జీ సినిమాలు - మే 19

Monday,May 18,2020 - 08:02 by Z_CLU

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా
నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, హేబా పటేల్, అవిక గోర్
ఇతర నటీనటులు : నందితా శ్వేత, వెన్నెల కిషోర్, అన్నపూర్ణ, సత్య, సుదర్శన్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర
డైరెక్టర్ : వి. ఐ. ఆనంద్
ప్రొడ్యూసర్ : P.V. రావు
రిలీజ్ డేట్ : 18 నవంబర్ 2016
ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయిన అర్జున్(నిఖిల్) తన స్నేహితుడి అన్నయ్య కు దెయ్యం వదిలించడానికి అనుకోకుండా ఆత్మలను వదిలించే కేరళ లోని మహిశాసుర మర్దిని గుడికి వెళ్లాల్సి వస్తుంది. అలా కిషోర్(వెన్నెల కిషోర్) తో కేరళ వెళ్లిన అర్జున్ కి అమల(హెబ్బా పటేల్) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. అలా పరిచయమైన అమల తన యాటిట్యూడ్ తో అర్జున్ కు దగ్గరవుతుంది. ఇంతకీ అమల అక్కడికి ఎందుకొచ్చింది? అర్జున్ కి కావాలనే ఎందుకు దగ్గరైంది? అసలు అమల ఎవరు? కేరళ వెళ్లిన అర్జున్ హైదరాబాద్ తిరిగొచ్చాక అమల గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది చిత్ర కధాంశం.

================================

అదిరిందయ్యా చంద్రం
నటీనటులు – శివాజీ, లయ
ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్
మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ – శ్రీనివాసరెడ్డి
రిలీజ్ డేట్ – 2005, ఆగస్ట్ 20
శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం. శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

===========================

పూజ
నటీనటులు : విశాల్, శృతి హాసన్
ఇతర నటీనటులు : సత్య రాజ్, రాధికా శరత్ కుమార్, ముకేశ్ తివారి, సూరి, జయ ప్రకాష్, తదిరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : హరి
ప్రొడ్యూసర్ : విశాల్
రిలీజ్ డేట్ : 22 అక్టోబర్ 2014
విశాల్, శృతి హాసన్ జంటగా మాస్ సినిమా దర్శకుడు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘పూజ’. ప్రతీ సినిమాలో మాస్ క్యారెక్టర్స్ తో ఎంటర్టైన్ చేసే విశాల్ అలాంటి మాస్ క్యారెక్టర్ లో నటించిన ఈ సినిమా లో యాక్షన్ సీన్స్, శృతి హాసన్ గ్లామర్, కామెడీ సీన్స్ , సాంగ్స్ హైలైట్స్ .

==============================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012
అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

======================================

రోబో 2.O
నటీ నటులు : రజిని కాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ తదితరులు
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
సినిమాటోగ్రఫీ : నిరవ్ షా
ఎడిటింగ్ : ఆంటోనీ
నిర్మాణం : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత : సుభాస్కరన్
రచన-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : ఎస్.శంకర్
విడుదల : 29 నవంబర్ 2018
నగరంలో హఠాత్తుగా సెల్‌ఫోన్లు మాయమవుతుంటాయి. మనుషులు మాట్లాడుతుంటే వారి చేతుల్లోంచి ఫోన్లు ఎగిరిపోతుంటాయి. అయితే ఇంతకీ ఫోన్స్ ఎలా మాయమవుతున్నాయి… ప్రభుత్వ అధికారులకు కూడా ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి.. ఈ పరిణామాలకు కారణమేంటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతారు. సరిగ్గా అప్పుడే డా.వసీకరణ్‌ (రజనీకాంత్‌) రంగంలోకి దిగి ఈ సమస్య ను ఎదుర్కోవాలంటే మనకి చిట్టి రోబో(రజినీ కాంత్) ఒక్కటే మార్గమని మళ్లీ చిట్టి కి ప్రాణం పోస్తాడు. సెల్‌ఫోన్లు మాయంచేస్తూ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నది పక్షిరాజా (అక్షయ్‌ కుమార్‌) అని తెలుసుకున్న ఆ శక్తి ని ఎలా ఎదురించింది ? అసలు పక్షి రాజా ఎవరు.. అతని కథేంటి.. సెల్ ఫోన్స్ వాడుతున్న వారిపై ఎందుకు ఎటాక్ చేస్తుంటాడు.. అనేది ‘2.O’ అసలు కథ

===================================

లింగ
నటీనటులు : రజినీకాంత్, అనుష్క శెట్టి, సోనాక్షి సిన్హా
ఇతర నటీనటులు : జగపతి బాబు, K. విశ్వనాథ్, N. సంతానం, కరుణాకరన్, దేవ్ గిల్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహ్మాన్
డైరెక్టర్ : K.S. రవి కుమార్
ప్రొడ్యూసర్ : రాక్ లైన్ వెంకటేష్
రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2014
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన డైరెక్ట్ సినిమా ‘లింగ’. రెండు డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్ ఓ ఉండే ఈ సినిమాలో రజినీకాంత్ డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించాడు.