జీ సినిమాలు (నవంబర్ 26th)

Friday,November 25,2016 - 08:30 by Z_CLU

vengamamba-meena

నటీ నటులు : మీనా, శరత్ బాబు, సాయి కిరణ్
ఇతర నటీ నటులు : సాయి కిరణ్, సన, సుబ్బరాయ శర్మ, అశోక్ రావు, అనంత, సుధా, శివ పార్వతి, శ్రీరామ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.కీరవాణి
డైరెక్టర్ : ఉదయ్ భాస్కర్
ప్రొడ్యూసర్ : దొరై స్వామి రాజు
రిలీజ్ డేట్ : జులై 17, 2009

మీనా, శరత్ బాబు , సాయికిరణ్ వంటి మొదలగు వారితో దర్శకుడు ఉదయ్ భాస్కర్ తెరకెక్కించిన వెంగమాంబ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భక్తి రస చిత్రం ‘వెంగమాంబ’. ఈ చిత్రం లో కథానాయకుడు సాయి కిరణ్ వెంకటేశ్వర స్వామిగా నటించారు. కొన్ని భక్తి రస సన్నివేశాలు, నటీ నటుల గెటప్స్ ఈ సినిమాకు హైలైట్స్.

——————————————————————

paruvu-prathishta

హీరోహీరోయిన్లు – సుమన్ మాలాశ్రీ
నటీనటులు – సురేష్, మాలాశ్రీ, లక్ష్మి, శ్రీవిద్య,
సంగీతం – రాజ్ కోటి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం – గుహనాధన్
విడుదల తేదీ – 1993

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ పరువు-ప్రతిష్ట. లో-బడ్జెట్ లో తీసిన ఈ సినిమా భారీ విజయాన్నందుకుంది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాతో మాలాశ్రీ కెరీర్ లోనే మొట్టమొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోగా… సుమన్ ఈ తరహా పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిపోయారు. గుహనాధన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. 1993 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా పేరుతెచ్చుకుంది.

——————————————————————

gorintaku

నటీ నటులు : రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్ , మీరా జాస్మీన్
ఇతర నటీ నటులు : ఆకాష్, హేమ చౌదరి,సుజిత, శివ రాజా, మాస్టర్ నిధీశ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎస్.ఎ.రాజ్ కుమార్
డైరెక్టర్ : వి.ఆర్.ప్రతాప్
ప్రొడ్యూసర్ : ఎం.వి.ప్రసాద్, పారస్ జైన్
రిలీజ్ డేట్ : జులై 4 , 2008

అన్న-చెల్లెళ్ళ బంధం కధాంశం తో రాజ శేఖర్, ఆర్తి అగర్వాల్, మీరా జాస్మీన్ నటించిన ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రాజ శేఖర్-మీరా జాస్మీన్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, అన్న-చెల్లెళ్ళ బంధం గురించి తెలియజేసే సీన్స్ సినిమాకు హైలైట్స్. ఎస్.ఎ.రాజ్ కుమార్ అందించిన పాటలు, ఆర్.ఆర్. సినిమాకు ప్లస్.

——————————————————————

bangaru-babu

నటీ నటులు : జగపతి బాబు, మీరా జాస్మీన్

ఇతర నటీ నటులు :శశాంక్, గౌరీ ముంజల్, సోను సూద్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ : జొన్నలగడ్డ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : కె.రామ కృష్ణ ప్రసాద్
రిలీజ్ డేట్ : 2009

జగపతి బాబు, మీరా జాస్మీన్ జంటగా దర్శకుడు జొన్నల గడ్డ శ్రీనివాస్ తెరకెక్కించిన ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘బంగారు బాబు’ ఈ సినిమాలో జగపతి బాబు-మీరా జాస్మీన్ మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, పాటలు హైలైట్స్.

——————————————————————

yuganikokkadu

నటీ నటులు : కార్తీ, రీమా సేన్ , ఆండ్రియా
మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : సెల్వ రాఘవన్
ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్
విడుదల : జనవరి 14 , 2010

కార్తీ, రీమా సేన్, ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓ అమ్మాయి ఓ ఇద్దరి సహాయం తో ఆ స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తో తెరకెక్కిన ఈ చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్, చోళుల సామ్రాజ్యం లోకి ప్రవేశించే సీన్స్, ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు. ఈ చిత్రం లో కార్తీ నటన, రీమా సేన్, ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

——————————————————————

kotta-janta

నటీ నటులు :అల్లు శిరీష్ , రెజీనా
ఇతర నటీ నటులు : మధు నందన్, సప్తగిరి, మధురిమ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జె.బి
డైరెక్టర్ : మారుతి
ప్రొడ్యూసర్ : బన్నీ వాస్
రిలీజ్ డేట్ : మే 1 , 2014

అల్లు శిరీష్, రెజీనా జంటగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన యూత్ ఫుల్ ఫామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘కొత్త జంట’ ఓ సందర్భం లో కలిసిన ఓ ఇద్దరు టి.వి. ప్రోగ్రాం ద్వారా ఎలా పరిచయం అయ్యి ప్రేమలో పడ్డారు అనే కధాంశం తో దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం లో అల్లు శిరీష్, రెజీనా మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్, ప్రోగ్రాం కామెడీ, మ్యూజిక్ హాలైట్స్.