జీ సినిమాలు - సెప్టెంబర్ 16

Tuesday,September 15,2020 - 10:08 by Z_CLU

మాతంగి
నటీనటులు : రమ్య కృష్ణన్, జయరామ్
ఇతర నటీనటులు : ఓం పురి, శీలు అబ్రహాం, రమేష్ పిషరోది, సాజు నవోదయ, అక్షర కిషోర్, ఏంజిలిన అబ్రహాం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : రతీష్ వేఘ
డైరెక్టర్ : కన్నన్ తామరక్కులం
ప్రొడ్యూసర్ : హసీబ్ హనీఫ్, నౌషాద్ అలాతుర్
రిలీజ్ డేట్ : 20 మే 2016
సత్యజిత్(జయరాం) ఓ ప్రముఖ వ్యాపార వేత్త.. ఉన్నట్టుండి రాత్రి వేళలో సత్యజిత్ కి కొన్ని పీడ కలలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ రోజు తన కుటుంబమంతా నాశనం అవ్వబోతుందనే కల కంటాడు… తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, సమస్య కి పరిష్కారం వెతుక్కుంటూ మహేశ్వర బాబా(ఓం పూరి) ని కలుస్తాడు. అయితే సత్యజిత్ గతంలో కొన్న ఓ పాత భవనం వల్లే ఈ సమస్య వచ్చిందని…అందులో ఉన్న మాతంగి అనే ఓ ఆత్మ వల్లే ఇదంతా జరుగుతుందని తెలుసుకుంటాడు. ఇంతకీ ఆ పాత భవనంలో ఆత్మగా మారిన మాతంగి ఎవరు…? మాతంగి కి సత్యజిత్ కి సంబంధం ఏమిటి..? చివరికి ఆ ఆత్మ నుంచి సత్యజిత్ తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడా…? అనేది సినిమా కథాంశం.

================================

ఆనందోబ్రహ్మ
నటీనటులు : తాప్సీ, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్
ఇతర నటీనటులు : షకలక శంకర్, విద్యుల్లేఖ రామన్, వెన్నెల కిషోర్
మ్యూజిక్ డైరెక్టర్ : K .
డైరెక్టర్ : మహి V . రాఘవ్
ప్రొడ్యూసర్ : విజయ్ చిల్ల, శశి దేవి రెడ్డి
రిలీజ్ డేట్ : 10 ఆగష్టు 2017
ఉద్యోగరీత్యా మలేషియాలో సెటిల్ అయిన రాము(రాజీవ్ కనకాల) ఇండియాలో ఓ వరదలో తన అమ్మనాన్నలు చనిపోయారని తెలుసుకొని ఇండియా వచ్చి తన తల్లితండ్రులు ఉండే ఇంటిని అమ్మడానికి చూస్తుంటాడు. ఇంట్లో దెయ్యాలున్నాయన్న కారణంతో ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ డబ్బుకే ఆ ఇంటిని ఓ రౌడీకి అమ్మకానికి పెడతాడు రాము. ఈ క్రమంలో అత్యవసరంగా డబ్బు అవసరమున్న సిద్దు(శ్రీనివాస్ రెడ్డి), బాబు(షకలక శంకర్),తులసి(తాగుబోతు రమేష్), రాజు(వెన్నెల కిషోర్) ఆ ఇంట్లో ఉండి దెయ్యాలు లేవని నిరూపిస్తామని రాముతో డీల్ కుదుర్చుకుంటారు.. ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? ఉంటే వాటిని ఈ నలుగురు ఏ విధంగా భయపెట్టారు.. అసలు దెయ్యాలు మనుషులకి బయపడతాయా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

================================

కణం
నటీనటులు : నాగశౌర్య, సాయి పల్లవి
ఇతర నటీనటులు : బేబీ వెరోనికా, ప్రియదర్శి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : C. స్యామ్
డైరెక్టర్ : A.L. విజయ్
ప్రొడ్యూసర్స్ : లైకా ప్రొడక్షన్స్
కృష్ణ (నాగ శౌర్య), తులసి (సాయి పల్లవి) టీనేజ్ లో ప్రేమించుకొని పెద్దలు ఐదేళ్ళు గడిచాక పెళ్లి చేస్తాం అని చెప్పడంతో విడిపోయి సెటిల్ అయ్యాక పెళ్ళిచేసుకొని దంపతులుగా మారతారు. అయితే టీనేజ్ లో ఇద్దరూ కలిసి చేసిన ఓ తప్పు ను కప్పిపుచ్చడానికి వీరి కుటుంబాలు తీసుకున్న ఓ నిర్ణయం వల్ల అందరూ వరుసగా మృత్యువాత పడతారు. ఇంతకీ కృష్ణ – తులసి చేసిన తప్పేంటి… ఆ ఐదేళ్ళ తర్వాత వీరి జీవితం ఎలా సాగింది. పెళ్లి తర్వాత వీరి జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.. అనేది మిగతా కథ.

================================

తుంబ
నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్
ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు
మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి
డైరెక్టర్ : హరీష్ రామ్ L.H.
ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి
రిలీజ్ డేట్ : 21 జూన్ 2019
అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

==================================

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్
ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్
ప్రొడ్యూసర్ : P.V. రావు
రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016
ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.

==============================

డోర
నటీనటులు : నయనతార, తంబి రామయ్య
ఇతర నటీనటులు : హరీష్ ఉత్తమన్, షాన్, సులీల్ కుమార్, బేబీ యుక్త
మ్యూజిక్ డైరెక్టర్ : దాస్ రామసామి
ప్రొడ్యూసర్ : A. సర్కునమ్, హితేష్ ఝబాక్
రిలీజ్ డేట్ : 31 మార్చి 2017
అమాయకురాలైన పారిజాతం(నయనతార) తన తండ్రి రామయ్య(తంబీ రామయ్య) తో కలిసికాల్ టాక్సీ బిజినెస్ రన్ చేస్తుంటుంది. ఈ క్రమంలో పారిజాతం ఓ వింటేజ్ కార్ ను బిజినెస్కోసం కొంటుంది. ఆ కారు వల్ల పారిజాతం జీవితంలో ఊహించని ఘటనలు వరుసగా జరుగుతుంటాయి. అసలు ఆ కారుకి పారిజాతానికి ఉన్న సంబంధం ఏంటి? చివరికిఏమైంది..? ఇలాంటి కథలకు ఇంతకంటే ఎక్కువ రివీల్ చేస్తే సస్పెన్స్ ఉండదు. వెండితెర పైచూడాల్సిందే.

==============================

శివగంగ
నటీనటులు : శ్రీరామ్, రాయ్ లక్ష్మి
ఇతర నటీనటులు : సుమన్, జాన్ పీటర్, శరవణన్, శ్రీనివాసన్, సింగం పూడి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్
డైరెక్టర్ : V.C. వడివుడియన్
ప్రొడ్యూసర్ : జాన్ మ్యాక్స్, జోన్స్
రిలీజ్ డేట్ : మార్చి 4, 2016
శ్రీ రామ్, రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

=================================

కుక్కలున్నాయి జాగ్రత్త
నటీనటులు : సిబిరాజ్, అరుంధతి
ఇతర నటీనటులు : ఇదో, బాలాజీ వేణుగోపాల్, మనోబాల, మయిల్ సామి, ప్రింజ్ నితిక్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ధరన్ కుమార్
డైరెక్టర్ : శక్తి సౌందర్ రాజన్
ప్రొడ్యూసర్ : సత్యరాజ్, మహేశ్వరి సత్యరాజ్
రిలీజ్ డేట్ : 21 నవంబర్ 2014
సిబిరాజ్, అరుంధతి జంటగా నటించిన ఇమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘కుక్కలున్నాయి జాగ్రత్త’. మోస్ట్ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ లో కుక్క కీ రోల్ ప్లే చేసింది. ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ లో తన ఫ్రెండ్ ని కోల్పోతాడు పోలీసాఫీసర్ కార్తీక్. ఆ కిడ్నాపర్లను అంతం చేసే ప్రాసెస్ లో ఉన్న కార్తీక్ కి అనుకోకుండా మిలిటరీ ట్రైన్డ్ కుక్క స్నేహం ఏర్పడుతుంది. ఆ కుక్క పోలీసాఫీసర్ కార్తీక్ కి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా సహాయపడింది..? అనేదే ఈ సినిమాలో మోస్ట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్.

===========================

ఆకాశగంగ 2
నటీనటులు – రమ్యకృష్ణ, వీణా నాయర్, విష్ణువినయ్, శ్రీనాథ్ భాసి, ప్రవీణ, సతీష్ కృష్ణ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం – వినయన్
సంగీతం – బిజిబుల్
సినిమాటోగ్రఫీ – ప్రకాష్ కుట్టి
నిర్మాణం – ఆకాష్ ఫిలిమ్స్
నిర్మాత – వినయన్
రిలీజ్ – నవంబర్ 1, 2019
మన్యకేసరి రాజ్యం యొక్క యువరాణి ఆరతి ఒక మెడికల్ స్టూడెంట్. అతీంద్రియ శక్తులు, ఆత్మలు పరమాత్మలు ఉన్నాయని నమ్మదు. తన సంస్థానం ఒక ఆత్మ కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది అని వివరించిన వినిపించుకోదు. అలాంటి ఒక సందర్భంలో ఆరతికి సౌమిని తారసపడుతుంది. తనొక భగవత్ స్వరూపిణి. తాను ఆత్మలతో మాట్లాడగలదు. అది తెలుసుకున్న ఆరతి స్నేహితులు ఆశ్చర్యపోతారు. ఆరతిని చనిపోయిన మీ అమ్మ తోటి మాట్లాడు అప్పుడు నీకు ఇలాంటి అతీంద్రియ శక్తుల గురించిన అపనమ్మకం పోయి ఈలాంటి శక్తులు ఉన్న మనుషులు ఉంటారు అనే నమ్మకం ఏర్పడుతుందని చెప్పుతారు. తన స్నేహితులని తప్పు అని నిరూపించడానికి తాను సౌమిని చెప్పినట్టుగా చేయడానికి సిద్దపడుతుంది. ఆరతి తన అమ్మ తోటి మాట్లాడేలోపే ఆకాశగంగ ఉచ్చులో బిగుంచుకుపోతుంది. ఆరతిని సౌమిని ఏవిధంగా కాపాడబోతుంది? అసలు ఎందుకు ఆకాశగంగ ఆరతిని బాధిస్తుంది? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఆకాశగంగ 2 చూడాల్సిందే.