Vijay devearakonda, Samantha’s ‘Kushi’ Release date out

Thursday,March 23,2023 - 05:36 by Z_CLU

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'ఖుషీ'. బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో సెన్సిబుల్ మూవీ మేకర్ గా పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండ , సమంత కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో మహానటి చిత్రంలో విజయ్, సమంత కలిసి నటించారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఖుషీ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతోంది.

అలాగే మజిలీ చిత్రం తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తున్న రెండో సినిమా ఇది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తరువాత సమంత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తోంది. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఖుషీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు. కశ్మీర్ తో పాటు ఎన్నో అందమైన లొకేషన్స్ లో ఘాట్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీం కేరళ వెళ్లనున్నారు. మాన్ సూన్ లో రెండు భిన్నమైన నేపథ్యాల మధ్య రాబోతోన్న ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు చెప్తున్నారు.