జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,February 24,2019 - 10:07 by Z_CLU

టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వారం సమాచారమేంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘కథానాయకుడు’ సినిమా తర్వాత వెంటనే ‘మహానాయకుడు’ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ కథలో చిన్న చిన్న మార్పులు చేయడంతో పాటు మరికొంత షూటింగ్ పెండింగ్ ఉండడంతో వాయిదావేశారు. అలా వాయిదాపడిన మహానాయకుడు సినిమా సరికొత్త హంగులతో ఈ శుక్రవారమే థియేటర్లలోకి వచ్చింది. రివ్యూ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ టైంలో స్టార్ కమెడియన్ల లిస్టు లో చేరిపోయిన ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ హీరోలుగా ‘మిఠాయి’ అనే సినిమా వచ్చింది. మరి డార్క్ కామెడీ గా తెరకెక్కిన మిఠాయి టేస్ట్ ఎలా ఉంది ..? ప్రియదర్శి -రాహుల్ రామకృష్ణ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారా..? రివ్యూ చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

కోడి రామకృష్ణ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాతో మూడు దశాబ్దాల అనుబంధం ఆయన సొంతం. టాలీవుడ్ కు ఎన్నో గొప్ప చిత్రాలు అందించిన ఈ మహా దర్శకుడు ఇకలేరు. కొన్నాళ్లుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న కోడి రామకృష్ణ, రెండు రోజుల క్రితం కన్నుమూశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అవును.. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఉండాల్సిన మహేష్ మైనపు విగ్రహం హైదరాబాద్ లో కొలువుదీరబోతోంది. ఈ మేరకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 25న హైదరాబాద్ లో ఈ మైనపు విగ్రహాన్ని స్వయంగా మహేష్  ఆవిష్కరించబోతున్నాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుల్ గా గడ్డం పెంచి, డాన్ గెటప్ లో ఉన్న శర్వానంద్ ఫొటోస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. సుదీర్ వర్మ డైరెక్షన్ లో శర్వానంద్ చేస్తున్న కొత్త సినిమా స్టిల్స్ ఇవి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమాకు సంబంధించి శర్వానంద్ లుక్ ఇలా లీక్ అయింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.