జీ సినిమాలు - జూన్ 5

Thursday,June 04,2020 - 08:02 by Z_CLU

అదిరిందయ్యా చంద్రం
నటీనటులు – శివాజీ, లయ
ఇతర నటీనటులు – సంగీత, మధుశర్మ, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్, ఏవీఎస్
మ్యూజిక్ డైరెక్టర్ – ఎం.ఎం.శ్రీలేఖ
డైరెక్టర్ – శ్రీనివాసరెడ్డి
రిలీజ్ డేట్ – 2005, ఆగస్ట్ 20
శివాజీ, లయ కలిసి నటించిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అదిరిందయ్యా చంద్రం. శివాజీ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుంది. శివాజీలో అదిరిపోయే కామెడీ టైమింగ్ ఉందని మరోసారి నిరూపించింది ఈ సినిమా.

================================

పంచాక్షరి
నటీనటులు : అనుష్క శెట్టి, చంద్ర మోహన్
ఇతర నటీనటులు : నాజర్, ప్రదీప్ రావత్, రవి ప్రకాష్, బ్రహ్మానందం, దివ్యవాణి, తెలంగాణ శకుంతల మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : చిన్నా
డైరెక్టర్ : V. సముద్ర
ప్రొడ్యూసర్ : బొమ్మదేవర రామ చంద్రరావు
రిలీజ్ డేట్ : 11 జూన్ 2010
హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ పంచాక్షరి. దుర్గామాత గుడిలో పుట్టిన పంచాక్షరిని ఊళ్లూ వాళ్ళు దుర్గాదేవిలా ట్రీట్ చేస్తుంటారు. కానీ ఒక మహా పర్వదినాన పంచాక్షరి గుడిలో నిప్పుకు ఆహుతై పోతుంది. దాంతో దుర్గమ్మ వారే పంచాక్షరి ప్రాణాలు ఆహుతి చేశారు అనే భ్రమలో ఉంటారు ఊరి జనం. కానీ నిజం తరవాత బయటికి వస్తుంది, నిజానికి పంచాక్షరిని చంపింది ఎవరు..? ఆ తరవాత ఏం జరిగింది అనేదే ప్రధాన కథాంశం.

==============================

బెండు అప్పారావు
నటీనటులు : అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ
ఇతర నటీనటులు : కృష్ణ భగవాన్, మేఘన రాజ్, ఆహుతి ప్రసాద్, రఘుబాబు, L.B. శ్రీరామ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : కోటి
డైరెక్టర్ : E.V.V. సత్యనారాయణ
ప్రొడ్యూసర్ : D. రామానాయుడు
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2009
R.M.P. గా పని చేస్తుంటాడు బెండు అప్పారావు. నిజానికి తనకు వైద్యం చేసే పద్ధతి తెలీకపోయినా, చిన్నా చితకా ట్రిక్స్ వాడి ఊరి జనానికి వైద్యం చేస్తుంటాడు. దానికి తోడు తన అక్క కాపురాన్ని ఎలాగైనా నిలబెట్టాలని తాపత్రయపడుతుంటాడు. బెండు అప్పారావు బావ, ఎప్పుడు చూసినా తన అక్కని కట్నం కోసం వేదిస్తూనే ఉంటాడు. అంతలో ఊరిలో జరిగిన ఒక సంఘటన అప్పారావు జీవితాన్ని ఇంకో మలుపు తిప్పుతుంది. ఏంటది..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=================================

బలుపు
నటీ నటులు : రవితేజ, శృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, ఆషుతోష్ రాణా, అడివి శేష్, సన, బ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్ : 28 జూన్ 2013
రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజ, సిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..? వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

=================================

శైలజారెడ్డి అల్లుడు
నటీనటులు : నాగ చైతన్య, అనూ ఇమ్మాన్యువెల్
ఇతర నటీనటులు : రమ్య కృష్ణన్, నరేష్, మురళీ శర్మ, కళ్యాణి నటరాజన్, వెన్నెల కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : గోపీ సుందర్
డైరెక్టర్ : మారుతి దాసరి
ప్రొడ్యూసర్ : S. రాధాకృష్ణ
రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 2018
ఈగోకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పెద్ద వ్యాపారవేత్త (మురళి శర్మ) ఏకైక కొడుకు చైతు(నాగచైతన్య). తన తండ్రిలా కాకుండా కాస్త సహనం, ఓపికతో జీవితాన్ని కూల్ గా గడుపుతుంటాడు. ఓ సందర్భంలో చైతూకి ఈగో కు మారుపేరైన అను(అను ఇమ్మానియేల్) పరిచయమవుతుంది. ఆ పరిచయం వారిద్దరి మధ్య ప్రేమగా మారుతుంది. అలా తండ్రి , ప్రియురాలి ఈగోల మధ్య నలిగిపోయే చైతూ జీవితంలోకి అనుకోకుండా పౌరుషంతో గల ఈగో ఉన్న మరో వ్యక్తి వస్తుంది.. ఆవిడే శైలజా రెడ్డి(రమ్యకృష్ణ).
తన ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడం కోసం స్నేహితుడు చారి(వెన్నెల కిషోర్)తో కలిసి అత్తయ్య శైలజారెడ్డి ఇంట్లో అడుగుపెడతాడు చైతూ. మామయ్య సహకారంతో తల్లికూతురుని చైతూ ఎలా కలిపాడు, వాళ్ల ఇగోల్ని ఎలా జయించాడు అనేది బ్యాలెన్స్ కథ.

======================


బ్రదర్ ఆఫ్ బొమ్మాలి

నటీనటులు : అల్లరి నరేష్కార్తీకమోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : హర్ష వర్ధన్ రాణేబ్రహ్మానందంవెన్నెల కిషోర్శ్రీనివాస్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర

డైరెక్టర్ : చిన్ని కృష్ణ

ప్రొడ్యూసర్ : అమ్మి రాజు కనిమిల్లి

రిలీజ్ డేట్ : నవంబర్ 7 , 2014

కామెడీ కింగ్ అల్లరి నరేష్ హీరోగా కార్తీకమోనాల్ గజ్జర్ ఇతర పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ బ్రదర్ అఫ్ బొమ్మాలి’. ఈ సినిమా లో అల్లరిగా నరేష్ అక్కగా కార్తీక యాక్టింగ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది.  కోన వెంకట్ గా బ్రహ్మానందం కామెడీవెన్నెల కిషోర్శ్రీనివాస్ రెడ్డి కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అల్లరి నరేష్ ఎనర్జీ తో కూడిన ఫన్నీ  పెరఫార్మెన్స్శేఖర్ చంద్ర మ్యూజిక్కామెడీ సీన్స్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.