జీ సినిమాలు - మే 11

Sunday,May 10,2020 - 08:10 by Z_CLU

లీడర్
నటీనటులు : రానా దగ్గుబాటి, ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : తనికెళ్ళ భరణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుహాసినీ మణిరత్నం, సుబ్బరాజు
మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ.జే.మేయర్
డైరెక్టర్ : శేఖర్ కమ్ముల
ప్రొడ్యూసర్ : M. శరవణన్, M.S. గుహన్
రిలీజ్ డేట్ : 19 ఫిబ్రవరి 2010
రానా దగ్గుబాటి ఈ సినిమాతోనే టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అయ్యాడు. న్యూ ఏజ్ పొలిటికల్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రిగా నటించాడు. తన తండ్రి మరణం తరవాత పదవీ పగ్గాలు చేతిలోకి తీసుకున్న ఈ యంగ్ పాలిటీషియన్ వ్యవస్థలో ఉన్న లొపాలను సరిదిద్దగలిగాడా…? ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాడా..? అన్నదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.

=================================

బొబ్బిలి రాజా
హీరో హీరోయిన్లు – వెంకటేశ్, దివ్యభారతి
ఇతర నటీనటులు – వాణిశ్రీ, సత్యనారాయణ, కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబుమోహన్, గుమ్మడి
సంగీత దర్శకుడు – ఇళయరాజా
దర్శకుడు – బి.గోపాల్
విడుదల తేదీ – 1990
ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్ కలగలిసిన ఓ మంచి కథకు, అదిరిపోయే సంగీతం యాడ్ అయితే ఎలా ఉంటుందో అదే బొబ్బిలి రాజా సినిమా. బి.గోపాల్,వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా వెంకీ కెరీర్ లో ఓ తిరుగులేని బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. అటు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ కు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టిన మూవీస్ లో ఇది కూడా ఒకటి. అయ్యో..అయ్యో..అయ్యయ్యో అనే సూపర్ హిట్ డైలాగ్ ఈ సినిమాలోనిదే. రీసెంట్ గా బాబు బంగారం సినిమాలో కూడా వెంకీ ఇదే డైలాగ్ ఉపయోగించారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన సంగీతంతో ఇళయరాజా ఈ సినిమాను మరో రేంజ్ కు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఈ సినిమాలో పాటలు అంతే ఫ్రెష్ గా ఉంటాయి. వెంకటేశ్ కెరీర్ లోనే మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమాగా పేరుతెచ్చుకున్న బొబ్బిలిరాజా, 3 సెంటర్లలో 175 రోజులు ఆడింది. తర్వాత ఇదే మూవీ తమిళ్ లో వాలిబన్, హిందీలో రామ్ పూర్ కా రాజా పేరుతో విడుదలై… అక్కడ కూడా విజయం సాధించడం కొసమెరుపు.

============================


నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్
ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017
బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

-================================

కథానాయకుడు
నటీనటులు : రజినీ కాంత్, జగపతి బాబు, మీనా, నయన తార
ఇతర నటీనటులు : మమత మోహన్ దాస్, ప్రభు, విజయ్ కుమార్, బ్రహ్మానందం, ఆలీ, సునీల్, M.S.నారాయణ
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : P.వాసు
ప్రొడ్యూసర్ : C. అశ్విని దత్
రిలీజ్ డేట్ : 1 ఆగష్టు 2008
ఒక ఇమోషనల్ కథాంశంతో తెరకెక్కిందే కథానాయకుడు సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఫ్రెండ్ గా నటించాడు జగపతి బాబు ఈ సినిమాలో. ఒక పెద్ద స్టార్ కి, ఒక మధ్య తరగతి సాధారణ వ్యక్తికి మధ్య ఉండే స్నేహానికి ప్రతిబింబమే ఈ కథా నాయకుడు. ఈ సినిమాకి P. వాసు డైరెక్టర్.

============================

మిరపకాయ్
నటీనటులు : రవితేజ, రిచా గంగోపాధ్యాయ
ఇతర నటీనటులు : సునీల్, దీక్షా సేథ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, నాగబాబు, స్వాతి రెడ్డి, సంజయ్ స్వరూప్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : హరీష్ శంకర్
ప్రొడ్యూసర్ : రమేష్ పుప్పల
రిలీజ్ డేట్ : 12 జనవరి 2011

రవితేజ ఇంటలిజెన్స్ బ్యూరో ఇన్స్ పెక్టర్ గా నటించిన అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిరపకాయ్. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దీక్షా సేథ్ కూడా సెకండ్ హీరోయిన్ గా నటించింది. హరీష్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, యాక్షన్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.

=============================

మగమహారాజు
నటీనటులు : విశాల్, హన్సిక
ఇతర నటీనటులు : ప్రభు, సంతానం, సతీష్, వైభవ్ రెడ్డి, రమ్య కృష్ణన్, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్, మధురిమ, మాధవీ లత తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా
డైరెక్టర్ : సుందర్ C.
ప్రొడ్యూసర్ : ఖుష్బూ సుందర్
రిలీజ్ డేట్ : 14 జనవరి 2015
విశాల్, హన్సిక నటించిన లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మగమహారాజు. ఊటీలో పొలిటీషియన్స్ ని ఒక చోట చేరుస్తూ, బిజినెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకునే యువకుడి జీవితంలో ఒక అనూహ్య సంఘటన జరుగుతుంది. అదేమిటీ..? ఆ ప్రాబ్లం నుండి ఆ యువకుడు ఎలా బయటపడ్డాడు అనే కథాంశంతో తెరకెక్కిందే మగ మహారాజు. ఈ సినిమాలో ప్రభు నటన సినిమాకే హైలెట్.