Zombie Reddy - ఫస్ట్ డే కలెక్షన్

Saturday,February 06,2021 - 04:21 by Z_CLU

తెలుగులో మొట్టమొదటి జాంబీ సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న జాంబీరెడ్డి, మొదటి రోజు మెరిసింది. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటిరోజు ఈ సినిమాకు వరల్డ్ వైడ్ 2 కోట్ల 26 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది.

ఈ సినిమాలో స్టార్ ఎట్రాక్షన్ లేదు. తేజ సజ్జాకు హీరోగా ఇదే ఫస్ట్ మూవీ. అటు ఆనందిని, దక్ష కూడా కొత్త హీరోయిన్లు. ప్రశాంత్ వర్మపై ఓ సెక్షన్ ఆడియన్స్ కు మాత్రమే నమ్మకం ఉంది. అయినప్పటికీ ఈ సినిమా ట్రయిలర్ క్లిక్ అవ్వడం, మూవీకి ఇచ్చిన ప్రమోషన్ బాగుండడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు కోటి రూపాయలకు పైగా షేర్ రావడం విశేషం. మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ అక్కడక్కడ కామెడీ బాగుందనే టాక్ రావడంతో, సినిమాకు ఈ వీకెండ్ తో పాటు, మరికొన్ని రోజులు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది.

zombie reddy first day collection

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – 31 లక్షలు
సీడెడ్ – 20 లక్షలు
ఉత్తరాంధ్ర – 11.5 లక్షలు
ఈస్ట్ – 9 లక్షలు
వెస్ట్ – 8 లక్షలు
గుంటూరు – 9.2 లక్షలు
కృష్ణా – 8.3 లక్షలు
నెల్లూరు – 6 లక్షలు