ZeeCinemalu - Oct 15

Wednesday,October 14,2020 - 11:08 by Z_CLU

పంచాక్షరి
నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్
ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా
డైరెక్టర్ : V. సముద్ర
ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు
రిలీజ్ డేట్ : 11 జూన్ 2010
హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

============================

మొగుడు
నటీనటులు : గోపీచంద్, తాప్సీ పన్ను
ఇతర నటీనటులు : శ్రద్ధా దాస్, రాజేంద్ర ప్రసాద్, రోజా, నరేష్, ఆహుతి ప్రసాద్, వేణు మాధవ్
మ్యూజిక్ డైరెక్టర్ : బాబు శంకర్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి
రిలీజ్ డేట్ : 4 నవంబర్ 2011
కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఈ సినిమాలో గోపీచంద్, తాప్సీ జంటగా నటించారు. తండ్రి, అక్కా చెల్లెళ్ళ కోసం భార్యను వదులుకున్న హీరో, తిరిగి తనను తన లైఫ్ లోకి ఎలా తెచ్చుకుంటాడు అన్నదే ప్రధాన కథాంశం.

=========================

రావోయి చందమామ
నటీనటులు – నాగార్జున, అంజలా ఝవేరీ, ఐశ్వర్యరాయ్, కీర్తిరెడ్డి, జగపతిబాబు
బ్యానర్ – వైజయంతీ మూవీస్
నిర్మాత – అశ్వనీదత్
దర్శకుడు – జయంత్ సి.పరాన్జీ
సంగీతం – మణిశర్మ
రిలీజ్ – అక్టోబర్ 15, 1999
నాగార్జున నటించిన లవ్-రొమాంటిక్ మూవీ రావోయి చందమామ. 1999 నాటికి భారీ బడ్జెట్ సినిమా ఇదే. మణిశర్మ కంపోజ్ చేసిన ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. అంతేకాదు.. అందాలతార ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో ఐటెంసాంగ్ చేయడం మరో హైలెట్.

===========================

బాబు బంగారం
నటీనటులు : వెంకటేష్, నయనతార
ఇతర నటీనటులు : సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : మారుతి
ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V . ప్రసాద్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016
తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప(పోసాని),మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.

============================

నా పేరు శివ
నటీనటులు : కార్తీ, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : జయప్రకాష్, సూరి, రవి ప్రకాష్, రాజీవన్, విజయ్ సేతుపతి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : సుసీంతిరన్
ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేళ్ రాజా
రిలీజ్ డేట్ : 20ఆగష్టు 2010
సుసీంతిరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ నా పేరు శివ. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==========================

దమ్ము
నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్
ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : బోయపాటి శ్రీను
ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ
రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012
బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.