ZeeCinemalu - Oct 21

Tuesday,October 20,2020 - 09:54 by Z_CLU

ఆనందోబ్రహ్మ
నటీనటులు : తాప్సీ, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్
ఇతర నటీనటులు : షకలక శంకర్, విద్యుల్లేఖ రామన్, వెన్నెల కిషోర్
మ్యూజిక్ డైరెక్టర్ : K .
డైరెక్టర్ : మహి V . రాఘవ్
ప్రొడ్యూసర్ : విజయ్ చిల్ల, శశి దేవి రెడ్డి
రిలీజ్ డేట్ : 10 ఆగష్టు 2017
ఉద్యోగరీత్యా మలేషియాలో సెటిల్ అయిన రాము(రాజీవ్ కనకాల) ఇండియాలో ఓ వరదలో తన అమ్మనాన్నలు చనిపోయారని తెలుసుకొని ఇండియా వచ్చి తన తల్లితండ్రులు ఉండే ఇంటిని అమ్మడానికి చూస్తుంటాడు. ఇంట్లో దెయ్యాలున్నాయన్న కారణంతో ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తక్కువ డబ్బుకే ఆ ఇంటిని ఓ రౌడీకి అమ్మకానికి పెడతాడు రాము. ఈ క్రమంలో అత్యవసరంగా డబ్బు అవసరమున్న సిద్దు(శ్రీనివాస్ రెడ్డి), బాబు(షకలక శంకర్),తులసి(తాగుబోతు రమేష్), రాజు(వెన్నెల కిషోర్) ఆ ఇంట్లో ఉండి దెయ్యాలు లేవని నిరూపిస్తామని రాముతో డీల్ కుదుర్చుకుంటారు.. ఇంతకీ ఆ ఇంట్లో దెయ్యాలున్నాయా? ఉంటే వాటిని ఈ నలుగురు ఏ విధంగా భయపెట్టారు.. అసలు దెయ్యాలు మనుషులకి బయపడతాయా..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

=================================

జై చిరంజీవ
నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి
ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : K. విజయ భాస్కర్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005
మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపినక్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జైచిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.

=============================

2.O
నటీనటులు : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్
రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.శంకర్
విడుదల : 29 నవంబర్ 2018
450 వందల కోట్ల బడ్జెట్ … 3D టెక్నాలజీ , రోబో కి సీక్వెల్ , సూపర్ స్టార్ రజినీ కాంత్-శంకర్ కాంబో.. ఇవన్నీ కలిసి 2.Oను క్రేజీ ప్రాజెక్టుగా మార్చేశాయి. కథ విషయానికొస్తే.. నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. ఫోన్స్ ఎలా మాయమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. సరిగ్గా అప్పుడే డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి ఈ సమస్య ను ఎదుర్కోవాలంటే మనకి చిట్టి రోబో(రజినీ కాంత్) ఒక్కటే మార్గమని మళ్లీ చిట్టి కి ప్రాణం పోస్తాడు. సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నది పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌) అని తెలుసుకున్న ఆ శక్తి ని చిట్టి ఎలా ఎదురించింది ? అసలు పక్షి రాజా ఎవరు.. అతని కథేంటి.. సెల్ ఫోన్స్ వాడుతున్న వారిపై ఎందుకు ఎటాక్ చేస్తుంటాడు.. అనేది ‘2.O’.

==============================

పండగ చేస్కో
నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : రవి కిరీటి
రిలీజ్ డేట్ : 29 మే 2015
రామ్, రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==================================

దబంగ్ 3
నటీనటులు: సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా, సుదీప్, సయీ మంజ్రేకర్ తదితరులు
మ్యూజిక్: సుదీప్ శిరోద్కర్
ఫోటోగ్రఫి: మహేష్ లిమయే
నిర్మాత: సల్మాన్ ఖాన్, అర్భాజ్ ఖాన్
దర్శకత్వం: ప్రభుదేవా
సల్మాన్ ఖాన్, అతని భార్య సోనాక్షి సిన్హా, అతని తమ్ముడు అర్భాజ్ ఖాన్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. పోలీసుగా ఉద్యోగం చేస్తూ ఎంజాయ్ చేస్తుండే సల్మాన్ ఖాన్ అనుకోకుండా ఓ ఆపరేషన్ చేపట్టాల్సి వస్తుంది. ఆ ఆపరేషన్ లో కొంతమంది వ్యభిచారం చేస్తున్న అమ్మాయిలను సల్మాన్ ఖాన్ పట్టుకుంటాడు. వ్యభిచారం వ్యాపారంగా మలుచుకొని అనేక చీకటి వ్యాపారాలు చేస్తున్న సుదీప్ కు ఈ విషయంలో సల్మాన్ పై కోపం వస్తుంది. సల్మాన్ పై రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటాడు. అదే సమయంలో సల్మాన్ ఖాన్ గతం గురించి తెలుసుకోవడం మొదలుపెడతారు. గతంలో సల్మాన్ ఖాన్, సయీ మంజ్రేకర్ లు ఘాడంగా ప్రేమించుకుంటారు. అనుకోని విధంగా ఇద్దరు దూరం అవుతారు. ఇద్దరి ఎందుకు విడిపోయారు. సల్మాన్ ఖాన్ సుదీప్ ను ఎలా ఎదుర్కొన్నారు అన్నది కథ.

===============================

సౌఖ్యం
నటీనటులు : గోపీచంద్, రెజీనా కసాంద్ర
ఇతర నటీనటులు : ముకేష్ రిషి, ప్రదీప్ రావత్, దీవన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : A . S . రవికుమార్ చౌదరి
ప్రొడ్యూసర్ : V . ఆనంద్ ప్రసాద్
రిలీజ్ డేట్ : 24 డిసెంబర్ 2015
గోపీచంద్, రెజీనా జంటగా నటించిన ఫ్యాఅమిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సౌఖ్యం. తాను ప్రేమించిన ఒకసారి ట్రైన్ లో శైలజను చూసి ప్రేమలో పడతాడు హీరో శ్రీను. అయితే అంతలో ఆ అమ్మాయిని ఒక గుర్తు తెలియని గ్యాంగ్ కిడ్నాప్ చేస్తారు. గొడవాలంటే ఇష్టపడని హీరో ఫాదర్, ఆ అమ్మాయిని మానేయమంటాడు. అలాంటప్పుడు హీరో ఏం చేస్తాడు..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.