ZeeCinemalu - May 22

Friday,May 21,2021 - 09:32 by Z_CLU

paper-boy-zeecinemalu

పేపర్ బాయ్
నటీనటులు : సంతోష్ శోభన్, రియా సోమన్
ఇతర నటీనటులు : తాన్యా హోప్, పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, సన్నీ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : భీమ్స్
డైరెక్టర్ : V. జయశంకర్
ప్రొడ్యూసర్ : సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ
రిలీజ్ డేట్ : 31 ఆగష్టు 2018
పేపర్ బాయ్ రవి, ధరణి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అయితే ఎప్పుడైతే వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలుస్తుందో అక్కడి నుండే సమస్య మొదలవుతుంది. మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన రవితో ధరణి పెళ్లి చేయడానికి ఆమె కుటుంబ సభ్యులు అంత ఈజీగా ఒప్పుకోరు.. అప్పుడు రవి, ధరణి ఏం చేస్తారు..? తమ ప్రేమని ఎలా గెలిపించుకుంటారు. అనేదే ఈ సినిమా ప్రధానా కథాంశం.

=======================

Komali-movie-kajal-jayam-ravi-కోమాలి-మూవీ

కోమాలి
రిలీజ్ డేట్ – 4 డిసెంబర్, 2020
నటీనటులు – జయం రవి, కాజల్ అగర్వాల్, యోగిబాబు
దర్శకుడు : ప్రదీప్ రంగనాథ్
సంగీత దర్శకుడు : హిప్ హాప్ తమిళ
సినిమాటోగ్రాఫర్ : రిచర్డ్ ఎం.నాథన్
నిర్మాత : ఐసరి కె.గణేష్
బ్యానర్ : అపోలో ప్రొడక్షన్స్
జయంరవి, కాజల్ హీరోహీరోయిన్లుగా నటించిన సూపర్ హిట్ మూవీ కోమాలి. 1999 డిసెంబర్ 31న యాక్సిడెంట్ కారణంగా కోమాలోకి వెళ్లిన రవి (జయం రవి) సరిగ్గా 16 ఏళ్ల తర్వాత కోమా నుంచి బయటకొస్తాడు. అప్పటికే ప్రపంచం మొత్తం మారిపోతుంది. ఈ సరికొత్త ప్రపంచంలో అతడు ఎలా నిలదొక్కుకున్నాడు? లోకల్ ఎమ్మెల్యే (కె.ఎస్.రవికుమార్) కారణంగా ఎదుర్కొన్న సమస్యలను ఎలా అధిగమించాడు అనేది క్లుప్తంగా “కోమాలి” కథాంశం. ఈ క్రమంలో రవికి కాజల్ ఎలా సహాయం చేసిందనేది స్టోరీ.
ఇందులో ‘జయం’ రవి, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించగా.. సంయుక్తా హెగ్డే కీలక పాత్రలో కనిపించింది. ఇక కమెడియన్ యోగిబాబు, హీరో జయం రవి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తాయి. ఎమ్మెల్యేగా దర్శకుడు కె.ఎస్. రవికుమార్ విలన్ పాత్రలో కనిపిస్తారు. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘హిప్ హాప్’ తమిజ్ సంగీతం అందించారు.

============================

solo-brathuke-so-better-movie-సోలో-బ్రతుకే-సో-బెటర్-fpc-zeecinemalu

సోలో బ్రతుకే సో బెటర్
నటీ నటులు : సాయితేజ్‌, న‌భా న‌టేశ్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్ , ఝాన్సీ, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
సంగీతం: త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: వెంక‌ట్ సి.దిలీప్‌
నిర్మాత‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
రచన – ద‌ర్శ‌క‌త్వం: సుబ్బు
విడుదల : జీ స్టూడియోస్
విడుదల తేది : 25 డిసెంబర్ 2020
తన స్టూడెంట్ లైఫ్ ను సోలో గా ఎంజాయ్ చేస్తూ పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటాడు విరాట్ (సాయి ధరం తేజ్). తన అనుభవంతో సింగిల్ గా ఎందుకు ఉండాలో 108 శ్లోకాలతో ఓ పుస్తకం రాసి తన కాలేజీలో ఉన్న సింగిల్స్ అందరికీ అందజేస్తాడు. విరాట్ రాసిన ఆ శ్లోకాలను అతని మాటలను సీరియస్ గా తీసుకొని పెళ్లికి దూరంగా ఉంటారు కొందరు సింగిల్స్.
సోలో బ్రతుకే సో బెటర్ అంటూ విరాట్ చెప్పిన మాటలను విని తన కాలేజిలో జూనియర్ అయిన అమృత(నభా నటేష్) కూడా సింగిల్ గా ఉండాలని నిర్ణయించుకొని పెళ్లికి దూరంగా ఉంటుంది. అయితే ఒకానొక టైంలో వేణు మావయ్య(రావు రమేష్) సోలో జీవితాన్ని చూసి అతని మాటలు విని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న విరాట్ అనుకోకుండా అమృత ప్రేమలో పడతాడు. చివరికి తన సిద్దాంతాన్ని పాటిస్తూ పెళ్ళికి దూరంగా ఉండాలనుకున్న అమృతను విరాట్ ఎలా పెళ్లి వైపుకి తీసుకొచ్చాడు అనేది మిగతా కథ.

======================

robo-2pointO-robo-2.O-zeecinemalu

2.O
నటీనటులు : రజనీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్
రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.శంకర్
విడుదల : 29 నవంబర్ 2018
450 వందల కోట్ల బడ్జెట్ … 3D టెక్నాలజీ , రోబో కి సీక్వెల్ , సూపర్ స్టార్ రజినీ కాంత్-శంకర్ కాంబో.. ఇవన్నీ కలిసి 2.Oను క్రేజీ ప్రాజెక్టుగా మార్చేశాయి. కథ విషయానికొస్తే.. నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. ఫోన్స్ ఎలా మాయమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి.. సరిగ్గా అప్పుడే డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి ఈ సమస్య ను ఎదుర్కోవాలంటే మనకి చిట్టి రోబో(రజినీ కాంత్) ఒక్కటే మార్గమని మళ్లీ చిట్టి కి ప్రాణం పోస్తాడు. సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నది పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌) అని తెలుసుకున్న ఆ శక్తి ని చిట్టి ఎలా ఎదురించింది ? అసలు పక్షి రాజా ఎవరు.. అతని కథేంటి.. సెల్ ఫోన్స్ వాడుతున్న వారిపై ఎందుకు ఎటాక్ చేస్తుంటాడు.. అనేది ‘2.O’.

==========================

nannu-evaru-aapaleru-movie-నన్ను-ఎవరూ-ఆపలేరు-fpc-zeecinemalu

నన్ను ఎవ్వరూ ఆపలేరు
నటీనటులు – జయం రవి, రాశిఖన్నా, సంపత్ రాజ్
రచన-దర్శకత్వం – కార్తీక్ తంగవేళ్
మ్యూజిక్ – శ్యామ్ సీఎస్
డీవోపీ – సత్యన్ సూర్యన్
ఎడిటర్ – రూబెన్
ఫైట్స్ – స్టంట్ శివ
జయం రవి నటించిన యాక్షన్ డ్రామా నన్ను ఎవ్వరూ ఆపలేరు. సిన్సియర్ పోలీసాఫీసర్ గా పేరుతెచ్చుకున్న హీరో అకారణంగా సస్పెండ్ అవుతాడు. దీంతో కొంతమంది పెద్దమనుషులతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలో తన ఆప్తుల్ని కోల్పోతాడు. అలా పగతో రగిలిపోతున్న హీరో, ప్రత్యర్థులపై ఎలా తన కక్షను తీర్చుకున్నాడనేది స్టోరీ.

=========================

Rangam-2-movie-రంగం-2-fpc-zeecinemalu

రంగం-2
నటీనటులు – జీవా, తులసి నాయర్
దర్శకత్వంల – రవి కే చంద్రన్
నిర్మాత – ఏఎన్ బాలాజీ
సంగీతం – హరీష్ జయరాజ్
రిలీజ్ డేట్ – నవంబర్ 25, 2016
తండ్రి లేని హీరో అల్లరిచిల్లరిగా తిరుగుతూ బామ్మతో కలిసి ముంబయిలో ఉంటాడు. సిటీలో హీరోయిన్ తో పరిచయం అవుతుంది. అదే టైమ్ లో లోకల్ గ్యాంగ్ స్టర్ పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ అవుతాడు. హీరోయిన్ తండ్రిని ఒప్పించేందుకు జాబ్ చేయడానికి అంగీకరిస్తాడు హీరో. ఉద్యోగం కోసం ఓ అరబ్ దేశానికి వెళ్తాడు. అక్కడ తనకు తెలియకుండానే ఓ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటాడు. ఆ కేసు నుంచి హీరో ఎలా బయటపడ్డాడనేది రంగం-2 స్టోరీ.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics