ZeeCinemalu - Nov 8

Saturday,November 07,2020 - 07:23 by Z_CLU

హలో
నటీనటులు : అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్
ఇతర నటీనటులు : జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్, సత్య కృష్ణన్, అనీష్ కురువిల్ల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : విక్రమ్ కుమార్
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017
చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీను, జున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరు? అవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

==========================

రామయ్యా వస్తావయ్యా
నటీనటులు : NTR, శృతి హాసన్, సమంత రుత్ ప్రభు
ఇతర నటీనటులు : విద్యుల్లేఖ రమణ్, P.రవి శంకర్, ముకేష్ రిషి, కోట శ్రీనివాస్ రావు, రావు రమేష్, తనికెళ్ళ భరణి
సంగీతం : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
నిర్మాత : దిల్ రాజు
జూనియర్ ఎన్టీఆర్ కరియర్ లోనే కలర్ ఫుల్ గా ఎంటర్ టైనర్ గా నిలిచింది రామయ్యా వస్తావయ్య. శృతి హాసన్, సమంతా లు హీరోయిన్లు గా నటించిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించాడు. సినిమా ఫస్ట్ హాఫ్ లో లవర్ బాయ్ లా, జాలీగా ఉండే కుర్రాడిలా ఉండే NTR, ఇంటర్వెల్ బ్యాంగ్ తరవాత తన విశ్వరూపం చూపిస్తాడు. ఎక్స్ పెక్ట్ చేయని ట్విస్టు లతో సినిమాని చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు హరీష్ శంకర్. S.S. తమన్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

=========================

లై
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : హను రాఘవపూడి
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017
‘లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.

=========================

నా పేరు శివ
నటీనటులు : కార్తీ, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : జయప్రకాష్, సూరి, రవి ప్రకాష్, రాజీవన్, విజయ్ సేతుపతి, లక్ష్మీ రామకృష్ణన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : సుసీంతిరన్
ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేళ్ రాజా
రిలీజ్ డేట్ : 20ఆగష్టు 2010
సుసీంతిరన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రైం థ్రిల్లర్ నా పేరు శివ. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==========================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

=========================

జై చిరంజీవ
నటీనటులు : చిరంజీవి, భూమిక చావ్లా, సమీరా రెడ్డి
ఇతర నటీనటులు : అర్బాజ్ ఖాన్, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, రాహుల్ దేవ్, సునీల్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ
డైరెక్టర్ : K. విజయ భాస్కర్
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2005
మెగాస్టార్ కరియర్ లో బెస్ట్ గా నిలిచిన సినిమా జై చిరంజీవ. తన మేనకోడలిని చంపినక్రిమినల్స్ ని రీచ్ అవ్వడానికి హీరో ఎలాంటి స్టెప్స్ తీసుకున్నాడు అనే కథాంశంతో తెరకెక్కిన ‘జైచిరంజీవ’ హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనిపించుకుంది.