జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,March 03,2019 - 10:02 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్  లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

మహర్షి సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఓసారి ప్రకటించాడు. కానీ ఆ సినిమా మే లేదా జూన్ కు వాయిదాపడొచ్చంటూ గాసిప్స్ వినిపించాయి. దీంతో యూనిట్ మరోసారి ఎలర్ట్ అయింది. సినిమా విడుదల తేదీని మరోసారి ప్రకటించింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇండియాలో తీసిన ఓ డాక్యుమెంటరీకి ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కింది. గునీత్ మోంగా నిర్మించిన పీరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. 25 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ డాక్యుమెంట్రీని ఉత్తరప్రదేశ్ లోని హపూర్ ప్రాంతంలో తెరకెక్కించారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

తన కొత్త సినిమాకు సంబంధించి హీరోయిన్లను ఫిక్స్ చేశాడు రజనీకాంత్. మురుగదాస్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో నయనతార, కీర్తిసురేష్ ను హీరోయిన్లుగా తీసుకున్నాడు. మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇన్నాళ్లూ సహ-నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన మహేష్ బాబు ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు. తన సొంత బ్యానర్ పై అడివి శేష్ హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు మహేష్. ఈ సినిమాకు మేజర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. గతంలో గూఢచారి లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తీసిన శశికిరణ్ తిక్క ఈ సినిమాకు దర్శకుడు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి మార్చి 22న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత జరిగిన ఘటనల్ని తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు వర్మ.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్, అత‌ని స‌న్నిహితులైన శివ‌ మేక‌, రాకేష్ మహ‌ంకాళి సంయుక్తంగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ పేరిట ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ని స్థాపించారు. సంప్రదాయ తెలుగు సినిమా ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ల మాదిరిగా సినిమాల్ని నిర్మించి, విడుద‌ల చేసే ప‌ద్ధ‌తికి పూర్తి భిన్నంగా త్రీ ఆట‌మ‌న్ లీవ్స్ సంస్థ అడుగులు వేస్తోంది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.