జీ సినిమాలు - సెప్టెంబర్ 22

Monday,September 21,2020 - 09:32 by Z_CLU

అనసూయ
నటీనటులు : భూమిక, అబ్బాస్
ఇతర తారాగణం : రవిబాబు, నిఖిత, సుహాని, శంకర్ మెల్కోటే
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : రవి బాబు
ప్రొడ్యూసర్ : రవి బాబు
రిలీజ్ డేట్ : 21 డిసెంబర్ 2007
భూమిక ప్రధాన పాత్రలో నటించిన అనసూయ సెన్సేషనల్ క్రైం థ్రిల్లర్. ఒక మర్డర్ సిరీస్ నిఛేదించే కథనంతో సాగే అనసూయ ఊహించని మలుపులతో ఆద్యంతం అలరిస్తుంది. హత్యజరిగిన చోట హంతకుడు రోజా పువ్వును ఎందుకు వదిలి వెళ్తున్నాడో, శవం నుండి ఒక్కోఅవయవాన్ని ఎందుకు తొలగిస్తున్నాడో లాంటి అంశాలు సినిమా క్లైమాక్స్ వరకు కట్టిపడేస్తాయి. ఈ సిన్మాకి రవిబాబు డైరెక్టర్.

=========================

కందిరీగ
నటీనటులు : రామ్, హన్సిక మోత్వాని
ఇతర నటీనటులు : అక్ష పార్ధసాని, జయ ప్రకాష్ రెడ్డి, సోను సూద్, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్, శ్రీనివాస రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2011
ఎనర్జిటిక్ స్టార్ రామ్, హన్సిక మోత్వాని జంటగా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కందిరీగ. కామెడీ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచింది.

===========================

బుర్రకథ
న‌టీనటులు: ఆది సాయికుమార్‌, మిస్తీ చ‌క్ర‌వ‌ర్తి
ఇతర నటీనటులు : నైరా షా, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప‌థ్వీరాజ్‌, గాయ‌త్రి గుప్తా, అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు
సంగీతం : సాయికార్తీక్‌
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం : డైమండ్ ర‌త్న‌బాబు
నిర్మాత‌: హెచ్‌.కె.శ్రీకాంత్ దీపాల‌
రిలీజ్ డేట్: జూన్ 28, 2019
అభిరామ్ (ఆది సాయికుమార్) పేరుకు మాత్రమే ఒకడు. కానీ అతడిలో ఇద్దరుంటారు. దానికి కారణం అతడు రెండు మెదళ్లతో పుట్టడమే. ఒక మైండ్ యాక్టివేట్ అయినప్పుడు అభిలా, మరో మైండ్ యాక్టివేట్ అయినప్పుడు రామ్ లా మారిపోతుంటాడు అభిరామ్. అభి లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటాడు. రామ్ మాత్రం పుస్తకాల పురుగు. దీనికి తోడు హిమాలయాలకు వెళ్లి ఆధ్యాత్మిక మార్గం ఎంచుకోవాలని చూస్తుంటాడు. ఇలా రెండు విరుద్ధమైన పాత్రలతో తనలోతాను సంఘర్షణకు గురవుతుంటాడు అభిరామ్.
ఇలా రెండు వేరియేషన్స్ తో ఇబ్బంది పడుతున్న టైమ్ లో ప్రేమలో పడతాడు అభిరామ్. హ్యాపీ (మిస్తీ చక్రవర్తి) అనే అమ్మాయిని కష్టపడి తన దారిలోకి తెచ్చుకుంటాడు. అయితే అభిలో ఇలా రెండు షేడ్స్ ఉన్నాయనే విషయం హ్యాపీకి తెలియదు. సరిగ్గా అప్పుడే సీన్ లోకి ఎంటర్ అవుతుంది ఆశ్చర్య (నైరా షా).
ఇంతకీ ఈ ఆశ్చర్య ఎవరు? ఈమె రాకతో అభిరామ్ జీవితం ఎలా మారిపోయింది? హీరోకు రెండు బ్రెయిన్స్ ఉన్నాయనే విషయం హీరోయిన్ కు ఎలా తెలుస్తుంది? అసలు తనలోనే ఉంటూ తనను ఇబ్బంది పెడుతున్న మరో క్యారెక్టర్ ను అభిరామ్ ఎలా అధిగమించగలిగాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది బ్యాలెన్స్ స్టోరీ.

=============================

రాఖీ
నటీనటులు : NTR, ఇలియానా, చార్మి
ఇతర నటీనటులు : సుహాసిని, రవి వర్మ, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, చంద్ర మోహన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : K.L. నారాయణ
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2006
NTR, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన రాఖీ ఇద్దరి కరియర్ లోను డిఫరెంట్ సినిమా. ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక యువకుడు చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని పోరాటం చేయడమే రాఖీ సినిమా ప్రధానాంశం. ఈ సినిమాలో ఛార్మి నటన హైలెట్.

===========================

ఓకే ఓకే
హీరో హీరోయిన్లు – ఉదయనిధి స్టాలిన్, హన్సిక
ఇతర నటీనటులు – శరణ్య, సంతానం
సంగీతం – హరీష్ జైరాజ్
దర్శకత్వం – ఎమ్.రాజేష్
విడుదల తేదీ – 2012, ఆగస్ట్ 31
తమిళనాట భారీ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఉదయ్ నిధి స్టాలిన్ హీరోగా మారి చేసిన మొట్టమొదటి చిత్రం ఓకే ఓకే. బాగా డబ్బు ఉంది. తలచుకుంటే ఎలాంటి డైరక్టర్ ను అయినా ఒప్పించి ఓ మాస్ మసాలా భారీ బడ్జెట్ సినిమా చేయగలడు ఉదయ్ నిధి స్టాలిన్. కానీ కథపై నమ్మకంతో.. తనే నిర్మాతగా ఉంటూ, హీరోగా మారి ఓ కామెడీ రొమాంటిక్ సినిమాతో అరంగేట్రం చేశాడు. ఉదయ్ నిధి స్టాలిన్ నమ్మకం వమ్ముపోలేదు. ఓకే ఓకే సినిమా తమిళనాట బ్రహ్మాండంగా ఆడింది. 2012 సూపర్ హిట్స్ లో ఇది కూడా ఒకటి. హన్సిక అందాలు ఈ సినిమాకు ఒక ఎత్తయితే… ఉదయ్-సంతానం కలిసి పండించిన కామెడీ సినిమాకు బ్యాక్ బోన్. అటు హరీష్ జైరాస్ కూడా తన సంగీతంతో సినిమాను మరో మెట్టు పైకి తీసుకెళ్లాడు.