ZeeCinemalu - June 16

Tuesday,June 15,2021 - 09:38 by Z_CLU

Taxiwala-vijay-deverakonda-zeecinemalu

టాక్సీవాలా
నటీనటులు : విజయ్ దేవరకొండ, ప్రియాంక జవాల్కర్
ఇతర నటీనటులు : మాళవిక నాయర్, మధునందన్, కళ్యాణి, విష్ణు, రవి వర్మ, శిజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జేక్స్ బిజాయ్
డైరెక్టర్ : రాహుల్ సంక్రిత్యాన్
ప్రొడ్యూసర్ : SKN, బన్ని వాస్
రిలీజ్ డేట్ : 17 నవంబర్ 2018
అతి కష్టం మీద ఐదేళ్లు చదివి డిగ్రీ పూర్తిచేసిన శివ (విజయ్‌ దేవరకొండ), అన్నయ్య(రవి ప్రకాష్) వదిన(కళ్యాణి)లకు భారం కాకూడదని హైదరాబాద్‌లో ఉన్న ఫ్రెండ్‌(మధు నందన్‌) దగ్గరకు ఉద్యోగం కోసం వస్తాడు. అలా ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ 2-3 ఉద్యోగాలు చేసి వర్కౌట్ కాకపోవడంతో చివరికి ఓ టాక్సీవాలా గా సెట్ అవ్వాలనుకుంటాడు.
కారు కొనడానికి డబ్బు లేకపోవడంతో తన బంగారం అమ్మి శివ కి డబ్బులు ఇస్తుంది వదిన. అలా వదిన ఇచ్చిన డబ్బుతో కారు కొనేందుకు వెతుకుతున్న క్రమంలో రఘు రామ్(సిజ్జు) దగ్గర ఓ పాత కాంటెస్సా ఉందని తెలుసుకొని ఆ కారుని కొంటాడు శివ. అలా క్యాబ్‌ డ్రైవర్‌గా కెరీర్ మొదలుపెట్టిన శివ ఫస్ట్ డ్రైవ్ లో పరిచయం అయిన అనూష(ప్రియాంక జవాల్కర్) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
అంతా హ్యాపీగా సాగుతుందనుకున్న సమయంలో శివకి తను నడుపుతున్న కారులో దెయ్యం ఉందని తెలుస్తుంది. టాక్సీలో నిజంగానే దెయ్యం ఉందా..? ఇంతకీ టాక్సీలో ఉన్న ఆ పవర్‌ ఏంటి..? ఈ కథకి శిశిర (మాళవిక నాయర్‌) అనే అమ్మాయికు సంబంధం ఏంటి..? అనేది ‘టాక్సీవాలా’ కథ.

=========================

ongolu-gitta-ram-zeecinemalu

ఒంగోలు గిత్త
నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్
డైరెక్టర్ : భాస్కర్
ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్
రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013
రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

========================

konchem-ishtam-konchem-kashtam-zeecinemalu

కొంచెం ఇష్టం కొంచెం కష్టం
నటీనటులు : సిద్ధార్థ, తమన్నా
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, నాజర్, వేణు మాధవ్, సుధ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : శంకర్-ఎహసాన్-లాయ్
డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని
ప్రొడ్యూసర్ : నల్లమలుపు శ్రీనివాస్
రిలీజ్ డేట్ : 5 ఫిబ్రవరి 2009
పై చదువుల కోసమని సిటీకి వచ్చిన గీత, అక్కడే ఉండే సిద్ధు ప్రేమించుకుంటారు. ఎప్పుడైతే సిద్ధూ తమ ప్రేమ గురించి గీత ఫాదర్ కి చెప్తాడో, అప్పుడు సిద్ధూ తల్లిదండ్రులు కలిసి ఉండటం లేదు అనే ఒకే కారణంతో, ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేస్తాడు. అసలు సిద్ధూ తల్లిదండ్రులు విడిపోవడానికి కారణం ఏంటి..? తన ప్రేమను దక్కించుకోవడానికి సిద్ధూ ఏం చేస్తాడు అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

============================

vasantham-venkatesh-zeecinemalu

వసంతం
నటీనటులు : వెంకటేష్, ఆర్తి అగర్వాల్, కళ్యాణి
ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్, ఆకాష్, సునీల్, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : విక్రమన్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 11 జూలై 2003
స్నేహానికి, ప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

========================

geetha_govindam_గీతగోవిందం-zeecinemalugeetha_govindam_గీతగోవిందం-zeecinemalu

గీతగోవిందం
న‌టీన‌టులు : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక, నిత్యామీనన్, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌,
రాహుల్ రామ‌కృష్ణ‌, అభయ్ తదితరులు
సంగీతం : గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌ : మ‌ణికంద‌న్‌
స‌మ‌ర్ప‌కులు : అల్లు అర‌వింద్‌
నిర్మాత‌ : బ‌న్నీ వాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం : ప‌రుశురామ్‌
విడుదల తేది : 15 ఆగస్ట్ 2018
మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో GA2 పిక్చర్స్ పతకం పై సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన సినిమా “గీత గోవిందం”. టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన ఈ సినిమా లో హ్యాపెనింగ్ హీరో, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక… గోవింద్, గీత పాత్రల్లో ఒదిగిపోయారు. అలానే గోపీసుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మరొక అసెట్. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

==========================

akashamantha-fpc-trisha-zeecinemalu

ఆకాశమంత
నటీ నటులు : ప్రకాష్ రాజ్, త్రిష, జగపతి బాబు, ఐశ్వర్య, గణేష్ తదితరులు.
సంగీతం : విద్యా సాగర్
నిర్మాత : దిల్ రాజు
రచన -దర్శకత్వం : రాదా మోహన్
‘ఆకాశమంత’ తండ్రి కూతురు మధ్య ఉండే ప్రేమ, ఎమోషన్ ని పర్ఫెక్ట్ క్యాప్చర్ చేసిన సినిమాల్లో బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. 2009 లో రాధామోహన్ దర్శకత్వంలో విడుదలైన తమిళ అనువాద చిత్రం. సినిమాలో ప్రకాష్ రాజ్, త్రిష నటన,పాటలు సినిమాకు హైలైట్.