ZeeCinemalu - May 23

Saturday,May 22,2021 - 09:24 by Z_CLU

thumbaa-zeecinemalu

తుంబా
నటీనటులు : దశన్, KPY ధీన, కీర్తి పాండ్యన్
ఇతర నటీనటులు : ధరణి వాసుదేవన్, జార్జ్ విజయ్ నెల్సన్, కళైయారసన్ కన్నుసామి మరియు తదితరులు
మ్యూజిక్ కంపోజర్ : అనిరుద్ రవిచందర్, వివేక్ మెర్విన్, సంతోష్ దయానిధి
డైరెక్టర్ : హరీష్ రామ్ L.H.
ప్రొడ్యూసర్ : సురేఖ న్యాపతి
రిలీజ్ డేట్ : 21 జూన్ 2019
అనుకోకుండా అడవిలోకి వచ్చి పడిన పులి (తుంబా), దానిబిడ్డ చుట్టూ తిరిగే కథే తుంబా. అలా ప్రమాదవశాత్తు అడివిలోకి వచ్చిన ఈ రెండింటి లెక్క గవర్నమెంట్ రికార్డ్స్ లో ఎలాగూ ఉండదు కాబట్టి వీటిని అమ్ముకుని ఎలాగైనా సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉంటాడు అక్కడి ఫారెస్ట్ ఆఫీసర్. ఇదిలా ఉంటే ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్ళి ఫోటోస్ తీయడానికి పర్మిషన్ తీసుకున్న వర్ష తో పాటు, ఆ అడవికి దగ్గరలో పులి రియల్ స్టాచ్యూ తయారు చేసే పనిలో ఉన్న మరో ముగ్గురు ఈ విషయాన్ని గ్రహించి ఎలాగైనా ఆ పులిని, దానిబిడ్డని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ నుండి కాపాడాలనుకుంటారు. ఇంతకీ తుంబని, దాని బిడ్డని వీళ్ళు కాపాడగలిగారా..? లేదా అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

======================

ready-ram-genelia-zeecinemalu

రెడీ
నటీనటులు : రామ్, జెనీలియా
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, నాజర్, చంద్రమోహన్, తనికెళ్ళ భరణి, కోట శ్రీనివాస రావు,జయప్రకాష్ రెడ్డి, సుప్రీత్, షఫీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : స్రవంతి రవి కిషోర్
రిలీజ్ డేట్ : 19 జూన్ 2008
రామ్ జెనీలియా నటించిన హిలేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ రెడీ. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. కామెడీ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

========================

transformers-2-movie-ట్రాన్స్-ఫార్మర్స్-2-fpc-zeecinemalu

ట్రాన్స్ ఫార్మర్స్
నటీనటులు – షియా లాబాఫ్, మేగన్ ఫాక్స్, జోష్ డామెల్, టైర్స్ గిబ్సన్ తదితరులు
సంగీతం – స్టీవ్ జాబిన్ సన్
ప్రొడక్షన్ – డ్రీమ్ వర్క్స్ పిక్చర్స్, పారామౌంట్ పిక్చర్స్
దర్శకత్వం – మైఖేల్ బే
సూపర్ హిట్టయిన ట్రాన్స్ ఫార్మర్స్ సినిమాకు కొనసాగింపుగా వచ్చింది ట్రాన్స్ ఫార్మర్స్-2. 2009లో వచ్చిన ఈ సినిమాకు రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్ అనేది ట్యాగ్ లైన్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. అద్భుతమైన గ్రాఫిక్స్, మైకేల్ బే దర్శకత్వం ప్రతిభ ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి. ట్రాన్స్ ఫార్మర్స్ సిరీస్ లో వరుసగా సినిమాలు రావడానికి ప్రధాన కారణం ఈ పార్ట్-2 హిట్ అవ్వడమే. జీ సినిమాలు ఛానెల్ లో ఈ సినిమాను తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి.

======================

sivaji-rajinikanth-zeecinemalu

శివాజీ
నటీనటులు : రజినీకాంత్, శ్రియ శరన్
ఇతర నటీనటులు : వివేక్, సుమన్, రఘువరన్, మణివన్నన్, వడివుక్కరసి, కోచిన్ హనీఫా తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్
డైరెక్టర్ : S.శంకర్
ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్
రిలీజ్ డేట్ : 15 జూన్ 2007
ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…? తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..? లేదా..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=========================

Anushka-nishabdham-movie-నిశ్శబ్దం-మూవీ-fpc-zeecinemalu

నిశ్శబ్దం
నటీ నటులు : అనుష్క , మాధవన్ , అంజలి , సుబ్బరాజు , శాలిని పాండే తదితరులు
సంగీతం : గోపీసుందర్
నేపథ్య సంగీతం : గిరీష్ గోపాలకృష్ణ
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కోనా వెంకట్
నిర్మాత : TG విశ్వప్రసాద్
రచన -దర్శకత్వం : హేమంత్ మధుకర్
విడుదల తేది : 1 అక్టోబర్ 2020
మర్డర్ మిస్టరీస్ టాలీవుడ్ కి కొత్త కాదు. కానీ అనుష్క ‘నిశ్శబ్దం’ మాత్రం కాస్త డిఫెరెంట్. మరీ ముఖ్యంగా సినిమాలోని క్యారెక్టర్స్ ఒక్కొక్కటి దేనికదే ప్రత్యేకం అనిపిస్తుంది. సాక్షి పాత్రలో అనుష్క నటన సినిమాకే హైలైట్.

========================

sudigadu-zeecinemalu-allari-naresh

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics