జీ సినిమాలు (నవంబర్ 12th )

Friday,November 11,2016 - 08:50 by Z_CLU

rangoon-raja

నటీ నటులు: కమల్ హాసన్, సుజాత

మ్యూజిక్ : ఇళయరాజా

రిలీజ్  : 1981

విలక్షణ నటుడు కమల్ హాసన్, అంబిక, సుజాత కలిసి నటించిన హిల్లేరియస్ ఎంటర్ టైనర్ రంగూన్ రాజా. కమల హాసన్ కరియర్ లో ఈ సినిమా కూడా ఒకటి. ఇళయ రాజా సంగీతం సినిమాకి పెద్ద ఎసెట్.

———————————————————————————

pandurangadu

నటీ నటులు : నందమూరి బాలకృష్ణ, స్నేహ, టాబూ

ఇతర నటీనటులు : అర్చన, మేఘనా నాయుడు, సుహాసిని, మోహన్ బాబు, K.విశ్వనాథ్, బ్రహ్మానందం, సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం

మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి

డైరెక్టర్ : రాఘవేంద్ర రావు

నిర్మాత : కృష్ణమోహన రావు

రిలీజ్  : 30 మే 2008

1957 లో NTR నటించిన పాండురంగ మహాత్యం సినిమాకి రీమేక్ ఈ “పాండు రంగడు” సినిమా. అన్నమయ్య, శ్రీరామ దాసు లాంటి సినిమాల తర్వాత బాలకృష్ణ తో కూడా ఒక భక్తిరస చిత్రం చేయాలనుకున్న రాఘవేంద్ర రావు ఈ సినిమాని తెరకెక్కించారు. పాండురంగనిగా బాలకృష్ణ నటన, దానికి తోడు కీరవాణి సంగీతం ప్రతీది సినిమాకు ప్రత్యేక ఆకర్షణే. బాలయ్య సరసన స్నేహ, టాబూ హీరోయిన్ లుగా నటించారు.  

———————————————————————————

yuvakudu

నటీనటులు : సుమంత్, భూమిక చావ్లా

ఇతర నటీనటులు : జయసుధ, ఆలీ, వేణు మాధవ్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : A. కరుణాకరన్

ప్రొడ్యూసర్స్ : అక్కినేని నాగార్జున, N. సుధాకర్ రెడ్డి

రిలీజ్  : ఆగస్ట్ 2000

కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ యువకుడు. తన తండ్రి లాగే సైనికుడు కావాలని తపన పడే యువకుడిలా సుమంత్ నటన సినిమాకే హైలెట్. భూమిక తెలుగు తెరకు పరిచయమైంది ఈ సినిమాతోనే. తల్లి పాత్రలో జయసుధ నటన చాలా ఇంప్రెసివ్ గా ఉంటుంది.

———————————————————————————

ok-bangaram

నటీనటులు : దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్

ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, లీలా స్యామ్ సన్

మ్యూజిక్ డైరెక్టర్ : A.R.రెహ్మాన్

డైరెక్టర్ : మణిరత్నం

ప్రొడ్యూసర్ : మణిరత్నం

రిలీజ్  : 17 ఏప్రిల్ 2015

మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన ‘ఓకె కన్మణి’ కి డబ్బింగ్ వర్షన్ ‘ ఓకె బంగారం’. దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రెండు భాషలలోను ఒకేసారి రిలీజయి సూపర్ హిట్టయింది. మాడరన్ యూత్ మైండ్ సెట్ కి, సాంప్రదాయాలకి మధ్య సాగే యూత్ ఫుల్ ప్లాట్ తో తెరకెక్కిందే ‘ఓకె బంగారం’. ఈ సినిమాకి A.R. రెహ్మాన్ సంగీతం అందించాడు.

———————————————————————————

raam-nithin

నటీనటులు : నితిన్, జెనీలియా డిసౌజా

ఇతర నటీనటులు : కృష్ణంరాజు, బ్రహ్మానందం, హర్షిత భట్, అతుల్ కులకర్ణి, రాజ్యలక్ష్మి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా

డైరెక్టర్ : N. శంకర్

ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి

రిలీజ్  : 30 మార్చి 2006

అల్లరి బుల్లోడు, ధైర్యం తరవాత నితిన్ నటించిన కమర్షియల్ ఎంటర్ టైనర్ రామ్. నితిన్ సైకిల్ చాంపియన్ గా నటించిన ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఒక కీలక పాత్రలో నటించారు. డాక్టర్ చక్రవర్తిగా బ్రహ్మానందం నటన సినిమాకే హైలెట్.

———————————————————————————

dheerudu-vishal

నటీ నటులు : విశాల్, ఐశ్వర్య అర్జున్

ఇతర నటీనటులు : సంతానం, జగన్, జాన్ విజయ్, ఆదిత్య ఓం, మురళి శర్మ, సీత తదితరులు.

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

డైరెక్టర్ : భూపతి పాండ్యన్

ప్రొడ్యూసర్ : మైకేల్ రాయప్పన్

రిలీజ్  : 26 జూలై 2013

సినిమా సినిమాకి వైవిధ్యం ఉండేలా జాగ్రత్త పడతాడు విశాల్. సీనియర్ నటుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన తొలి తమిళ చిత్రం “పట్టాతు యానై” సినిమాకి డబ్బింగ్ వర్షన్ ఈ ధీరుడు. ఈ సినిమా రెండు భాషలలోను ఒకేసారి రిలీజయింది. సంతానం కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది.