ZeeCinemalu - Nov 6

Thursday,November 05,2020 - 09:46 by Z_CLU

memu-zee-cinemalu-427x320

మేము
నటీనటులు : సూర్య, అమలా పాల్
ఇతర నటీనటులు : రామ్ దాస్, కార్తీక్ కుమార్, విద్యా ప్రదీప్, బిందు మాధవి, నిశేష్, వైష్ణవి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : ఆరోల్ కోలేరి
డైరెక్టర్ : పాండిరాజ్
ప్రొడ్యూసర్స్ : సూర్య, పాండిరాజ్
రిలీజ్ డేట్ : 24th డిసెంబర్ 2015
పిల్లల్లో హైపర్ ఆక్టివిటీని ఎలా హ్యాండిల్ చేయాలి అనే సెన్సిటివ్ టాపిక్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మేము. ఈ సినిమాలో సూర్య, అమలా పాల్ నటన హైలెట్ గా నిలిచింది

===========================

mr-majnu

మిస్టర్ మజ్ను
నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు
సంగీతం : థమన్
ఛాయాగ్రహణం : జార్జ్ సి. విలియమ్స్
నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి
నిడివి : 145 నిమిషాలు
విడుదల తేది : 25 జనవరి , 2019
లండన్ లో చదువుకునే విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కి(అఖిల్) నిత్యం అమ్మాయిలను తన మాయలో పడేస్తూ వారిని ఆనందంగా ఉంచుతుంటాడు. అదే లండన్ లో అబద్దాలు చెప్పకుండా తనని మాత్రమే ప్రేమించే అబ్బాయి కోసం ఎదురుచూస్తోంటుంది నిఖిత(నిధి అగర్వాల్). అనుకోకుండా వీరిద్దరూ లండన్ లో పరిచయమవుతారు. విక్కి ప్లే బాయ్ క్యారెక్టర్ చూసి అతనికి దూరంగా ఉండాలనుకుంటుంది నిఖిత.. ఈ క్రమంలో ఇండియా తిరిగి వచ్చిన వీరిద్దరికీ విక్కీ చెల్లికి , నిఖిత అన్నయ్య కి పెళ్లి కుదిరిందని తెలుస్తుంది.
అయితే విక్కీ తన ఫ్యామిలీ కి ఇచ్చే ఇంపార్టెన్స్ , తండ్రిపై అతనికున్న గౌరవం, దగ్గరైన వారిని ఎంతగా ప్రేమిస్తాడో తెలుసుకొని అతనితో ప్రేమలో పడిపోతుంది నిఖిత. అయితే ప్రేమ అనేది జస్ట్ నెలకే పరిమితం అనే ఫీలింగ్ లో ఉంటూ పెళ్ళికి దూరంగా ఉండే విక్కీ కి లవ్ ప్రపోజ్ చేస్తుంది నిఖిత. అతనికి ఇష్టం లేకపోవడంతో ఓ రెండు నెలలు తనను ప్రేమించాలని, ఆ తర్వాత ఇష్టం కలిగితే పెళ్లి చేసుకోవాలని ఒప్పందం కుదుర్చుకుంటుంది నిఖిత. అక్కడి నుండి అసలు కథ మొదలవుతోంది. అలా నిఖిత ఒప్పందానికి లాక్ అయిన విక్కీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కున్నాడు.. చివరికి విక్కీ-నిఖిత ఎలా ఒకటయ్యారు..అనేది మిగతా కథ.

=============================

pooja movie vishal

పూజ
నటీనటులు : విశాల్, శృతి హాసన్
ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్, తదిరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : హరి
ప్రొడ్యూసర్ : విశాల్
రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014
విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’. ప్రతి సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్ హైలైట్స్ .

=======================

naa-peru-surya-naa-illu-india

నా పేరు సూర్య
నటీనటులు : అల్లు అర్జున్, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, R. శరత్ కుమార్, జానకి వర్మ, ఠాకూర్ అనూప్ సింగ్, బోమన్ ఇరాని తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : విశాల్ శేఖర్, జాన్ స్టీవర్ట్ ఏడూరి
డైరెక్టర్ : వక్కంతం వంశీ
ప్రొడ్యూసర్ : శ్రీధర్ లగడపాటి, శిరీష లగడపాటి, బన్నీ వాస్
రిలీజ్ డేట్ : 4 మే 2018
సైనికుడు సూర్య(అల్లు అర్జున్)కు కోపం ఎక్కువ. ఈ క్రమంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవలో నలుగుతుంటాడు. కానీ ఆ ప్రతి గొడవకు ఓ రీజన్ ఉంటుంది. అదే కోపంతో ఒక టెర్రరిస్ట్ ని కాల్చి చంపుతాడు. దీంతో కల్నల్ శ్రీవాత్సవ్ (బోమన్ ఇరానీ) సూర్యను డిస్మిస్ చేస్తాడు. తిరిగి ఆర్మీలో చేరాలంటే చివరి అవకాశంగా ప్రముఖ సైకాలజి యూనివర్సిటీ డీన్ రామకృష్ణంరాజు(అర్జున్) సంతకం తీసుకుని రమ్మని చెబుతారు. అలా రామకృష్ణంరాజు సంతకం కోసం వైజాగ్ వస్తాడు సూర్య. అయితే తను సంతకం చేయాలంటే 21 రోజులు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని సూర్య కి కండీషన్ పెడతాడు కృష్ణంరాజు.
అప్పుడే వైజాగ్ లోకల్ డాన్ చల్లా(శరత్ కుమార్), కొడుకు(అనూప్ టాగోర్ సింగ్)తో గొడవ పెట్టుకుంటాడు సూర్య. స్థానికంగా ఉండే మాజీ సైనికుడు ముస్తఫా(సాయి కుమార్)ను ఓ లాండ్ కోసం హత్య చేస్తాడు చల్లా కొడుకు. ఆ హత్యలో ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాడు సూర్య. కానీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం తన వ్యక్తిత్వాన్ని వదిలేసి అబద్ధం చెబుతాడు. ఫైనల్ గా సూర్య తను అనుకున్నది సాధించాడా.. కృష్ణంరాజు సంతకంతో తిరిగి ఆర్మీలో చేరాడా లేదా..? అసలు సూర్యకు కృష్ణంరాజుకు సంబంధం ఏంటి ? తన క్యారెక్టర్ కోసం సూర్య ఏం చేశాడు అనేది సినిమా కథ.

================================

crime-23-movie-క్రైమ్-23

క్రైమ్ 23
నటీనటులు – అరుణ్ విజయ్, మహిమా నంబియార్, వంశీ కృష్ణ, తంబీ రామయ్య
దర్శకుడు – అరవగన్ వెంకటాచలం
బ్యానర్ – శ్రీ విజయ నరసింహా ఫిలిమ్స్
నిర్మాత – ప్రసాద్ ధర్మిరెడ్డి
సంగీతం – విశాల్ చంద్రశేఖరన్
రిలీజ్ డేట్ – ఆగస్ట్ 31, 2018
కంప్లీట్ సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఫీల్ కావాలంటే CRIME 23 మూవీ చూడాల్సిందే. చర్చి ఫాదర్, ప్రెగ్నెంట్ జెస్సిక అనుమానాస్పద హత్యలతోనే ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి సిటీ అసిస్టెంట్ కమిషనర్ అయినా అరుణ్ విజయ్ రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేట్ చేస్తున్న క్రమంలో ఈ హత్యలు మెడికల్ మాఫియా తో సంభంధం ఉందని తెలుసుకుంటాడు విజయ్. అసలు ఈ మెడికల్ మాఫియా ఎవరిది? ఎందుకుప్రెగ్నెంట్ లేడీస్ ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? ఇలా ఎన్నో మలుపులు, ఇంకెంతో ఉత్కంఠ మధ్య సాగుతుంది క్రైమ్ 23 మూవీ.