడటానికి మీలాగే నేనుకూడా ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్ లో #VakeelSaab చూస్తున్నాను. Can't wait to share my response of the film with you all. Stay tuned"

ఇలా వకీల్ సాబ్ పై తనకున్న ఎక్సైట్ మెంట్ ను షేర్ చేసుకున్నారు చిరు. అక్కడితో ఆగలేదాయన. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ హెయిర్ స్టయిల్ ను మెగాస్టార్ సరిచేస్తున్నారు. ఫొటో చూస్తుంటే.. పవన్ కెరీర్ ప్రారంభంలో తీసిన స్టిల్ లా ఉంది.

మెగాస్టార్ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి పోస్ట్ చేసిన ఫొటోను మెగాభిమానులు వైరల్ చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్. పైగా చిరంజీవి సలహాతోనే పవన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చారనే టాక్ కూడా ఉంది. అందుకే ప్రేక్షకులతో పాటు చిరంజీవి కూడా ఆసక్తిగా వకీల్ సాబ్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ అంతా వకీల్ సాబ్ రిజల్ట్ కోసమే ఎదురుచూస్తోంది. లాక్ డౌన్ తర్వాత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఈ మూవీ రిజల్ట్ తో మిగతా సినిమాల విడుదలపై ఓ క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ బజ్ నడుస్తోంది కాబట్టి, వకీల్ సాబ్ కు సగం లైన్ క్లియర్ అయినట్టే. వేణు శ్రీరామ్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics