ZeeCinemalu - Nov 4

Tuesday,November 03,2020 - 11:45 by Z_CLU

నా లవ్ స్టోరీ మొదలైంది

హీరోహీరోయిన్లు – శివకార్తికేయన్, నయనతార, ప్రియా ఆనంద్
డైరక్టర్ – దురై సెంథిల్ కుమార్
బ్యానర్ – సర్వాంత్ రామ్ క్రియేషన్స్
నిర్మాత – జె.రామాంజనేయులు
మ్యూజిక్ డైరక్టర్ – అనిరుధ్
సినిమాటోగ్రాఫర్ – వేల్ రాజ్
రిలీజ్ డేట్ – జనవరి 29, 2014
మంచి కథ, ఆరోగ్యకరమైన హాస్యం, వినసొంపైన పాటలు ఉన్న సినిమా నా లవ్ స్టోరీ మొదలైంది. శివకార్తికేయన్, నయనతార, ప్రియా ఆనంద్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించాడు. ఈ సినిమాను తమిళ్ లో హీరో ధనుష్ నిర్మించడంతో పాటు ఓ పాట పాడాడు. అంతేకాదు, ఆ పాటకు నయనతారతో కలిసి డాన్స్ కూడా చేశాడు. అనిరుధ్ అందించిన ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి.

===========================

బాబు బంగారం
నటీనటులు : వెంకటేష్, నయనతార
ఇతర నటీనటులు : సంపత్ రాజ్, మురళీ శర్మ, జయప్రకాష్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : మారుతి
ప్రొడ్యూసర్ : S . నాగవంశీ, P . D . V . ప్రసాద్
రిలీజ్ డేట్ : 12 ఆగష్టు 2016
తాత జాలిగుణం వారసత్వం గా అందుకున్న కృష్ణ (వెంకటేష్) అనే పోలీస్ ఆఫీసర్ ఆ జాలి గుణం తోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భం లో తన లాగే జాలి గుణం తో ఉండే శైలు (నయనతార) ను చూసి ఇష్టపడతాడు కృష్ణ. ఇక తాను ప్రేమిస్తున్న శైలు కుటుంబానికి ఎం.ఎల్.ఏ పుచ్చప్ప(పోసాని),మల్లేష్(సంపత్) లతో ఆపద ఉందని తెలుసుకున్న కృష్ణ ఆ ఫామిలీ ను అలాగే శైలు నాన్న ను ఎలా కాపాడాడు? చివరికి కృష్ణ ఆ ఇద్దరి ఆట ఎలా కట్టించాడు? అనేది చిత్ర కధాంశం.

============================

భగీరథ
నటీనటులు : రవి తేజ, శ్రియ
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, నాజర్,
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : రసూల్ ఎల్లోర్
ప్రొడ్యూసర్ :మల్లిడి సత్య నారాయణ రెడ్డి
రిలీజ్ డేట్ : అక్టోబర్ 13, 2005
రవి తేజ, శ్రియ హీరో హీరోయిన్స్ గా రసూల్ ఎల్లోర్ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ‘భగీరథ‘. ఈ సినిమాకు ప్రస్తుతం టాప్ డైరెక్టర్ గా గుర్తింపు అందుకున్న కిషోర్ కుమార్ పార్ధసాని (డాలీ) కథ ను అందించారు. కృష్ణ లంక అనే పల్లెటూరి లో జనాలు పడే ఇబ్బందులను ఓ యువకుడు ఎలా పరిష్కరించాడు అనే కథతో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా లో రవి తేజ నటన, శ్రియ గ్లామర్, పల్లెటూరి సీన్స్, చక్రి పాటలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రవి తేజ-ప్రకాష్ రాజ్ మధ్య వచ్చే పోటా పోటీ సీన్స్ అందరినీ అలరిస్తాయి.

============================

బొమ్మరిల్లు
నటీనటులు : సిద్ధార్థ్, జెనీలియా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, జయసుధ, సత్య కృష్ణన్, సుదీప పింకీ, సురేఖా వాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 9 ఆగష్టు 2006
తండ్రి కొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ బొమ్మరిల్లు. న్యాచురల్ పర్ఫామెన్స్ అలరించిన జెనీలియా, సిద్ధార్థ్ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలెట్.

================================

దొంగ
నటీనటులు – కార్తి, జ్యోతిక, సత్యరాజ్, నిఖిలా విమల్, సీత, ఇళవరసు
దర్శకుడు – జీతూ జోసెఫ్
బ్యానర్ – వయకామ్ స్టుడియోస్, పారలల్ మైండ్స్ ప్రొడక్షన్
నిర్మాత – రావూరి వి శ్రీనివాస్
సంగీతం – గోవింద వసంత్
రిలీజ్ డేట్ – డిసెంబర్ 20, 2019
విలక్షణ నటుడు కార్తి, సీనియర్ హీరోయిన్ జ్యోతిక నటించిన సినిమా దొంగ. జ్యోతిక, కార్తీ కలిసి నటించిన తొలి చిత్రం ‘దొంగ’ (Donga). నిజ జీవితంలో వదిన-మరిది అయిన వీళ్లిద్దరూ ఈ చిత్రంలో అక్కాతమ్ముళ్లుగా నటించడం విశేషం. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతూ జోసేఫ్‌ ఈ చిత్రానికి దర్శకుడు. సత్యరాజ్‌ తండ్రి పాత్ర పోషించిన ఈ చిత్రంలో Karthi సరసన ‘మేడ మీద అబ్బాయి’, ‘గాయత్రి’ ఫేమ్‌ నిఖిలా విమల్‌ హీరోయిన్ గా నటించింది.
గోవాలో చిన్న చిన్న దొంగతనాలు, చీటింగ్ లు చేస్తూ ఫ్రీ బర్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు విక్కీ(కార్తీ). 15ఏళ్లుగా తప్పిపోయిన కొడుకు శర్వా కోసం వెతుకుతుంటారు తండ్రి జ్ఞానమూర్తి (సత్య రాజ్), అక్క పార్వతి(జ్యోతిక). బాగా డబ్బున్న ఈ కుటుంబంలోకి శర్వాలానే ఉన్న విక్కీని ప్రవేశపెడతాడు పోలీసాఫీసర్ జీవానంద్ (ఇళవరసు). డబ్బు కోసం అతడు ఈ పని చేస్తాడు.
మరి శర్వా గా జ్ఞానమూర్తి కుటుంబంలోకి వెళ్లిన విక్కీ అక్కడ ఎదుర్కున్న పరిస్థితులు ఏమిటి? ఆ కుటుంబం అతనిని నమ్మిందా? అసలు శర్వా ఏమయ్యాడు? చివరికి విక్కీ, పార్వతి, జ్ఞానమూర్తిల కథ ఎలా ముగిసింది? అనేది ఈ ‘దొంగ’ స్టోరీ.