జీ సినిమాలు (నవంబర్ 8th)

Monday,November 07,2016 - 07:00 by Z_CLU

sarpayagam-telugu-movie

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, రోజా

నటీనటులు – వాణివిశ్వనాథ్, రేఖ, నగేష్, నూతనప్రసాద్, బ్రహ్మానందం, సాయికుమార్

సంగీతం – విద్యాసాగర్

నిర్మాత – డా. డి.రామానాయుడు

రచన, దర్శకత్వం – పరుచూరి బ్రదర్స్

విడుదల  – 1991

 

తెలుగు సినిమాలో మాటల ప్రవాహానికి గేట్లు తెరిచిన రచయితల  ద్వయంగా అప్పటికే పరుచూరి బ్రదర్స్ కు ఓ పేరు వచ్చేసింది. అప్పటివరకు ఓ రకమైన పడికట్టు పదాలతో సాగిన తెలుగు సినిమా డైలాగుల్ని సమూలంగా మార్చేశారు ఈ స్టార్ బ్రదర్స్. అలా మాటలతో పాపులరైన ఈ బ్రదర్స్ ను దర్శక ద్వయంగా చూపించారు నిర్మాత రామానాయుడు. పరుచూరి బ్రదర్స్ దర్శకులుగా మారి తెరకెక్కించిన సినిమా సర్పయాగం. ఫ్యామిలీ హీరో శోభన్ బాబును మోస్ట్ ఎమోషనల్ యాంగ్రీ యంగ్ మేన్ గా చూపించిన సినిమా ఇది.

——————————————————————————————————————————

raamu

హీరోహీరోయిన్లు – బాలకృష్ణ, రజని

నటీనటులు – సత్యనారాయణ,  శారద, జగ్గయ్య,  చలపతిరావు

సంగీతం – ఎస్పీ బాలసుబ్రమణ్యం

దర్శకత్వం – వై.నాగేశ్వరరావు

విడుదల తేదీ – 1987, జులై 31

 

సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన చిత్రం రాము. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో శారద, జగ్గయ్య కీలకపాత్రలు పోషించారు. 1987లో విడుదలైన అన్ని చిత్రాల్లో సూపర్ హిట్ అయిన సినిమా ఇదే. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం.

——————————————————————————————————————————–

devatha

హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి

నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు

సంగీతం – చక్రవర్తి

దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు

విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4

 

దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన  ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

———————————————————————————————————————————-mangatayaru-tiffin-centre

నటీనటులు – ముమైత్  ఖాన్,  కృష్ణభగవాన్, ఎమ్మెస్ నారాయణ, అలీ, సుమన్ షెట్టి

సంగీతం – ఎం.ఎం.శ్రీలేఖ

దర్శకత్వం – వెంకీ

విడుదల – 2008

 

ముమైత్ ఖాన్ అందాలతో పాటు ఫుల్ లెంగ్త్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకుంటే మంగతాయారు టిఫిన్ సెంటర్ చూడాల్సిందే. అప్పటికే ఐటెంసాంగ్స్ తో ఫుల్ పాపులర్ అయిన ముమైత్ ఖాన్… లీడ్ రోల్ లో నటించిన సినిమా ఇది. ఎమ్మెస్ నారాయణ, అలీ,  కృష్ణభగవాన్ కామెడీ ఈ సినిమాకు హైలెట్.

————————————————————————————————————————————-

madhu-masam

హీరో హీరోయిన్స్ : సుమంత్, స్నేహ, పార్వతి మెల్టన్

నటీనటులు : గిరి బాబు, నరేష్, చలపతి రావు, ఏ.వి.ఎస్, ఆహుతి ప్రసాద్, రవి బాబు, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు మాధవ్

సంగీతం : మణిశర్మ

నిర్మాత : రామానాయుడు

దర్శకత్వం : చంద్ర సిద్దార్థ్

 

 అప్పటి వరకూ ప్రేమ కథ, యాక్షన్ సినిమాలతో ఎంటర్టైన్ చేసిన సుమంత్ ను కథానాయకుడిగా ఫామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రం ‘మధు మాసం’. ప్రేమ, పెళ్లి అంటే ఇష్టం లేని ఓ అబ్బాయి, ప్రేమ లో మాధుర్యాన్ని పొందాలని ఆరాట పడే ఓ అమ్మాయి మధ్య జరిగే కథ తో, యూత్ ఫుల్, ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకొని విజయవంతమైన సినిమాగా నిలిచింది. రచయిత బలభద్ర పాత్రుని రమణి రచించిన నవల ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని దర్శకుడు చంద్ర సిద్దార్థ్ తన దైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కించి అలరించాడు . ప్రముఖ నిర్మాత రామానాయుడు ఈ చిత్రాన్ని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి సూపర్ హిట్ సినిమాగా మలిచారు..

————————————————————————————-
jadhoo-gadu

హీరో హీరోయిన్స్ : నాగశౌర్య, సోనారిక

నటీనటులు : ఆశిష్ విద్యార్థి, అజయ్, జాకీర్ ఉస్సేన్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి,పృద్వి రాజ్, కోట శ్రీనివాస రావు

సంగీతం :సాగర్ మహతి

నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్

దర్శకత్వం : యోగి

 

అప్పటి వరకూ ప్రేమ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగ సౌర్య  పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించిన  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘జాదూ గాడు’.  ఈ చిత్రం తో హీరో నాగ సౌర్య ను సరి కొత్త కోణం లో ఆవిష్కరించి అలరించాడు దర్శకుడు యోగి. యాక్షన్ సన్నివేశాలతో పాటు  కామెడీ సన్నివేశాలు, క్లైమాక్స్, సాగర్ మహతి అందించిన పాటలు హైలైట్స్.   శ్రీనివాస్ రెడ్డి. పృద్వి, రమేష్, సప్తగిరి కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. నాగ సౌర్య సరసన కథానాయికగా నటించిన సోనారిక తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.