
టాక్సీవాలా
నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్
ఇతర నటీనటులు : మాళవిక నాయర్, మధునందన్, కళ్యాణి, విష్ణు, రవి వర్మ, శిజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజాయ్
డైరెక్టర్ : రాహుల్ సంక్రిత్యాన్
ప్రొడ్యూసర్ : SKN, బన్ని వాస్
రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2018
అతి కష్టం మీద ఐదేళ్లు చదివి డిగ్రీ పూర్తిచేసిన శివ (విజయ్ దేవరకొండ), అన్నయ్య(రవి ప్రకాష్) వదిన(కళ్యాణి)లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్(మధు నందన్) దగ్గరకు ఉద్యోగం కోసం వస్తాడు. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ 2-3 ఉద్యోగాలు చేసి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఓ టాక్సీవాలా గా సెట్ అవ్వాలనుకుంటాడు.
కారు కొనడానికి డబ్బు లేకపోవడంతో తన బంగారం అమ్మి శివ కి డబ్బులు ఇస్తుంది వదిన. అలా వదిన ఇచ్చిన డబ్బుతో కారు కొనేందుకు వెతుకుతున్న క్రమంలో రఘు రామ్(సిజ్జు) దగ్గర ఓ పాత కాంటెస్సా ఉందని తెలుసుకొని ఆ కారుని కొంటాడు శివ. అలా క్యాబ్ డ్రైవర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఫస్ట్ డ్రైవ్ లో
పరిచయం అయిన అనూష(ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో శివకి తను నడుపుతున్న కారులో దెయ్యం ఉందని తెలుస్తుంది. టాక్సీలో నిజంగానే దెయ్యం ఉందా..? ఇంతకీ టాక్సీలో ఉన్న ఆ పవర్ ఏంటి..? ఈ కథకి శిశిర (మాళవిక నాయర్) అనే అమ్మాయికు సంబంధం ఏంటి..? అనేది ‘టాక్సీవాలా’ కథ.
==========================

అ..ఆ
నటీనటులు : నితిన్, సమంతా అక్కినేని , అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : నరేష్, నదియా, హరితేజ, అనన్య, రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జె.మేయర్
డైరెక్టర్ : త్రివిక్రమ్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 2 జూన్ 2016
నితిన్, సమంతా జంటగా నటించిన బ్యూటిఫుల్ లవ్ ఎంటర్ టైనర్ అ..ఆ. రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అనసూయ (సమంతా), తల్లి క్రమశిక్షణతో విసుగెత్తి పోతుంది. దానికి తోడు తన ఇష్టా ఇష్టాలతో సంబంధం కుదర్చడం మరో తలపోతులా ఫీలవుతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తండ్రి సలహా మేరకు తన మేనత్త ఇంటికి వెళ్తుంది.
ఆనంద్ విహారి (నితిన్) తో పాటు, తక్కిన ఫ్యామిలీని కలుసుకుంటుంది. ఆస్తి, ఆర్భాటాలు లేకపోయినా అనురాగ ఆప్యాయతలతో ఉండే ఆ ఫ్యామిలీని ఇష్టపడటమే కాదు ఆనంద్ విహారితో ప్రేమలో కూడా పడుతుంది అనసూయ. ఆ తరవాత ఏం జరుగుతుంది..? అనేదే ఈ సినిమాలో ప్రధాన కథాంశం.
===========================

టిక్ టిక్ టిక్
నటీనటులు: జయం రవి- నివేథా పెతురాజ్-జయప్రకాష్-రమేష్ తిలక్-అర్జునన్-విన్సెంట్ అశోకన్ తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: వెంకటేష్
నిర్మాత: చదలవాడ పద్మావతి
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శక్తి సౌందర్ రాజన్
వైజాగ్‌లో గ్రహ శకలం పడుతుంది. దాని తర్వాత మరో పది రోజుల్లో భూమి కంటే పెద్ద పరిమాణంలోని మరో గ్రహ శకలం భూమి వైపు వస్తుందని.. దాని కారణంగా నాలుగుకోట్ల మది చనిపోవడమూ.. భారీ ఆస్థినష్టం జరుగుతుందనే వివరాలు ఇండియన్ ఆర్మీకి అందుతాయి. అందువల్ల ఆ శకలాన్ని పేల్చేసే భారీ మిసైల్ కొరియా ఆధ్వర్యంలో స్పేస్‌లో ఉందని ఇండియన్ ఆర్మీకి తెలుస్తుంది. దాన్ని అంతరిక్షం చేరుకుని మిసైల్ సహాయంతో పేల్చేయాలని ఆర్మీ చీఫ్ (జయప్రకాశ్) నిర్ణయం తీసుకుంటారు. అందుకని ఓ ప్రైవేట్ ఆపరేషన్‌ను నిర్వహిస్తారు. అందుకోసమని ఇద్దరు ఆర్మీ అధికారులు (విన్సెంట్ అశోకన్, నివేదా పేతురాజ్)లతో పాటు గొప్ప మేజిషియన్, దొంగగా ముద్ర వేసుకుని జైలు జీవితం అనుభవిస్తున్న వాసు(జయం రవి), అతని స్నేహితులు (అర్జునన్, వెంకట్) ఓ టీమ్‌గా ఏర్పడుతారు.
వాసుకి పదేళ్ల కొడుకు ఉంటాడు. స్పేస్‌లోకి ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఓ అజ్ఞాతవ్యక్తి వాసుని బెదిరించి తన మాట వినకపోతే.. అతని కొడుకుని చంపేస్తామని.. అలా చంపకుండా ఉండాలంటే స్పేస్ కంట్రోల్‌లో ఉండే మిసైల్‌ను తన కంట్రోల్‌లో ఉండేలా చేయాలని కోరుతాడు. అప్పుడు వాసు ఏం చేస్తాడు?
తన కొడుకుని త్యాగం చేస్తాడా? దేశం కోసం ఎలా నిర్ణయం తీసుకుంటాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
============================

సుప్రీమ్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా
ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్,
మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
డైరెక్టర్ : అనల్ రావిపూడి
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : మే 5, 2016
సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.
=======================

ఇస్మార్ట్ శంకర్
నటీనటులు: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
బ్యానర్: పూరి జగన్నాధ్ టూరింగ్ టాకింగ్స్, పూరి కనెక్ట్స్
నిర్మాతలు: పూరి జగన్నాధ్, చార్మీ కౌర్
రచన – దర్శకత్వం : పూరి జగన్నాధ్
రిలీజ్ డేట్ : జులై 18, 2019
ఇస్మార్ట్ శంకర్ (రామ్) పక్కా రౌడీ. హైదరాబాద్ లో సెటిల్ మెంట్స్ చేస్తుంటాడు. ఓరోజు భారీ డీల్ వస్తుంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. పోలీసులకు దొరక్కుండా లవర్ చాందిని (నభా నటేష్)తో కలిసి గోవాకు పారిపోతాడు. కానీ పోలీసులు అతడ్ని కనుక్కుంటారు. శంకర్ ను పట్టుకునే క్రమంలో బుల్లెట్స్ తగిలి చాందిని చనిపోతుంది.
తన ప్రేయసిని చంపిన వాళ్ల కోసం శంకర్ వెదుకుతుంటాడు. అదే క్రమంలో కొన్ని కీలక పరిణాల మధ్య సీబీఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) చనిపోతాడు. అదే ప్రమాదంలో శంకర్ కూడా గాయపడతాడు. అరుణ్ మెమొరీని శంకర్ బ్రెయిన్ లోకి ఎక్కిస్తుంది సారా (నిధి అగర్వాల్).
ఇంతకీ సారా ఎవరు? శంకర్-అరుణ్ మధ్య సంబంధం ఏంటి? తన లవర్ ను చంపిన దుండగుల్ని శంకర్ పట్టుకున్నాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ.
==============================

రారండోయ్ వేడుక చూద్దాం
నటీనటులు : అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, పృథ్విరాజ్, చలపతి
రావు మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కళ్యాణ్ కృష్ణ కురసాల
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 26 మే 2017
పల్లెటూరిలో ఓ పెద్దమనిషిగా కొనసాగే ఆది(సంపత్) ఏకైక కూతురు భ్రమరాంబ(రకుల్ ప్రీత్) చిన్నతనం నుంచి నాన్న గారాల పట్టిగా పెరిగి పెద్దవుతుంది. అలా నాన్నని కుటుంబాన్ని అమితంగా ప్రేమించే భ్రమరాంబను కజిన్ బ్రదర్ పెళ్లిలో చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శివ(నాగ చైతన్య). అలా భ్రమరాంబతో ప్రేమలో పడిన శివ.. ఆదికి తన తండ్రి కృష్ణ(జగపతి బాబు) కి గొడవ ఉందని ఆ గొడవే తన
ప్రేమకు అడ్డుగా మారిందని తెలుసుకుంటాడు.ఇంతకీ ఆది-కృష్ణ కి ఏమవుతాడు..? వారిద్దరి మధ్య గొడవేంటి.. చివరికి శివ-భ్రమరాంబ కలిశారా లేదా అనేది స్టోరి.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics