Allu Arjun next movie After PUSHPA

Saturday,April 24,2021 - 01:45 by Z_CLU

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్ సుకుమార్ తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా నవంబర్ విడుదల కానుంది. అయితే ఈ సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడనేది ఆభిమనుల్లో ఆసక్తి నెలకొల్పుతుంది.

నిజానికి పుష్ప సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా ఎనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు కొరటాల NTR30 కి షిఫ్ట్ అయ్యాడు. తాజాగా ఎన్టీఆర్-కొరటాల సినిమా ఎనౌన్స్ అవ్వడంతో బన్నీ-కొరటాల సినిమా ఇప్పుడే ఉండదని క్లారిటీ వచ్చేసింది. మేకర్స్ కూడా సినిమా ఉంటుంది కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది ఇప్పుడే చెప్పలేం అంటూ క్లారిటీ ఇచ్చేశారు.

సో.. బన్నీ తదుపరి సినిమా ఎవరితో చేస్తాడు? పుష్ప తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న అల్లు హీరో నెక్స్ట్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు? ఇప్పుడిదే హాట్ టాపిక్.

ఇటివలే వకీల్ సాబ్ తో దర్శకుడిగా విజయం అందుకున్న శ్రీ రామ్ వేణుతో బన్నీ 'ఐకాన్' సినిమానే చేస్తాడని టాక్ వినబడుతుంది. మరోవైపు అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ తో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మురుగదాస్ ఓ మాస్ కథ రెడీ చేసి స్టైలిష్ స్టార్ ని ఒప్పించడాని అంటున్నారు.

నిజానికి బన్నీ ఇదివరకు లింగుస్వామితో తెలుగు, తమిళ్ బైలింగ్వెల్ సినిమా ప్లాన్ చేశాడు కానీ ఆ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళక ముందే క్యాన్సల్ అయ్యింది. అందుకే ఇప్పుడు మురుగదాస్ డైరెక్షన్ లో సినిమా చేసి కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట అల్లు అర్జున్.

శ్రీరామ్ వేణు, మురుగదాస్ తో పాటు బన్నీ నెక్స్ట్ లిస్టులో మరికొందరు డైరెక్టర్స్ కూడా ఉన్నారట. మరి పుష్ప తర్వాత అల్లు అర్జున్ నటించే సినిమా ఏది ? డైరెక్టర్ ఎవరు? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. దిల్ రాజు మాత్రం బన్నీ నెక్ట్స్ సినిమా ఐకానే అంటున్నాడు.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics