‘Vakeelsaab’ After 15 months A Star hero movie coming in theaters !

Thursday,April 08,2021 - 03:19 by Z_CLU

మనిషి లైఫ్ లో ఎంటర్టైన్ మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎంటర్టైన్ మెంట్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది సినిమా. ఇక స్టార్ హీరో సినిమా అంటే ఎంటర్టైన్ మెంట్ కి కొదవే ఉండదు. ఫైట్స్ , సాంగ్స్ , పవర్ ఫుల్ డైలాగ్స్ రూపంలో ఆడియన్ కి పర్ఫెక్ట్ వినోదం అందుతుంది. అయితే కరోన కారణంగా గత పది హేను నెలల నుండి ఒక్క స్టార్ హీరో సినిమా కూడా విడుదల కాలేదు.  'క్రాక్', 'ఉప్పెన' ,'జాతి రత్నాలు' లాంటి సినిమాలు ప్రేక్షకులకు ఎంటర్టైన్ మెంట్ అందించినా స్టార్ హీరో నుండి పెద్ద సినిమా రావడం లేదనే కొరత మాత్రం ప్రేక్షకుల్లో అలానే ఉండిపోయింది.

పదిహేను నెలల తర్వాత ఇప్పుడు ఆ కొరత 'వకీల్ సాబ్' తో  తీరబోతుంది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ నుండి వస్తున్న సినిమా, అదీ కరోనా ఎఫెక్ట్ తర్వాత భారీ ఎత్తున విడుదలవుతున్నబడా సినిమా కావడంతో 'వకీల్ సాబ్' బుకింగ్స్ లో జోరు చూపిస్తోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ బుకింగ్స్ క్లోజ్ అయ్యాయి. రెండు మూడు రోజుల వరకూ సామాన్యుడికి టికెట్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రిలీజ్ కి ముందే ఎక్కడ చూసినా  హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఓవర్ సీస్  టాక్ ని బట్టి బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏదేమైనా కొన్ని నెలల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ లో ఓ కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఓ రేంజ్ టికెట్ల అమ్మకాలతో సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అనిపిస్తుంది.

 

Also Read డైరెక్టర్ శ్రీ రామ్ వేణు స్పీచ్ (వకీల్ సాబ్)

  *Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics