Allu Arjun to romance with Krithi Shetty in ‘Icon’ ?

Wednesday,September 08,2021 - 05:39 by Z_CLU

'పుష్ప (ది రైజ్)' సినిమా తర్వాత అల్లు అర్జున్ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో 'ఐకాన్' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  కొన్ని నెలల క్రితమే స్క్రిప్ట్ లాకయిన ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. మరో వైపు కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్.  'ఉప్పెన' యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి ని బన్నీ సరసన హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం. అయితే కృతి ని మెయిన్ హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ గా తీసుకోనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం కృతి మూడు సినిమాలతో బిజీగా ఉంది.

ఇక మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే ని లాక్ చేయబోతున్నారట. ఇప్పటికే బన్నీ, పూజ కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ లో వచ్చిన 'అల వైకుంఠ పురములో' భారీ విజయం నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో బన్నీ -పూజ కెమిస్ట్రీ కి మంచి మార్కులు పడ్డాయి. అందుకే పూజ ని బన్నీ సరసన మరోసారి రిపీట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. పూజతో బన్నీ కెమిస్ట్రీ సూపర్బ్ గా వర్కౌట్ అవుద్దనే సంగతి తెలిసిందే. కానీ కృతితో బన్నీ కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందో చూడాలి.

AlluArjun-PoojaHegde-KrithiShetty-zeecinemalu

త్వరలోనే మేకర్స్ హీరోయిన్ డీటెయిల్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయనున్నారు. అక్టోబర్ లో దసరా కానుకగా ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు , శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించే అవకాశం ఉంది.

- Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics