ZeeCinemalu - June 2

Tuesday,June 01,2021 - 09:46 by Z_CLU

rakshasudu-surya-zeecinemalu

రాక్షసుడు
నటీనటులు : సూర్య, నయనతార
ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా
డైరెక్టర్ : వెంకట్ ప్రభు
ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేట్ : 29 మే 2015
సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

=============================

brahmotsavam-zeecinemalu-mahesh

బ్రహ్మోత్సవం
నటీనటులు : మహేష్ బాబు, సమంత రుత్ ప్రభు, కాజల్ అగర్వాల్
ఇతర నటీనటులు : ప్రణీత సుభాష్, నరేష్, సత్యరాజ్, జయసుధ, రేవతి, శుభలేఖ సుధాకర్ మరియు తదితరులు…
మ్యూజిక్ డైరెక్టర్స్ : మిక్కీ జె. మేయర్, గోపీ సుందర్
డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల
ప్రొడ్యూసర్ : ప్రసాద్ V. పొట్లూరి
రిలీజ్ డేట్ : 20 మే 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మోత్సవం.’ కుటుంబ విలువలను వాటి ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించిన ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబును సరికొత్త ఆంగిల్ లో ప్రెజెంట్ చేశాడు. ఎప్పటికీ తన కుటుంబ సభ్యులు కలిసి మెలిసి ఉండాలన్న తన తండ్రి ఆలోచనలు పుణికి పుచ్చుకున్న హీరో, తన తండ్రి కలను ఎలా నేరవేరుస్తాడు అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

============================

akashamantha-zeecinemalu-fp

ఆకాశమంత
నటీ నటులు : ప్రకాష్ రాజ్, త్రిష, జగపతి బాబు, ఐశ్వర్య, గణేష్ తదితరులు.
సంగీతం : విద్యా సాగర్
నిర్మాత : దిల్ రాజు
రచన -దర్శకత్వం : రాదా మోహన్
‘ఆకాశమంత’ తండ్రి కూతురు మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్ ని పర్ఫెక్ట్ క్యాప్చర్ చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. 2009 లో రాధామోహన్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. సినిమాలో ప్రకాష్ రాజ్ , త్రిష నటన,పాటలు సినిమాకు హైలైట్.

=============================

agent-bhairava-zeecinemalu-vijay-keerthy-suresh

ఏజెంట్ భైరవ
నటీ నటులు : విజయ్, కీర్తి సురేష్, జగపతిబాబు
దర్శకత్వం: భరతన్
నిర్మాత : బెల్లం రామకృష్ణ
విడుదల : 7 జులై 2017
ఇళయ దళపతి విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా జగపతిబాబు విలన్ పాత్రలో నటించిన చిత్రం ‘ఏజెంట్ భైరవ’. పుష్యమి ఫిల్మ్‌ మేకర్స్‌ పతాకం బెల్లం రామకృష్ణారెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. భరతన్‌ దర్శకుడు.

==========================

bruce-lee-zeecinemalu-ramcharan

బ్రూస్ లీ
నటీనటులు : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : అరుణ్ విజయ్, కృతి కర్బందా, నదియా, సంపత్ రాజ్, బ్రహ్మానందం, ఆలీ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్
డైరెక్టర్ : శ్రీను వైట్ల
ప్రొడ్యూసర్ : D.V.V. దానయ్య
రిలీజ్ డేట్ : 16 అక్టోబర్ 2015
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరియర్ లోనే డిఫెరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ బ్రూస్ లీ. తన అక్క చదువు కోసం స్టంట్ మ్యాన్ గా మారిన యువకుడి క్యారెక్టర్ లో చెర్రీ పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. మెగాస్టార్ క్యామియో సినిమాకి మరో హైలెట్.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics