జీ సినిమాలు (మార్చి 31)

Monday,March 30,2020 - 09:02 by Z_CLU

హ్యాపీ వెడ్డింగ్
నటీనటులు : సుమంత్ అశ్విన్, నిహారిక
ఇతర నటీనటులు : మురళీ శర్మ, నరేష్, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, పూజిత పున్నాడ మరియు
తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శశికాంత్ కార్తిక్, తమన్
డైరెక్టర్ : లక్ష్మణ్ కార్య
ప్రొడ్యూసర్: M. సుమంత్ రాజు
రిలీజ్ డేట్ : జూలై 28, 2018

విజయవాడ కుర్రాడు ఆనంద్(సుమంత్ అశ్విన్), హైదరాబాద్ అమ్మాయి అక్షర(నీహారిక) ప్రేమించుకుంటారు. ఇరువురి కుటుంబ పెద్దలు వీరికి పెళ్లి ఖాయం చేసి ఏర్పాట్లు మొదలుపెడతారు. ఇంతలో గతంలో అక్షర ప్రేమికుడు విజయ్(రాజా) తిరిగి వస్తాడు. గతంలో ఇద్దరు కలిసి చేసిన బొటీక్ బిజినెస్ పేరుతో తనకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు విజయ్. జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కన్ఫ్యూజ్ అయ్యే అక్షర.. పెళ్లి దాకా వచ్చి ప్రేమ విషయంలో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది.

ఈ క్రమంలో ఆనంద్ కి కూడా బ్రేకప్ చెప్పేస్తుంది. ఆనంద్ మాత్రం అక్షరను విడిచిపెట్టడానికి ఇష్టపడడు. అక్షరలో మార్పు కోసం ఓపిగ్గా ఎదురుచూస్తుంటాడు. చివరికి అక్షర పెళ్లి ఆనంద్ తోనే జరిగిందా.. లేదా మాజీ ప్రేమికుడు విజయ్ తో జరిగిందా ? అనేది బ్యాలెన్స్ స్టోరీ.

========================

తడాఖా
నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా
ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ
మరితు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్
రిలీజ్ డేట్ : 10th మే 2013

నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=============================

శ్రీమంతుడు
నటీనటులు : మహేష్ బాబు, శృతి హాసన్
ఇతర నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, సుకన్య, సితార, ముకేష్ రిషి, సంపత్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్
డైరెక్టర్ : కొరటాల శివ
ప్రొడ్యూసర్ : Y. నవీన్, Y. రవి శంకర్, C.V. మోహన్
రిలీజ్ డేట్ : 7 ఆగష్టు 2015

కొరటాల మార్క్ కమర్షియల్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ‘శ్రీమంతుడు’. రూరల్ డెవెలప్ మెంట్ కోర్స్ నేర్చుకునే ప్రాసెస్ లో చారుశీలకు దగ్గరైన హర్ష, ఒక రిమోట్ విలేజ్ ని దత్తత తీసుకుంటాడు. ఆ ఊరిని డెవెలప్ చేసే ప్రాసెస్ లో ఉన్న అడ్డంకులను ఫేస్ చేస్తూనే, ఎలాగైనా ఆ ఊరికి అండగా నిలవలనుకునే హర్షకి, తన తండ్రిది కూడా అదే ఊరని తెలుసుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..? తన తండ్రిని మళ్ళీ ఆ ఊరికి ఎలా దగ్గర చేశాడు..? అనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================

సుడిగాడు
నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్
ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్,
చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి
రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్, బ్రహ్మానందం కాంబినేషన్ లోని
కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

=================================

జర్సీ
నటీనటులు: నాని, శ్రద్ధ శ్రీనాధ్, సత్యరాజ్, రోనిత్ కమ్ర, రావు రమేష్
సంగీతం: అనిరుద్
కెమెరా: సాను జాన్
నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
కధ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
రిలీజ్ డేట్: ఏప్రిల్ 19, 2019

అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు.

అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది తెలియాలంటే మోస్ట్ ఎమోషనల్ మూవీ జెర్సీ చూడాల్సిందే.

=========================

బెండు అప్పారావు
నటీనటులు : అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ
ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్, మేఘన రాజ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, L.B. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009

R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.