జీ సినిమాలు - సెప్టెంబర్ 21

Sunday,September 20,2020 - 09:05 by Z_CLU

మోహిని
నటీనటులు : త్రిష, జాకీ భజ్ఞాని
ఇతర నటీనటులు : ముకేష్ తివారీ, పూర్ణిమ భాగ్యరాజ్, యోగి బాబు, జాంగిరి మధుమిత, జ్ఞానేశ్వర్, స్వామినాథన్ మరియు తదితరలు
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ – మెర్విన్
డైరెక్టర్ : రమణ మాదేశ్
ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్
రిలీజ్ డేట్ : 27 జూలై 2018
ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం.
సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్, టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది.
గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలని, అవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ

========================

మేము
నటీనటులు : సూర్య, అమలా పాల్
ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్
రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015
పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది.

==========================

భగీరథ
నటీనటులు : రవితేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్, విజయ్ కుమార్, బ్రహ్మానందం, జీవ, నాజర్, సునీల్, రఘునాథ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ’. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవితేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

=========================

కృష్ణ
నటీనటులు : రవితేజ, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, ముకుల్ దేవ్, చంద్ర మోహన్, దండపాణి, కళ్యాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : V.V.వినాయక్
ప్రొడ్యూసర్స్ : కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 11 జనవరి 2008
రవితేజ, త్రిష నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కృష్ణ. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కరియర్ లో హైలెట్ గా నిలిచింది. కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం హైలెట్ గా నిలిచింది.

=============================

బ్రదర్స్
నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : K.V.ఆనంద్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 2012
సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.