Avika Gor again busy with movies in tollywood

Wednesday,June 30,2021 - 03:52 by Z_CLU

తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన అవిక గొర్ మొదటి సినిమాతో మంచి విజయంతో పాటు గుర్తింపు కూడా అందుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసిన హీరోయిన్ గా మరో మెట్టు ఎక్కలేకపోయింది. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావ',' ఎక్కడికి పోతావు చిన్న వాడ' సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకున్నప్పటికీ ఆ తర్వాత అవిక చేసిన సినిమాలతో వరుసగా అపజయాలు చవి చూసింది. దీంతో కొన్నేళ్ళు టాలీవుడ్ లో బ్రేక్ తీసుకుంది.

avika gor new stills zeecinemalu

అయితే ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్ పై పూర్తి ఫోకస్ పెడుతూ వరుస సినిమాలు చేస్తుంది. అవును అవిక చేతిలో ఇప్పుడు నాలుగైదు సినిమాలున్నాయి. ఈరోజు అవిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుండి ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. కళ్యాణ్ దేవ్ హీరోగా అవిక హీరోయిన్ గా నటిస్తున్న సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేసి ఆమెకి విషెస్ చెప్పారు. అలాగే 'పాప కార్న్' అనే సినిమాతో పాటు మరో రెండు సినిమాల టీం నుండి అవిక కి విషెస్ అందాయి.

ఇలా వరుస ఫస్ట్ లుక్స్ తో సోషల్ మీడియాలో బర్త్ డే గర్ల్ హంగామా చేస్తోంది. అవిక హీరోయిన్ గా సినిమాలు చేయట్లేదేంటి ? అనుకున్నవారు ఇప్పుడు ఆమె తెలుగులో నటిస్తున్న సినిమాల లిస్టు చూసి సప్రయిజ్ అవుతున్నారు. మరి ఈ సినిమాలతో ముంబై బ్యూటీ ఎలాంటి హిట్స్ అందుకుంటుందో ? మళ్ళీ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అనిపించుకుంటుందా ? చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics