ZeeCinemalu - Oct 22

Wednesday,October 21,2020 - 10:30 by Z_CLU

సుబ్రమణ్యపురం
నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : సురేష్, తనికెళ్ళ భరణి, సాయి కుమార్, ఆలీ, సురేష్, జోష్ రవి, భద్రం గిరి, మాధవి, హర్షిని, TNR తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : సంతోష్ జాగర్లపూడి
ప్రొడ్యూసర్ : బీరం సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 7 డిసెంబర్ 2018
నాస్తికుడైన కార్తీక్ (సుమంత్) దేవాలయాలపై పరిశోధనలు చేస్తుంటుంటాడు. ఈ క్రమంలో మహా భక్తురాలైన ప్రియ( ఈషా)ను తొలి చూపులోనే ఆమె మంచితనం చూసి ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో ఊహించని రీతిలో వరుసగా ఆత్మహత్యలు జరుగుతుంటాయి. ఆ ఊరికి ప్రెసిడెంట్ అయిన వర్మ(సురేష్) ఊరిలో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నించినా అది అంతు చిక్కని సమస్యలా కనిపిస్తుంది. అయితే ప్రియ ద్వారా సుబ్రహ్మణ్యపురం ఊరిలో అడుగుపెట్టిన కార్తీక్ ఆ ఆత్మ హత్యలపై రీ సెర్చ్ మొదలుపెడతాడు. అలా రీ సెర్చ్ మొదలుపెట్టిన కార్తీక్ పది రోజుల్లో సుబ్రహ్మణ్యపురం గుడి వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదిస్తానని ఊరి ప్రజలకు మాటిస్తాడు. ఇంతకీ సుబ్రహ్మణ్యపురం ఏం జరిగింది… చివరికి కార్తీక్ ఆ రహస్యాన్ని ఎలా ఛేదించాడు అనేది మిగతా కథ.

=========================

భగీరథ
నటీనటులు : రవి తేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్,
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ‘. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

=========================

ఆకాశగంగ 2
నటీనటులు – రమ్యకృష్ణ, వీణా నాయర్, విష్ణువినయ్, శ్రీనాథ్ భాసి, ప్రవీణ, సతీష్ కృష్ణ తదితరులు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం – వినయన్
సంగీతం – బిజిబుల్
సినిమాటోగ్రఫీ – ప్రకాష్ కుట్టి
నిర్మాణం – ఆకాష్ ఫిలిమ్స్
నిర్మాత – వినయన్
రిలీజ్ – నవంబర్ 1, 2019
మన్యకేసరి రాజ్యం యొక్క యువరాణి ఆరతి ఒక మెడికల్ స్టూడెంట్. అతీంద్రియ శక్తులు, ఆత్మలు పరమాత్మలు ఉన్నాయని నమ్మదు. తన సంస్థానం ఒక ఆత్మ కారణంగా ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతుంది అని వివరించిన వినిపించుకోదు. అలాంటి ఒక సందర్భంలో ఆరతికి సౌమిని తారసపడుతుంది. తనొక భగవత్ స్వరూపిణి. తాను ఆత్మలతో మాట్లాడగలదు. అది తెలుసుకున్న ఆరతి స్నేహితులు ఆశ్చర్యపోతారు. ఆరతిని చనిపోయిన మీ అమ్మ తోటి మాట్లాడు అప్పుడు నీకు ఇలాంటి అతీంద్రియ శక్తుల గురించిన అపనమ్మకం పోయి ఈలాంటి శక్తులు ఉన్న మనుషులు ఉంటారు అనే నమ్మకం ఏర్పడుతుందని చెప్పుతారు. తన స్నేహితులని తప్పు అని నిరూపించడానికి తాను సౌమిని చెప్పినట్టుగా చేయడానికి సిద్దపడుతుంది. ఆరతి తన అమ్మ తోటి మాట్లాడేలోపే ఆకాశగంగ ఉచ్చులో బిగుంచుకుపోతుంది. ఆరతిని సౌమిని ఏవిధంగా కాపాడబోతుంది? అసలు ఎందుకు ఆకాశగంగ ఆరతిని బాధిస్తుంది? ఆ వివరాలు తెలుసుకోవాలంటే ఆకాశగంగ 2 చూడాల్సిందే.

===========================

కూలీ నంబర్ 1
నటీనటులు : వెంకటేష్, టాబూ
ఇతర నటీనటులు : రావు గోపాల్ రావు
మ్యూజిక్ డైరెక్టర్ : ఇళయరాజా
డైరెక్టర్ : K. రాఘవేంద్ర రావు
ప్రొడ్యూసర్ : D. సురేష్
రిలీజ్ డేట్ : 12 జూన్ 1991
వెంకటేష్ హీరోగా K. రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కిన కలర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కూలీ నం 1. ఒక సాధారణ కూలీ, పొగరుబోతులైన తండ్రీ కూతుళ్ళ అహాన్ని ఎలా నేలకూల్చాడనే ప్రధానాంశంతో తెరకెక్కిందే ఈ సినిమా. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రాణం.

===========================

విన్నర్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017
సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.

==================================

భానుమతి అండ్ రామకృష్ణ
నటీనటులు – నవీన్ చంద్ర, సలోనీ లూథ్రా, షాలినీ, రాజా చెంబోలు, వైవా హర్ష
దర్శకుడు – శ్రీకాంత్ నాగోతి
నిర్మాత – యశ్వంత్ ములుకుట్ల
సంగీత దర్శకుడు – శ్రావణ్ భరధ్వాజ్
రిలీజ్ డేట్ – జులై 3, 2020
భానుమతి (సలోని లూత్రా) సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉన్న అమ్మాయి. హైదరాబాద్‌లోని ఓ యాడ్ ఏజెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తుంటుంది. రామ్ (రాజా చెంబోలు)తో ఐదేళ్లుగా లవ్ లో ఉంటుంది. అయితే, వయసు ఎక్కువగా ఉందని భానుమతికి రామ్ బ్రేకప్ చెబుతాడు. దీంతో భానుమతి చాలా డిస్టర్బ్ అవుతుంది. లైఫ్ లో మరింత ఎగ్రెసివ్ గా, కోపంగా మారిపోతుంది. సరిగ్గా అదే సమయంలో తెనాలి నుంచి రామకృష్ణ (నవీన్ చంద్ర) హైదరాబాద్‌కు వస్తాడు. భానుమతి పనిచేసే కంపెనీలో చేరతాడు. భానుమతి లైఫ్‌స్టైల్‌కు పూర్తి రివర్స్ లో ఉంటుంది రామకృష్ణ జీవితం. ఉత్తర-దక్షిణ దృవాల్లాంటి వీళ్లిద్దరు ఎలా కలిశారు.. ఎలా ప్రేమలో పడ్డారు.. చివరికి ఏమైంది అనేది ఈ సినిమా స్టోరీ.