ZeeCinemalu - Nov 12

Wednesday,November 11,2020 - 11:15 by Z_CLU

కురుక్షేత్రం
నటీనటులు -అర్జున్, శృతి హరిహరణ్, సుమన్, ప్రసన్న, వరలక్ష్మి శరత్ కుమార్, వైభవ్
దర్శకుడు – అరుణ్ వైద్యనాథన్
బ్యానర్ – శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత – శ్రీనివాస్ మీసాల
సంగీతం – ఎస్.నవీన్
రిలీజ్ – 2018, సెప్టెంబర్ 21
యాక్షన్ హీరో అర్జున్ కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన హీరోగా నటించినా, క్యారెక్టర్ పోషించినా… ఆయన స్థానం ప్రత్యేకం. అందుకే అభిమానులు ఆయన
సినిమా కోసం ఎదురుచూస్తుంటారు. మరి అలాంటి యాక్షన్ హీరో అర్జున్ నటించిన 150వ సినిమా ఎంత ప్రత్యేకమో చెప్పక్కర్లేదు. యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన 150వ చిత్రం కురుక్షేత్రం.
శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత శ్రీనివాస్ మీసాల ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా, థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది కురుక్షేత్రం సినిమా. అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్.

=========================

పండగ చేస్కో
నటీనటులు : రామ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : సాయికుమార్, సోనాల్ చౌహాన్, బ్రహ్మానందం, ఆదిత్య మీనన్, రావు రమేష్, పవిత్ర లోకేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : రవి కిరీటి
రిలీజ్ డేట్ : 29 మే 2015
రామ్, రాకుల్ జంటగా నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ పండగ చేస్కో. తన కుటుంబ సభ్యుల మధ్య అగాధంలా పేరుకుపోయిన దూరాన్ని హీరో ఎలా తగ్గించాడు..? సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ప్రధాన కథాంశం. ఎంటర్ టైనింగ్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

=========================

శతమానంభవతి
నటీనటులు : శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, జయసుధ, నరేష్, ఇంద్రజ, రాజా రవీంద్ర, హిమజ, ప్రవీణ్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ. జే. మేయర్
డైరెక్టర్ : సతీష్ వేగేశ్న
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 14 జనవరి 2017
ఆత్రేయపురం అనే గ్రామంలో రాఘవ రాజు(ప్రకాష్ రాజ్) జానకమ్మ(జయసుధ) అనే దంపతులు తమ పిల్లలు విదేశాల్లో స్థిరపడి తమను చూడడానికి రాకపోవడంతో కలత చెంది తన మనవడు రాజు (శర్వానంద్) తో కలిసి సొంత ఊరిలోనే జీవిస్తుంటారు. ఈ క్రమంలో పిల్లల్ని ఎలాగైనా సంక్రాంతికి తమ ఊరికి రప్పించాలని రాజు గారిని కోరుతుంది జానకమ్మ. తన భార్య కోరిక మేరకూ ఎప్పుడు కబురుపెట్టినా రాని పిల్లల కోసం ఒక పథకం వేసి సంక్రాంతికి ఊరు రప్పిస్తాడు రాఘవ రాజు. ఇంతకీ రాజు గారు వేసిన ఆ పథకం ఏమిటి? రాజు గారి కబురు మేరకు స్వదేశం తిరిగొచ్చిన పిల్లలు తాము దూరంగా ఉండడం వల్ల తల్లిదండ్రుల పడుతున్న భాధ ఎలా తెలుసుకున్నారు? అనేది ఈ సినిమా కథాంశం.

=============================

కృష్ణ
నటీనటులు : రవితేజ, త్రిష కృష్ణన్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, సునీల్, వేణు మాధవ్, ముకుల్ దేవ్, చంద్ర మోహన్, దండపాణి, కళ్యాణి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చక్రి
డైరెక్టర్ : V.V.వినాయక్
ప్రొడ్యూసర్స్ : కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 11 జనవరి 2008
రవితేజ, త్రిష నటించిన కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ కృష్ణ. V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రవితేజ కరియర్ లో హైలెట్ గా నిలిచింది. కాశీ విశ్వనాథం, D.V.V. దానయ్య కలిసి నిర్మించిన ఈ సినిమాకి చక్రి సంగీతం హైలెట్ గా నిలిచింది.

============================

టాక్సీవాలా
నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్
ఇతర నటీనటులు : మాళవిక నాయర్, మధునందన్, కళ్యాణి, విష్ణు, రవి వర్మ, శిజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజాయ్
డైరెక్టర్ : రాహుల్ సంక్రిత్యాన్
ప్రొడ్యూసర్ : SKN, బన్ని వాస్
రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2018
అతి కష్టం మీద ఐదేళ్లు చదివి డిగ్రీ పూర్తిచేసిన శివ (విజయ్‌ దేవరకొండ), అన్నయ్య(రవి ప్రకాష్) వదిన(కళ్యాణి)లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వస్తాడు. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ 2-3 ఉద్యోగాలు చేసి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఓ టాక్సీవాలా గా సెట్ అవ్వాలనుకుంటాడు.
కారు కొనడానికి డబ్బు లేకపోవడంతో తన బంగారం అమ్మి శివ కి డబ్బులు ఇస్తుంది వదిన. అలా వదిన ఇచ్చిన డబ్బుతో కారు కొనేందుకు వెతుకుతున్న క్రమంలో రఘు రామ్(సిజ్జు) దగ్గర ఓ పాత కాంటెస్సా ఉందని తెలుసుకొని ఆ కారుని కొంటాడు శివ. అలా క్యాబ్‌ డ్రైవర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఫస్ట్ డ్రైవ్ లో పరిచయం అయిన అనూష(ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో శివకి తను నడుపుతున్న కారులో దెయ్యం ఉందని తెలుస్తుంది. టాక్సీలో నిజంగానే దెయ్యం ఉందా..? ఇంతకీ టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథకి శిశిర (మాళవిక నాయర్‌) అనే అమ్మాయికు సంబంధం ఏంటి..? అనేది ‘టాక్సీవాలా’ కథ.

=============================

ఛల్ మోహనరంగ
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : మధునందన్, రావు రమేష్, నరేష్, లిస్సి, సంజయ్ స్వరూప్, ప్రగతి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : కృష్ణ చైతన్య
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018
చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.