ఆరంభం ఒక్క అడుగుతోనే... కరోనాపై పోరులో జీ తెలుగు

Friday,June 19,2020 - 06:39 by Z_CLU

తెలుగు ప్రజలకు వినోదాన్ని అందించడంలోనే కాదు.. సామాజిక బాధ్యతలో కూడా ముందుంది మీ జీ తెలుగు. కరోనాపై తెలంగాణ ప్రభుత్వం సాగిస్తున్న యుద్ధానికి తనవంతుగా మద్దతు పలికింది. 16 అంబులెన్సులు, 4వేల PPE కిట్లు అందించడానికి ముందుకొచ్చింది.

ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు ఇది సరైన సాయం. రోజురోజుకు రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ముందుండి పోరాటం చేస్తున్న ఫ్రంట్ వారియర్స్ కు PPE కిట్లు అత్యవసరం. ఇక అంబులెన్సుల అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అందుకే తనవంతు సామాజిక బాధ్యతగా జీ తెలుగు ముందుకొచ్చింది. ఛానెల్ హెడ్స్ అనురాధ గారు, శ్రీధర్ గారు…  తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి 16 అంబులెన్సులు, 4వేల PPE కిట్లు అందజేయనున్నట్టు తెలిపారు.

జీ తెలుగు చూపించిన చొరవను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.