జీ సినిమాలు - మే 26

Monday,May 25,2020 - 08:06 by Z_CLU

విశ్వామిత్ర
నటీనటులు : ప్రసన్న, నందితా రాజ్
ఇతర నటీనటులు : ఆషుతోష్ రానా, సత్యం రాజేష్, విద్యుల్లేఖ రామన్, జీవ, సత్య మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : రాజ కిరణ్
ప్రొడ్యూసర్స్ : మాధవి అద్దంకి, S. రజినీకాంత్, ఫణి తిరుమలశెట్టి
రిలీజ్ డేట్ : 14 జూన్ 2019
అందరూ తన వాళ్లే అనుకునే ఓ మధ్యతరగతి అమ్మాయి నందితారాజ్. ఆమె అంటే అందరికీ ఇష్టమే. ఆఫీస్ లో ఆమె బాస్ మాత్రం నందితను మరో రకంగా చూస్తుంటాడు. ఎలాగైనా ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో నందిత కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది. అయితే ఆమెకు సమస్య ఎదురైన ప్రతిసారి ఓ అజ్ఞాతవ్యక్తి వచ్చి రక్షిస్తుంటాడు. అలా వాళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది.
నందితకు పోలీసాఫీసర్ ప్రసన్న మంచి ఫ్రెండ్. మాటల సందర్భంలో ఓసారి తన అజ్ఞాత స్నేహితుడి గురించి ప్రసన్నకు చెబుతుంది. నందిత ఎలాంటి అమ్మాయో, ఎంత అమాయకురాలో తెలుసు కాబట్టి ఆమె మోసపోకూడదనే ఉద్దేశంతో, ఆ అజ్ఞాత స్నేహితుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు ప్రసన్న.
ఎంక్వయిరీలో భాగంగా ప్రసన్న, నందితకు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు? నందితను అతడు పదేపదే ఎందుకు రక్షిస్తుంటాడు? తన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రసన్న తెలుసుకున్న రహస్యాలేంటి? చివరికి నందిత తన అజ్ఞాత స్నేహితుడ్ని కలుసుకుందా లేదా అనేది క్లయిమాక్స్.

=================================

బ్రహ్మోత్సవం
నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ : 20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=====================================

బ్రాండ్ బాబు
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : J.B.
డైరెక్టర్ : ప్రభాకర్ P.
ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు
రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018
వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.
అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=================================

ఆజాద్
నటీనటులు: నాగార్జున, సౌందర్య, శిల్పాషెట్టి, రఘువరన్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: వైజయంతీ మూవీస్
నిర్మాత: అశ్వనీదత్
దర్శకుడు: తిరుపతి స్వామి
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 29, 2000
తిరుపతి స్వామి దర్శకత్వంలో నాగార్జున చేసిన సినిమా ఆజాద్. దేశభక్తి కాన్సెప్ట్ కు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఇక సౌందర్య నటన, శిల్పాషెట్టి అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. ఈ సినిమాకు తిరుపతి స్వామితో పాటు యండమూరి వీరేంద్రనాథ్, భూపతిరాజా, క్రేజీ మోహన్ లాంటి ప్రముఖులు స్క్రీన్ ప్లే అందించారు.

=================================

ఒక్కడొచ్చాడు
నటీనటులు : విశాల్, తమన్నా
ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సూరజ్
ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్
రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016
డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

===================================

స్టూడెంట్ నంబర్ 1
నటీనటులు : N.T.R., గజాల
ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి
డైరెక్టర్ : S.S. రాజమౌళి
ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు
రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001
ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..? తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.