జీ సినిమాలు - మే 1

Thursday,April 30,2020 - 09:09 by Z_CLU

హలో
నటీనటులు : అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్
ఇతర నటీనటులు : జగపతి బాబు, రమ్యకృష్ణ, అజయ్, సత్య కృష్ణన్, అనీష్ కురువిల్ల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్
డైరెక్టర్ : విక్రమ్ కుమార్
ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని
రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017
చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీను, జున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరు? అవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

============================

పిల్ల జమీందార్
నటీనటులు : నాని, హరిప్రియ, బిందు మాధవి
ఇతర నటీనటులు : శ్రీనివాస్ అవసరాల, M.S.నారాయణ, రావు రమేష్, శివ ప్రసాద్, తాగుబోతు రమేష్, ధనరాజ్, వెన్నెల కిశోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సెల్వ గణేష్
డైరెక్టర్ : G. అశోక్
ప్రొడ్యూసర్ : D.S. రావు
రిలీజ్ డేట్ : 29 సెప్టెంబర్ 2011
న్యాచురల్ స్టార్ నాని తన కరియర్ లో చాలా ఇష్టపడి చేసిన సినిమా పిల్ల జమీందార్. పుట్టుకతో కోటీశ్వరుడైన యువకుడు జీవితం విలువ ఎలా తెలుసుకున్నాడు..? అనే సున్నితమైన కథాంశంతో, పర్ ఫెక్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది పిల్ల జమీందార్. అష్టా చెమ్మా తరవాత నాని, అవసరాల కలిసి చేసిన సినిమా ఇదే.

=================================

ఒకటో నంబర్ కుర్రాడు
నటీనటులు : తారకరత్న, రేఖ
ఇతర నటీనటులు : గిరిబాబు, సునీల్, తనికెళ్ల భరణి, రాజీవ్ కనకాల, ఎమ్మెస్ నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : కీరవాణి
డైరెక్టర్ : కోదండరామిరెడ్డి
ప్రొడ్యూసర్ : అశ్వనీదత్, కె.రాఘవేంద్రరావు
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 18, 2002
తారకరత్న, రేఖ నటించిన హిట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు. తారకరత్న ను హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. కోదండ రామిరెడ్డి డైరక్ట్ చేసిన ఈ సినిమాకు రాఘవేంద్రరావు కథ అందించడం విశేషం. స్వప్న సినిమాస్ బ్యానర్ పై అశ్వనీదత్ ఈ సినిమాను సమర్పించగా.. రాఘవేంద్రరావు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం సూపర్ హిట్టయింది. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అక్కడక్కడ వినిపిస్తుంటాయి.

==================================

చల్ మోహన్ రంగ
నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్
ఇతర నటీనటులు : మధునందన్, రావు రమేష్, నరేష్, లిస్సి, సంజయ్ స్వరూప్, ప్రగతి మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : కృష్ణ చైతన్య
ప్రొడ్యూసర్ : సుధాకర్ రెడ్డి
రిలీజ్ డేట్ : 5 ఏప్రిల్ 2018
చిన్నతనం నుండి పెద్దగా చదువు అబ్బకపోవడంతో ఎప్పటి కైనా అమెరికా వెళ్లి అక్కడే సెటిల్ అవ్వలనుకుంటాడు మోహన్ రంగ(నితిన్). ఎన్నిసార్లు ట్రై చేసినా వీసా రాకపోవడంతో ఓ ప్లాన్ వేసి యు.ఎస్ వెళ్తాడు. అలా వెళ్ళిన మోహన్ రంగ విలాస్(మధు నందన్) సహయంతో అక్కడ ఓ ఉద్యోగం సంపాదిస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పరిచయమైన మేఘా సుబ్రహ్మణ్యం(మేఘ ఆకాశ్) తో ప్రేమలో పడతాడు. మోహన్ రంగ క్యారెక్టర్ కి కనెక్ట్ అవ్వడంతో మేఘ కూడా ప్రేమలో పడిపోతుంది. ఒకరికి తెలియకుండా మరొకరు ప్రేమించుకుంటారు. అలా ఒకరినొకరు ఇష్టపడుతూ చెప్పుకునేలోపే ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. అలా అనుకోకుండా దూరమయిన వీళ్ళిద్దరూ ఏడాది తర్వాత మళ్ళీ ఊటీలో కలుసుకుంటారు. ఇంతకీ మోహన్ రంగ-మేఘ వీరి మధ్య జరిగిన సంఘటనలు ఏమిటి ..? చివరికి వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు… అనేది మిగతా కథ.

=============================

అరవింద సమేత
నటీనటులు : N.T. రామారావు, పూజా హెగ్డే
ఇతర నటీనటులు : ఈషా రెబ్బ, సునీల్, జగపతి బాబు, నవీన్ చంద్ర, సుప్రియా పాఠక్, నాగబాబు, రావు రమేష్, నరేష్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
డైరెక్టర్ : త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 11 అక్టోబర్ 2018
కొమ్మద్ది గ్రామానికి చెందిన నారపరెడ్డి(నాగబాబు), నల్లగుడికి చెందిన బసిరెడ్డి(జగపతిబాబు)కి కొన్నేళ్ళుగా ఫ్యాక్షన్ గొడవలు. ఈ క్రమంలో నారపరెడ్డిని చంపడానికి బసిరెడ్డి ఓ అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. అదే సమయంలో లండన్ నుండి వచ్చిన వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్)ని స్టేషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు అదే అవకాశంగా భావించి నారపరెడ్డిని హతమారుస్తాడు బసిరెడ్డి. కళ్ళ ముందే తండ్రి ప్రత్యర్దుల చేతిలో చనిపోవడంతో బసిరెడ్డిపై కత్తి దూస్తాడు వీర రాఘవ.. అక్కడి నుండి మళ్ళీ గొడవలు మొదలవుతాయి.
అయితే తన కొడుకు చావుతో గొడవలు ఆపేయమని వీర రాఘవుణ్ణి కోరుతుంది నానమ్మ సుగుణ(సుప్రియ పాఠక్)… అలా నానమ్మ మాటకి కట్టుబడి గొడవలు ఆపేయాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ వెళ్ళిపోయిన రాఘవ.. నీలంబరి(సునీల్) గ్యారేజ్ లో ఆశ్రయం పొందుతాడు. ఆ సమయంలోనే క్రిమినల్ లాయర్(నరేష్)కూతురు అరవింద(పూజా హెగ్డే)పరిచయం ప్రేమగా మారుతుంది.
ఇక చావు నుండి బ్రతికి బయటపడ్డ బసిరెడ్డి తన కొడుకు బాల్ రెడ్డి(నవీన్ చంద్ర) ద్వారా శత్రువు వీరరాఘవ రెడ్డి కోసం వెతుకుతూనే ఉంటాడు. ఈ క్రమంలో రాఘవ హైదరాబాద్ లో ఉన్నాడని పసిగట్టి చంపడానికి చూస్తుంటాడు బసి రెడ్డి. ఈ క్రమంలో వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలను ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసాడు.. చివరికి పగతో రగిలిపోతూ క్రూరంగా తయారైన బసిరెడ్డిని వీరరాఘవ మార్చగలిగాడా.. లేదా… అనేది సినిమా కథ.

=================================

ఆజాద్
నటీనటులు: నాగార్జున, సౌందర్య, శిల్పాషెట్టి, రఘువరన్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం తదితరులు
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: వైజయంతీ మూవీస్
నిర్మాత: అశ్వనీదత్
దర్శకుడు: తిరుపతి స్వామి
రిలీజ్ డేట్ : సెప్టెంబర్ 29, 2000
తిరుపతి స్వామి దర్శకత్వంలో నాగార్జున చేసిన సినిమా ఆజాద్. దేశభక్తి కాన్సెప్ట్ కు ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ యాడ్ చేసి తెరకెక్కించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఇక సౌందర్య నటన, శిల్పాషెట్టి అందాలు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్. ఈ సినిమాకు తిరుపతి స్వామితో పాటు యండమూరి వీరేంద్రనాథ్, భూపతిరాజా, క్రేజీ మోహన్ లాంటి ప్రముఖులు స్క్రీన్ ప్లే అందించారు.