జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,October 27,2019 - 09:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

‘అదిరింది’, ‘సర్కార్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న విజయ్ ఇప్పుడు ‘విజిల్’ అనే సినిమాతో థియేటర్స్ లో ఎంట్రీ ఇచ్చాడు. మరి అట్లీ డైరెక్షన్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో విజయ్ మరోసారి తెలుగు ఆడియన్స్ ను మెప్పించాడా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇటివలే ‘దేవ్’ సినిమాతో నిరాశపరిచిన కార్తి ఇప్పుడు ‘ఖైదీ’ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి ఈ సినిమాతో కార్తి సూపర్ కొట్టాడా ..? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

తమిళ బ్లాక్ బస్టర్ ‘అసురన్’ తెలుగులో రీమేక్ కానుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించబోతున్నాడు. అయితే ఈ రీమేక్ ని  సురేష్ బాబు తో  పాటు, తమిళంలో ‘అసురన్’ ని నిర్మించిన కళైపులి S.థను సంయుక్తంగా నిర్మించనున్నారని అనౌన్స్ చేసారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ `జాతిర‌త్నాలు`. మ‌హాన‌టి వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన దర్శ‌కుడు నాగ్అశ్విన్ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నారు. న‌వీన్ పొలిశెట్టి, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టిస్తున్నారు. అనుదీప్ కె.వి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

హీరోగా బిజీగా ఉన్న నాని, నిర్మాతగా కూడా మారిన విషయం తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమాస్ అనే బ్యానర్ పెట్టిన నేచురల్ స్టార్ తొలి ప్రయత్నంగా “అ!” అనే సినిమా నిర్మించాడు. ఇప్పుడు నిర్మాతగా తన రెండో సినిమాను స్టార్ట్ చేశాడు. విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాతగా సినిమా లాంఛ్ అయింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బుధవారం తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.