ZeeCinemalu - March 4

Thursday,March 04,2021 - 10:23 by Z_CLU

మోహిని
నటీనటులు : త్రిష, జాకీ భజ్ఞాని
ఇతర నటీనటులు : ముకేష్ తివారీ, పూర్ణిమ భాగ్యరాజ్, యోగి బాబు, జాంగిరి మధుమిత, జ్ఞానేశ్వర్, స్వామినాథన్ మరియు తదితరలు
మ్యూజిక్ డైరెక్టర్ : వివేక్ – మెర్విన్
డైరెక్టర్ : రమణ మాదేశ్
ప్రొడ్యూసర్ : S. లక్ష్మణ్ కుమార్
రిలీజ్ డేట్ : 27 జూలై 2018
ఇండియాలో పాపులర్ చెఫ్ వైష్ణవి (త్రిష). ఆమెకు లండన్ నుంచి ఊహించని ఆఫర్ వస్తుంది. అక్కడకు తన టీమ్ తో పాటు వెళ్తుంది వైష్ణవి. అక్కడే సందీప్ (జాకీ భగ్నానీ) ను కలుస్తుంది. తొలిచూపులోనే ఇద్దరూ ప్రేమించుకుంటారు. తన ప్రేమ విషయాన్ని తల్లికి (పూర్ణిమ) కూడా చెప్పేస్తుంది వైష్ణవి. ఇక్కడ వరకు అంతా ప్రశాంతం.
సడెన్ గా తన బాయ్ ఫ్రెండ్ సందీప్, టీమ్ తో కలిసి బోటు షికారుకు వెళ్తుంది వైష్ణవి. అక్కడే ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ ఘటన కారణంగా సముద్ర గర్భంలో ఓ శంఖంలో కొన్నేళ్లుగా ఉన్న మోహిని (త్రిష) ఆత్మ బయటకు వస్తుంది. బయటకొచ్చి తనలా ఉన్న వైష్ణవిని చూసి ఆమెలో ప్రవేశిస్తుంది.
గతంలో తనకు అన్యాయం చేసిన వ్యక్తులపై వైష్ణవి రూపంలో ఉన్న మోహిని ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఇందులో భాగంగా తనను చంపిన గుంపులో సందీప్ కూడా ఉన్నాడనే చేదు నిజం తెలుసుకుంటుంది. వైష్ణవిలోకి మోహిని ప్రవేశించిందనే విషయాన్ని సందీప్ తో పాటు విలన్లు గుర్తిస్తారు. మరో క్షుద్ర మాంత్రికుడితో కలిసి మోహినిని బంధించాలని, అవసరమైతే వైష్ణవిని చంపేయాలని చూస్తారు. ఫైనల్ గా విలన్లను మోహిని ఏం చేసింది.. విలన్ల బారి నుంచి వైష్ణవిని మోహిని ఎలా కాపాడింది అనేది ఈ సినిమా స్టోరీ.

=======================

బలుపు
నటీ నటులు : రవితేజ, శృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్ : 28 జూన్ 2013
రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

==========================

పెంగ్విన్
న‌టీటులు: కీర్తి సురేష్‌‌, లింగా, మదంప‌ట్టి రంగ‌రాజ్, మాస్ట‌ర్ అద్వైత్‌, నిత్య త‌దిత‌రులు
నిర్మాత‌: కార్తీక్ సుబ్బ‌రాజ్, కార్తికేయ‌న్ సంతానం, సుధ‌న్ సుంద‌రం, జ‌య‌రాం
ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: ఈశ్వ‌ర్ కార్తీక్‌
సంగీతం: సంతోష్‌ నారాయణ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: కార్తీక్ ప‌ళ‌ని
బ్యాన‌ర్‌: స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌, ఫ్యాష‌న్ స్టూడియోస్‌
విడుద‌ల‌: జూన్ 19 (OTT)
రిథమ్‌‌ (కీర్తి సురేష్‌‌), ర‌ఘు (లింగ‌)ల ఒక్క‌గానొక్క కొడుకు అజ‌య్‌. అజ‌య్ అంటే రిథ‌మ్‌కు పంచ‌ప్రాణాలు. ఓ రోజు అజ‌య్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అత‌డి కోసం త‌ల్లిదండ్రులిద్ద‌రూ అడ‌విలో అంగుళం అంగుళం జ‌ల్లెడ ప‌ట్టిన‌ప్ప‌టికీ అజ‌య్ జాడ దొర‌క‌దు. అజ‌య్ దుస్తులు క‌నిపించ‌గానే అత‌డు చ‌నిపోయాడ‌ని అంద‌రూ భావిస్తారు.. రిథ‌మ్ మాత్రం నమ్మదు. అదే స‌మ‌యంలో అజ‌య్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథ‌మ్ నుంచి ర‌ఘు విడాకులు తీసుకుంటాడు. అయిన్ప‌టికీ ఆమె త‌న అన్వేష‌ణ మాన‌దు.
ఈ క్ర‌మంలో ఆమె గౌతమ్‌‌(రంగ‌రాజ్‌)ను వివాహం చేసుకుని గ‌ర్భం దాల్చుతుంది. అయితే ఓరోజు స‌డ‌న్‌గా రిథ‌మ్‌కు అజ‌య్ క‌నిపిస్తాడు. ఇన్ని రోజులు అజ‌య్ ఏమైపోయాడు? అత‌నితో పాటు అప‌హ‌ర‌ణ‌కు గురైన ఆరుగురు పిల్ల‌లు బ‌తికే ఉన్నారా? అస‌లు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధ‌రించిన‌ సీరియ‌ల్ కిల్ల‌ర్ ఎవ‌రు? గ‌ర్భంతో ఉన్న కీర్తి అత‌డిని ఎలా ఎదుర్కొంది? అన్న విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

=======================

హైపర్
నటీనటులు : రామ్ పోతినేని, రాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్, నరేష్, రావు రమేష్, తులసి శివమణి, ప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016
వైజాగ్ లో ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

========================

నేను లోకల్
నటీనటులు : నాని, కీర్తి సురేష్
ఇతర నటీనటులు : నవీన్ చంద్ర, సచిన్ ఖేడేకర్, తులసి, రామ్ ప్రసాద్, రావు రమేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : త్రినాథ రావు నక్కిన
ప్రొడ్యూసర్ : దిల్ రాజు
రిలీజ్ డేట్ : 3 ఫిబ్రవరి 2017
బాబు (నాని) అనే కుర్రాడు తన పేరెంట్స్ కోసం ఎట్టకేలకు దొంగదారిలో తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తాడు. అలా గ్రాడ్యుయేట్ అయిపోయి ఖాళీగా ఉన్న బాబు… ఒకానొక సందర్భంలో కీర్తి(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. అలా ప్రేమలో పడిన బాబు తన నెక్స్ట్ పనులన్నింటినీ పక్కన పెడతాడు. కీర్తిపైనే పూర్తి ఫోకస్ పెట్టి ఆమె చదివే ఎంబీఏ కాలేజ్ లోనే జాయిన్ అయి.. ఎట్టకేలకి కీర్తిని తన ప్రేమలో పడేస్తాడు. బాబుకు కీర్తినిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేని కీర్తి తండ్రి(సచిన్ ఖేడేకర్) సబ్ ఇనస్పెక్టర్ సిద్దార్థ్ వర్మ(నవీన్ చంద్ర)తో కీర్తి పెళ్లి నిశ్చయిస్తాడు. చివరికి బాబు తన లోకల్ తెలివితేటలతో సిద్దార్థ్ వర్మని సైడ్ చేసి.. కీర్తి తండ్రిని ఎలా ఒప్పించాడు….తన ప్రేమని ఎలా దక్కించుకున్నాడనేది మిగతా కథ.

=========================

36 వయసులో
నటీనటులు: జ్యోతిక, రెహమాన్ తదితరులు
దర్శకత్వం: రోషన్ ఆండ్రూస్
సంగీతం: సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: ఆర్.దివాకరన్
నిర్మాత: సూర్య
బ్యానర్: 2డి ఎంటర్ టైన్మెంట్
రిలీజ్ డేట్: 24 జులై, 2020
వాసంతి (జ్యోతిక) రెవెన్యూ కార్యాలయంలో అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌. భర్త రాంప్రసాద్‌ (రహమాన్‌), 13 ఏళ్ల కూతురు మృదుల సంతోషమే తన సంతోషంగా కాలం వెల్లదీస్తుంది. ఐర్లాండ్‌లో ఉద్యోగం చేయాలన్న భర్త ఆశలు, అక్కడే చదవాలన్న కూతురు కలల్ని నెరవేర్చేందుకు తానూ ప్రయత్నిస్తుంది. ఐర్లాండ్‌లో కుటుంబం మనుగడ సాధించాలంటే భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తే తప్ప సాధ్యం కాదు. అయితే 36 ఏళ్ల వాసంతికి ఉద్యోగం రాదు. వరుస ఘటనలతో కుంగిపోయిన వాసంతి.. ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఎలా సక్సెస్‌ సాధించింది అన్నదే 36-వయసులో సినిమా కథ.