AR Rahman Music for NTR-BuchiBabu Movie

Tuesday,February 01,2022 - 06:18 by Z_CLU

ప్రస్తుతం RRR రిలీజ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ ఆ సినిమా రిలీజైన వెంటనే కొరటాల శివ తో చేయబోయే #NTR30 ని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఆ ప్రాజెక్ట్ తో పాటే ఇంకో సినిమాను కూడా లాక్ చేసుకున్నాడు తారక్. 'ఉప్పెన'తో సెన్సేషనల్ హిట్ అందుకున్న బుచ్చిబాబు దర్శకత్వంలో #NTR31 సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఉప్పెన రిలీజైన వెంటనే తారక్ ని కలిసి ఓ స్క్రిప్ట్ నెరేట్ చేసి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు బుచ్చిబాబు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టింగ్ జరుగుతుంది. తన టీంతో కలిసి కథకి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు బుచ్చిబాబు. త్వరలోనే తారక్ కి ఫైనల్ నరేషన్ ఇవ్వనున్నాడు. కబడ్డీ ఆటతో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. విజయనగరం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రెహమాన్ మ్యూజిక్ అందించనున్నాడని టాక్ చక్కర్లు కొడుతుంది. ఈ న్యూస్ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తూ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెంచేస్తుంది. ఇటివలే మేకర్స్ రెహమాన్ ని అప్రోచ్ అయ్యారని వినిపిస్తుంది. నిజానికి ఉప్పెనకి బెస్ట్ ఆల్బం అందించి సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించిన దేవి శ్రీ ప్రసాద్ నే బుచ్చిబాబు తన రెండో సినిమాకు కూడా రిపీట్ చేస్తాడని తారక్ ఫ్యాన్స్ ఊహించారు. కానీ ఇప్పుడు సడెన్ గా రెహమాన్ పేరు రావడంతో సర్ప్రయిజ్ అవుతున్నారు.

ఇక హీరోయిన్ గా పలు పేర్లు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ అవ్వనుంది. ఆ తర్వాత మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.