ZeeCinemalu - Nov 1

Saturday,October 31,2020 - 11:32 by Z_CLU

బ్రదర్స్
నటీనటులు : సూర్య శివకుమార్, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ఇషా శర్వాణి, వివేక్, సచిన్ ఖేడ్కర్, తార
మ్యూజిక్ డైరెక్టర్ : హారిస్ జయరాజ్
డైరెక్టర్ : K.V.ఆనంద్
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 2012
సూర్య, కాజల్ అగర్వాల్ నటించిన బ్రదర్ సైన్స్ ఫిక్షన్ ఎంటర్ టైనర్. K.V. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూర్య కరియర్ లోనే హైలెట్ గా నిలిచింది. అతుక్కుని ఉండే కవలలుగా సూర్య నటించిన తీరు అద్భుతమనిపిస్తుంది.

==================================

ఇద్దరమ్మాయిలతో
నటీనటులు : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్
ఇతర నటీనటులు: బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, తులసి, నాజర్, ప్రగతి, ఆలీ, షవార్ ఆలీతదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : పూరి జగన్నాథ్
ప్రొడ్యూసర్ : బండ్ల గణేష్
రిలీజ్ డేట్ : 31 మే, 2013
అల్లు అర్జున్ హీరోగా పూరి జగన్నాథ్ హీరోగా తెరకెక్కిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ఇద్దరమ్మాయిలతో. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమా బన్ని కరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిర్మించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎసెట్.

===============================

bloodshot telugu movie

బ్లడ్ షాట్
నటీనటులు – విన్ డీజిల్, ఐజా గొంజేల్, శామ్ హ్యూగాన్
దర్శకుడు – డేవిడ్ విల్సన్
బ్యానర్లు – కొలంబియా పిక్చర్స్, బోన ఫిలిం గ్రూప్, క్రాస్ క్రీక్ పిక్చర్స్
నిర్మాతలు – నీల్ మార్టిజ్, టోబీ జెఫ్పీ, విన్ డీజిల్
రన్ టైమ్ – 109 నిమిషాలు
రిలీజ్ డేట్ – మార్చి 13, 2020 (అమెరికా)
యూఎస్ మిలటరీలో పనిచేసే రే గారిసన్ అనుకోని పరిస్థితుల మధ్య ప్రాణం కోల్పోతాడు. అతడి శరీరాన్ని యూఎస్ నానైట్ టెక్నాలజీ పరీక్షల కోసం పంపిస్తారు. అక్కడ బ్లడ్ షాట్ టెక్నాలజీ ఆధారంగా రే కు తిరిగి ప్రాణం పోస్తారు. అయితే అతడి మెమొరీ మొత్తాన్ని నాశనం చేశారు.
ఎవర్నయితే చంపాలని టార్గెట్ చేస్తారో, అతడికి సంబంధించిన వివరాల్ని మాత్రం మెదడులోకి ఎక్కిస్తారు. ఇలా రేను ఓ ఆయుధంగా ఉపయోగించుకుంటారు.

రే శరీరం పూర్తిగా బ్లడ్ షాట్ టెక్నాలజీకి అలవాటుపడిపోతుంది. అదే టైమ్ లో తన భార్యను చంపిన అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటాడు రే. ఈ క్రమంలో తనపై ప్రయోగించిన బ్లడ్ షాట్ ప్రొగ్రామ్ ను, నానైట్స్ టెక్నాలజీని రే తనకు ఎలా అనుకూలంగా
మలుచుకున్నాడు.. తన భార్యను చంపిన వ్యక్తిని ఎలా అంతం చేశాడనేది స్టోరీ.

===========================

బ్రదర్ ఆఫ్ బొమ్మాలి
నటీనటులు : అల్లరి నరేష్, కార్తీక, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణే, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : చిన్ని కృష్ణ
ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి
రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014
కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా , కార్తీక, మోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీ, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ పెరఫార్మెన్స్, శేఖర్ చంద్ర మ్యూజిక్, కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.

===============================

శివలింగ
నటీనటులు : రాఘవ లారెన్స్, రితిక సింగ్
ఇతర నటీనటులు : శక్తి వాసుదేవన్, రాధా రవి, వడివేలు, సంతాన భారతి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : P. వాసు
ప్రొడ్యూసర్ : R. రవీంద్రన్
రిలీజ్ డేట్ : 14 ఏప్రియల్ 2017
ట్రైన్ లో ప్రయాణిస్తూ హఠాత్తుగా చనిపోయిన రహీం(శక్తి) కేస్ ను ఇంటరాగేషన్ చేయమని పవర్ ఫుల్ సీబీ-సీఐడీ ఆఫీసర్ శివలింగేశ్వర్(లారెన్స్) కు అప్పజెప్తారు కమిషనర్.. అలా కమిషనర్ ఆర్డర్ తో రహీం కేసును టేకప్ చేసిన శివలింగేశ్వర్ తన భార్య సత్యభామ(రితిక సింగ్)తో కలిసి వరంగల్ కి షిఫ్ట్ అవుతాడు. అలా రహీం కేసు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన లింగేశ్వర్ ఆ కేసులో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు..? చనిపోయిన రహీం బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ఫైనల్ గా శివలింగేశ్వర్ ఏం చేశాడు.. అనేది సినిమా కథాంశం.

=============================

 

పేపర్ బాయ్
నటీనటులు: సంతోష్ శోభన్, రియా సోమన్
ఇతర నటీనటులు: తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: భీమ్స్
డైరెక్టర్ : V. జయశంకర్
ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018
పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.