Ari Movie first looks released

Saturday,October 15,2022 - 12:12 by Z_CLU

అనసూయ, సాయి కుమార్, సుమన్, ఆమని, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "అరి". ఈ సినిమాకు పెట్టుకున్న బ్యాడ్ ఈజ్ న్యూ గుడ్ అనే క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. ఈ చిత్రాన్నిఆర్వీ రెడ్డి సమర్పణలో అర్వీ సినిమాస్ బ్యానర్ పై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.

పేపర్ బాయ్ సినిమా ద్వారా ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్, ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలోని ఒక్కో పాత్రను రివీల్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్స్ ఫస్ట్ లుక్స్, వాటి పేర్లు వైవిధ్యంగా ఉండి సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి.

జలసీ పాత్రలో అనసూయ, ప్రైడ్ గా సాయి కుమార్, యాంగర్ క్యారెక్టర్ లో శ్రీకాంత్ అయ్యంగార్, లస్ట్ గా వైవా హర్ష, గ్రీడీ పాత్రలో శుభలేఖ సుధాకర్, అటాచ్ మెంట్ క్యారెక్టర్ లో సురభి ప్రభావతి నటిస్తున్నారు. వీరి క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ కొత్తగా ఉన్నాయి.

మనిషి ఎలా బతకకూడదు అనే విషయాన్ని ఈ సినిమా ద్వారా ఆసక్తికరంగా చూపిస్తున్నారు. ప్రస్తుతం అరి సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.