జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,September 22,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

వరుణ్ తేజ్ గెటప్ మార్చి హరీష్ శంకర్ తో ‘వాల్మీకి’ చేసాడు. తమిళ్ ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా కోర్టు ఆదేశం మేరకూ టైటిల్ మార్చుకొని ‘గద్దలకొండ గణేష్’గా థియేటర్స్ లోకి వచ్చింది. మరి వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేశ్ మెప్పించాడా? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సూర్య సినిమాల్లో కథలు కొత్తగా ఉంటాయి. క్యారెక్టరైజేషన్లు కూడా కొత్తగా ఉంటాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. తన సినిమాల్లో కథలు కూడా రెగ్యులర్ గానే ఉంటాయని కొన్నేళ్లుగా నిరూపిస్తూ వస్తున్నాడు సూర్య. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అర్జున్ రెడ్డి సినిమాతో ఎగ్రెసివ్ నెస్ కు కేరాఫ్ గా మారాడు హీరో విజయ్ దేవరకొండ. ఇలాంటి హీరో నుంచి అలాంటి లుక్ వచ్చిందంటే కచ్చితంగా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడలాంటి లుక్కే వచ్చింది. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా నుంచి విజయ్ దేవరకొండ లుక్ ను విడుదల చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

లక్ష్మీ సౌజన్యను డైరక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా ఎనౌన్స్ చేశాడు నాగశౌర్య. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. అక్టోబర్ నుంచే సెట్స్ పైకి వస్తుందని, వచ్చే ఏడాది మే నెలలో రిలీజ్ చేస్తామని కూడా మేకర్స్ ప్రకటించారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

గోపీచంద్ లేటెస్ట్ గా బిను సుబ్రహ్మణ్యం అనే కొత్త దర్శకుడితో  సినిమా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు మ్యాచో హీరో. మొన్నటి వరకూ సంపత్ నందితో గోపీచంద్ సినిమా ఉంటుందనే వార్త చక్కర్లు కొట్టింది. ఇప్పుడీ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు మేకర్స్.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.