జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,October 20,2019 - 11:07 by Z_CLU

  ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

తెలుగు ప్రేక్షకులకు హారర్ కామెడీ కొత్తకాదు. ఇదే జానర్ లో మరో హారర్ కామెడీ ‘రాజుగారి గది 3’  థియేటర్లలోకి వచ్చింది. అన్నీ తానై ఓంకార్ తీసిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? తమ్ముడు అశ్విన్ కు అన్నయ్య ఓంకార్ ఓ హిట్ ఇవ్వగలిగాడా? ‘జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్’ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఆపరేషన్ గోల్డ్ ఫిష్.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీని ఆకర్షిస్తున్న సినిమా. ఫస్ట్ లుక్, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీపై అందరి ఫోకస్ పడింది. అలా ఓ మోస్తరు అంచనాల మధ్య  థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఏంటి? ఆది సాయికుమార్ హిట్ కొట్టాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కీర్తిసురేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న ఓ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

2016లో వచ్చిన మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కి రీమేక్ గా కృష్ణవంశీ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి ‘రంగమార్తాండ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసి, అఫీషియల్ పోస్టర్ ను వదిలాడు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఓ బ్రాండ్ న్యూ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి