జీ సినిమాలు (నవంబర్ 24th)

Wednesday,November 23,2016 - 08:11 by Z_CLU

buchibabu

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, జయప్రద

ఇతర నటీనటులు : గుమ్మడి, మోహన్ బాబు, చలం, చలపతి రావు, నిర్మలమ్మ, రాజబాబు, సూర్య కాంతం, రమాప్రభ తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ :  చక్రవర్తి

డైరెక్టర్ : దాసరి నారాయణ రావు

ప్రొడ్యూసర్ : నాగార్జున & వెంకట్ అక్కినేని

రిలీజ్ డేట్ : 19 మార్చి 1980

దాసరి నారాయణ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రం’ బుచ్చిబాబు’. విదేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదివిన బుచ్చిబాబు తన చిన్ననాటి స్నేహితురాలు బుజ్జిని పెళ్ళి చేసుకోవడానికి ఇండియాకి వస్తాడు. కానీ ఆ ఇద్దరి కుటుంబాల మధ్య వైరం కారణంగా తన పెళ్ళి అసంభవం అన్ తెలుసుకున్న బుచ్చి బాబు, బుజ్జి ఇంట్లో పని వాడిగా హ్సురి వారందరి మనసును గెలుచుకుని, ఇరు కుటుంబాల మధ్య వైరాన్ని మాపి, బుజ్జిని పెళ్ళిచేసుకుంటాడు.

——————————————————————

mr-pellam

నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, ఆమని

ఇతర నటీనటులు : A.V.S, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, తనికెళ్ళ భరణి, గుండు సుదర్శన్, జెన్నీ, మాస్టర్ ఉదయ్, బేబీ అనురాధ

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బాపు

ప్రొడ్యూసర్ : గవర పార్థ సారథి

రిలీజ్ డేట్ : 5 సెప్టెంబర్ 1993

బాపు గారు తెరకెక్కించిన అద్భుతాలలో Mr. పెళ్ళాం ఒకటి. ఆలు, మగలలో ఎవరు గొప్ప అనే సున్నితమైన అంశంతో మనసుకు హత్తుకునే సన్నివేశాలతో తెరకెక్కిన ‘మిస్టర్ పెళ్ళాం’ లో రాజేంద్ర ప్రసాద్. ఆమని జంటగా నటించారు. ఈ సినిమాకి M.M. కీరవాణి సంగీతం అందించారు.

——————————————————————

ganesh-just-ganesh

హీరోహీరోయిన్లు – రామ్,కాజల్
నటీనటులు – పూనమ్ కౌర్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం
సంగీతం – మిక్కీ జె మేయర్
దర్శకత్వం – శరవణన్
విడుదల తేదీ – 2009

రామ్ కాజల్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘గణేష్ జస్ట్ గణేష్’. 2009 లో విడుదలైన ఈ సినిమా యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్. చిన్న పిల్లలతో గణేష్ చేసే హంగామా , కాజల్-రామ్ మధ్య వచ్చే లవ్ సీన్స్ బాగా అలరిస్తాయి. అబ్బూరి రవి అందించిన మాటలు సినిమాకు ప్లస్, ముఖ్యంగా క్లైమాక్స్ లో మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. కాజల్ కుటుంబ సభ్యుల మధ్య మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు అందరినీ హత్తుకుంటాయి.

——————————————————————

idi-sangati

నటీ నటులు : అబ్బాస్, టాబూ, కోట శ్రీనివాస రావు

మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ P. వార్కే

డైరెక్టర్ : చంద్ర సిద్దార్థ్

ప్రొడ్యూసర్ : చంద్ర సిద్ధార్థ్

రిలేజ్ డేట్ : 22 ఫిబ్రవరి 2008

అబ్బాస్, టాబూ జంటగా నటించిన ఇదీ సంగతి పర్ ఫెక్ట్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్. అబ్బాస్ (మూర్తి) ఈ సినిమాలో క్రైం రిపోర్టర్ గా కనిపిస్తే టాబూ (స్వరాజ్యం) ఇందులో అత్యాశ గల హౌజ్ వైఫ్ గా నటించింది. ఒకసారి ట్రేన్ ఆక్సిడెంట్ జరిగిన చోట రిపోర్టింగ్ కి వెళ్ళిన అబ్బాస్, అక్కడ ఒక శవం పక్కన పడి ఉన్న సూట్ కేస్ ని తీసుకుంటాడు. అందులో ప్రధాన మంత్రికి సంబంధించిన కోట్ల ఖరీదైన వజ్రాలు ఉంటాయి. అసలే అత్యాశ పరురాలైన స్వరాజ్యం ఏం చేస్తుంది…? ఆ తరవాత కథ ఏ మలుపు తిరుగుతుంది అన్నదే కథాంశం.

——————————————————————

krishnarjuna_ver6

హీరోహీరోయిన్లు – మంచు విష్ణు, మమతా మోహన్ దాస్
నటీనటులు – నాగార్జున, మోహన్ బాబు, నాజర్, నెపోలియన్, సునీల్, బ్రహ్మానందం
సంగీతం – ఎం.ఎం. కీరవాణి
దర్శకత్వం – పి.వాసు
విడుదల తేదీ – 2008, ఫిబ్రవరి 1
లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించడమే కాకుండా.. ఓ కీలక పాత్ర కూడా పోషించిన చిత్రం కృష్ణార్జున. మంచు మనోజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలక పాత్ర పోషించడంతో ఇది భారీ సినిమాగా మారిపోయింది. కృష్ణుడిగా నాగార్జున, భక్తుడిగా విష్ణు చేసిన హంగామా ఈ సినిమాకు హైలెట్. సినిమా మధ్యలో మోహన్ బాబు, బాబా గెటప్ లో అలరిస్తారు. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించారు. తెలుగులో సోషియో-ఫాంటసీ జానర్ లో వచ్చిన అతికొద్ది చిత్రాల్లో ఇది కూడా ఒకటి.

——————————————————————

super-police

నటీ నటులు : వెంకటేష్, నగ్మా, సౌందర్య

ఇతర నటీనటులు : D. రామా నాయుడు, కోట శ్రీనివాస రావు, జయసుధ, బ్రహ్మానందం, ఆలీ, జయసుధ

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్

డైరెక్టర్ : K. మురళి మోహన్ రావు

ప్రొడ్యూసర్ : D. సురేష్

రిలీజ్ డేట్ : 23 జూన్ 1994

ఇన్స్ పెక్టర్ విజయ్ (వెంకటేష్) నిజాయితీ గల పోలీసాఫీసర్. తన గర్ల్ ఫ్రెండ్ ఒక ఆక్సిడెంట్ లో చనిపోతుంది. అప్పటి నుండి తాగుడుకు బానిస అయిన విజయ్ జర్నలిస్ట్ రేణుక ఇంటిలో అద్దెకు దిగుతాడు అంతలో విజయ్ కి అదే సొసైటీలో బిగ్ షాట్ గా చెలామణి అవుతున్న అబ్బాన్న తో వైరం ఏర్పడుతుంది. తనతో తలపడే ప్రాసెస్ తన గర్ల్ ఫ్రెండ్ చనిపోయింది ఆసిదేంట్ వల్ల కాదు, అది ప్లాన్డ్ మర్డర్ అని తెలుసుకుంటాడు. తనని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది..? తన దగ్గర ఉండిపోయిన సాక్ష్యాలేంటి అనే కోణంలో కథ ముందుకు సాగుతుంది.