జీ సినిమాలు (డిసెంబర్ 17th)

Friday,December 16,2016 - 09:30 by Z_CLU

adharsham

నటీనటులు : జగపతి బాబు, అశ్విని నాచప్ప

ఇతర నటీనటులు : రఘు, J.D.చక్రవర్తి, యమున, సుజాత, శరణ్య, తనికెళ్ళ భరణి, నూతన ప్రసాద్

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : మౌళి

ప్రొడ్యూసర్ : C. వెంకట రాజు, G. శివ రాజు

రిలీజ్ డేట్ : 2 ఏప్రియల్ 1993

 

జగపతి బాబు, మాజీ అథ్లెట్ అశ్విని నాచప్ప జంటగా నటించిన చిత్రం ఆదర్శం. భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రఘు, యమునా, శరణ్య కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. మౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

——————————————————————

sri-krishna-tulabharam-1966

నటీ నటులు : N.T.రామారావు, జమున, అంజలి

ఇతర నటీనటులు : S.వరలక్ష్మి, L.విజయలక్ష్మి, కాంతారావు, రాజనాల, పద్మనాభం, వాణిశ్రీ

మ్యూజిక్ డైరెక్టర్ : పెండ్యాల

డైరెక్టర్ : K. కామేశ్వర రావు

ప్రొడ్యూసర్ : రామా నాయుడు

రిలీజ్ డేట్ : 1966

NTR కరియర్ లోని పౌరాణిక సినిమాల్లో ఒక ఆణిముత్యం శ్రీ కృష్ణ తులాభారం.. శ్రీకృష్ణుడు తన భార్యల మధ్య అపురూప సన్నివేశాలతో అద్భుతంగా తెరకెక్కిందే శ్రీ కృష్ణ తులాభారం.
పెండ్యాల సంగీతం అందించిన ఈ సినిమాకి K.కామేశ్వర రావు డైరెక్షన్ చేశారు.

——————————————————————

anasuya
నటీనటులు : భూమిక, అబ్బాస్

ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : రవి బాబు

ప్రొడ్యూసర్ : రవి బాబు

రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007

 

భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ ని ఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్య జరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కో అవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టి పడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

——————————————————————

prema-1
నటీనటులు : వెంకటేష్, రేవతి

ఇతర నటీనటులు : S.P. బాల సుబ్రహ్మణ్యం, గొల్లపూడి మారుతి రావు, మంజుల, కల్పన, బ్రహ్మానందం, రాళ్ళపల్లి

మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా

డైరెక్టర్ : సురేష్ కృష్ణ

ప్రొడ్యూసర్ : D. రామా నాయుడు

రిలీజ్ డేట్ : 12 జనవరి 1989

వెంకటేష్, రేవతి నటించిన మ్యూజికల్ హిట్ ప్రేమ. ఈ సినిమాని నిర్మించిన రామా నాయుడు దీనిని హిందీలో కూడా రీమేక్ చేశారు. వెంకటేష్ కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి సురేష్ కృష్ణ డైరెక్టర్. ఇళయ రాజా సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

——————————————————————

golconda-high-school-poster

నటీనటులు : సుమంత్, స్వాతి

ఇతర నటీనటులు : సుబ్బరాజు, తనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 14 జనవరి 2011

 

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో రూపొందిన సినిమా ‘గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

——————————————————————

brother-of-bommali

నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.