BUZZ : Abhishek Bachchan to remake ‘Ari’ in Hindi ?

Monday,June 12,2023 - 03:19 by Z_CLU

సాయి కుమార్ , అనసూయ , శ్రీకాంత్ అయ్యంగార్ , హర్ష తదితరులతో దర్శకుడు జయశంకర్ తీసిన 'ఆరి' సినిమా రిలీజ్ కి ముందే  బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ను ఎట్రాక్ట్ చేసింది. తాజాగా చిత్ర దర్శకుడు జయశంకర్ ఓ సందర్భంలో అభిషేక్ ను కలిశారు. ఆరి సినిమాకు సంబంధించి స్టోరీ వినిపించారు. టీజర్ , ట్రైలర్స్ చూపించారట. కంటెంట్ చూసి ఇంప్రెస్ అయిన అభిషేక్ ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తే తను నటిస్తానని మేకర్స్ మాటిచ్చారట.

అన్నీ కుదిరితే ఆరి సినిమా త్వరలోనే అభిషేక్ హీరోగా జయశంకర్ దర్శకత్వంలో హిందీలో  రీమేక్ అవ్వనుంది. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. మంగ్లీ పాడిన సాంగ్ కూడా ఆకట్టుకుంది. కృష్ణ తత్వంతో ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.  ఆగస్ట్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కి ముందే హిందీ రీమేక్ రైట్స్ కి డిమాండ్ ఏర్పడింది.