Movie Review – NET (ZEE5 Original Film)

Thursday,September 09,2021 - 05:07 by Z_CLU

నటీనటులు: రాహుల్ రామకృష్ణ, లక్ష్మణ్, అవికా గోర్, ప్రియా, ప్రణీతా పట్నాయక్, సుచిత్ర, విశ్వదేవ్, రంజిత్ తదితరులు.. ఎడిటర్: రవితేజ గిరిజాల సినిమాటోగ్రాఫర్: అభిరాజ్ నాయర్ మ్యూజిక్: నరేష్ కుమరన్ ప్రొడ్యూసర్స్: రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా క్రియేటర్ - రైటర్ - స్క్రీన్ ప్లే - డైరెక్టర్ : భార్గవ్ మాచర్ల

రన్ టైమ్: 90 నిమిషాలు

ఓటీటీ: ZEE5

Rahul ramakrishna NET movie review in telugu  

ఆన్ లైన్ మోసాలు, అరాచకాల మీద ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. కానీ NET లో ఓ కొత్త కోణాన్ని చూపించాడు దర్శకుడు భార్గవ్. ఓ ఇంట్లో కెమెరాలు పెట్టి వారి జీవితాన్ని లైవ్ లో చూపించే కేటుగాళ్ళు, వాటిని లైవ్ లో చూస్తే ఎంజాయ్ చేసే జనాలపై ఓ కాన్సెప్ట్ రాసుకొని దానికి మంచి ఎమోషన్ జోడించి OTT ఆడియన్స్ కి భలే కంటెంట్ అందించాడు దర్శకుడు. ఇక కేవలం ఆన్ లైన్ మోసాలే కాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు వారి వ్యక్తిగత జీవితాన్ని తన స్టైల్ లో రియాలిటీ కి దగ్గరగా నేచురల్ గా చూపించాడు.

ఎలాంటి ఎక్స్ పీరియన్స్ లేకపోయినప్పటికీ కొన్ని సన్నివేశాలను అనుభవం ఉన్న దర్శకుడిలా హ్యాండిల్ చేశాడు భార్గవ్. ముఖ్యంగా లక్ష్మణ్ అతని భార్య మధ్య వచ్చే సనివేశాలను చాలా బాగా తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. కాకపోతే కొన్ని సన్నివేశాల్లో లాజిక్స్ మిస్ అయ్యాడు. అవి చిన్న మైనస్ లు అనిపిస్తాయి.

Rahul ramakrishna NET movie review in telugu

ఇక నటీనటుల విషయానికొస్తే రాహుల్ రామకృష్ణ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఈ ఒరిజినల్ మూవీ చూసినంత సేపు మనకి రాహుల్ కనబడదు, కేవలం లక్ష్మన్ అనే పాత్ర మాత్రమే కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో అతని నటన హైలైట్ గా నిలిచింది. ఇక రాహుల్ రామకృష్ణ తర్వాత నటి ప్రణీత పట్నాయక్ గురించి మాట్లాడుకోవాలి. ఒక గ్రామీణ వ్యక్తి భార్యగా ఆమె నటన అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సన్నివేశాల్లో రాహుల్ తో పోటీ పడి మరీ నటించింది. అవిక ఈ టైప్ క్యారెక్టర్ చేయడం కొత్తగా అనిపించింది. తన పాత్రకు పర్ఫెక్ట్ అనిపించుకొని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. క్లైమాక్స్ లో ఆమె నటనకి మంచి మార్కులు పడతాయి.

విశ్వదేవ్ కూడా తన రోల్ కి సూటయ్యాడు. లక్ష్మణ్ బావమరిది పాత్రలో విష్ణు మంచి నటన కనబరిచాడు. క్లైమాక్స్ లో రాహుల్ ని కొట్టే సీన్ లో విష్ణు నటన బాగుంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

Rahul ramakrishna NET movie review in telugu  

ఈ వెబ్ మూవీకి టెక్నికల్ గా కూడా మంచి సపోర్ట్ అందింది. ముఖ్యంగా అభిరామ్ సినిమాటోగ్రఫీ నేచురల్ గా ఉంది. నరేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అయింది. రవితేజ ఎడిటింగ్ క్రిస్ప్ గా ఉంది. భార్గవ్ రాసుకున్న పాయింట్ తో పాటు డైరెక్షన్ బాగుంది. రాహుల్ తమడ, సాయి దీప్ రెడ్డి ప్రొడక్షన్ వాల్యూస్ కథకి తగ్గట్టుగా ఉన్నాయి.

ఫైనల్ గా గంటన్నర నిడివితో ఉన్న ఈ వెబ్ మూవీ మంచి పాయింట్ తో నేచురల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటుంది.

#NET ఒరిజినల్ ఈరోజు రాత్రి 12 గంటల నుండి Zee5 లో అందుబాటులో ఉంటుంది.